ఇండియాబుల్స్ గ్రూపులో అవకతవకలు జరుగుతున్నాయి. ఐబీ గ్రూప్ ఛైర్మన్ మోసాలకు పాల్పడ్డారు. సుమారు రూ.98 వేల కోట్ల సొమ్ము దుర్వినియోగమైంది. ఛైర్మన్ సహా గ్రూపు డైరెక్టర్లంతా మూకుమ్మడిగా నిధులను పక్కదారి పట్టించారు. ప్రధానంగా చైర్మన్ సమీర్ గెహ్లాట్ సంస్థ నిధులను సొంతానికి వాడుకున్నారు. కంపెనీ నిధులను సొంత వ్యాపారాలకు, ఛైర్మన్ బంధువుల వ్యాపారాలకు మళ్లాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఆడిటర్లు కూడా గ్రూపుతో కుమ్మక్కయ్యారు. దీనిపై తక్షణం విచారణ జరిపించండి అంటూ అభయ్ యాదవ్ అనే పిటిషనర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ దెబ్బకు ఇండియాబుల్స్ గ్రూపులో ఉన్న ఐబి హౌసింగ్, ఐబి రియల్ ఎస్టేట్, ఐబి హోల్ సేల్ అనే కంపెనీల స్టాక్స కుప్పకూలాయి. ఏకంగా 10 నుంచి 20 శాతం వరకూ పతనమయ్యాయి.

నిన్న ఏం జరిగింది (నిన్న)
అభయ్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇండియాబుల్స్ గ్రూప్ కూడా సుప్రీం కోర్ట్ తలుపుతట్టింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తమపై బురదజల్లుతున్నారని, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్తున్నారని నివేదించింది. రూ.10 కోట్లు ఇవ్వకపోతే ఇలా అనేక చట్ట సంస్థలకు ఇండియాబుల్స్‌ఫై ఫిర్యాదు చేసి మీ సంస్థను రోడ్డుకీడుస్తామంటూ కొంత మంది తమను బెదిరిస్తున్నారంటూ ఐబి గ్రూపు కోర్టుకు నివేదించింది. దీంతో ఈ కేసును తక్షణం విచారించాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయించేందుకు గురువారం కోర్టులో వాదనలు వినాల్సి ఉంది.

ఈ రోజు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ (నేడు)
''నాకు ఏ పాపమూ తెలియదు. నా చేత మే నెలలో ఇండియాబుల్స్‌కు చెందిన నాలుగు స్టాక్స్ కొనిపించారు. కొద్ది రోజుల క్రితం కొన్ని కాగితాలపై నా సంతకాలు తీసుకున్నారు. ఇండియాబుల్స్ పై ఏదో కేస్ పెట్టబోతున్నామని చెప్పారు. అంతే కానీ నాకు అసలు ఏం జరుగుతోందో కూడా తెలియదు. నా పేరును, సంతకాన్ని ఉపయోగించుకుని కొంత మంది దురుద్దేశపూర్వకంగా ఇండియాబుల్స్‌పై ఆరోపణలు చేశారు. నాకు ఇండియాబుల్స్ అంతర్గత వ్యవహారాలపైనా, కంపెనీ పనితీరు మీద ఎలాంటి అవగాహనా లేదు. అసలేం జరిగిందో, ఏం జరుగుతోందో కూడా నాకు తెలియదు. నన్ను మన్నించి వదిలేయండి. చేతులు జోడించి మీకు మొక్కుతున్నా.. ! " - సుప్రీంలో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్న సమయంలో అభయ్ రాసిన లేఖ.

మరి రేపు...
చూశారుగా.. ఇదీ ఇండియాబుల్స్ గ్రూపులో తాజా డెవెలప్‌మెంట్. అభయ్ అనే వ్యక్తి తాను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో ఐబీ గ్రూప్ స్టాక్స్ ఎగిరి గంతేశాయి. ఐబీ హౌసింగ్ పది శాతం వరకూ పెరిగింది. మిగిలిన స్టాక్స్ కూడా లాభాల బాట పట్టాయి. అయితే ఈ ట్విస్టులకు పుల్ స్టాప్ పడిందా అంటే మాత్రం ధైర్యంగా అవును అని చెప్పలేని స్థితి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications