For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐడియా-ఎయిర్‌టెల్‌కు జియో భారీ 'రెవెన్యూ' దెబ్బ: ఆంధ్రప్రదేశ్ సహా ఇక్కడ షాక్

|

కోల్‌కతా: రిలయన్స్ జియో సత్తా చాటింది. రెవెన్యూ మార్కెట్ షేర్ (RMS)లో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో వొడాఫోన్ - ఐడియా నిలవగా, మూడో స్థానంలో భారతీ ఎయిర్‌టెల్ నిలిచింది. వరుసగా పది క్వార్టర్స్‌లో వొడాఫోన్ - ఐడియా క్షీణిస్తూ వచ్చింది. ఇప్పుడు RMS పెరగడంతో పాటు మొదటి స్థానంలో నిలిచింది.

రూ.10వేల లోపు ధర కలిగిన 6GB రామ్ స్మార్ట్ ఫోన్!రూ.10వేల లోపు ధర కలిగిన 6GB రామ్ స్మార్ట్ ఫోన్!

ఎయిర్‌టెల్‌కు జియో భారీ దెబ్బ

ఎయిర్‌టెల్‌కు జియో భారీ దెబ్బ

మార్చి క్వార్టర్‌లో రిలయన్స్ జియో 182 బేసిక్ పాయింట్స్ పెరిగి RMS షేర్‌లో 31.7 శాతం వాటాను కలిగి ఉంది. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్‌టెల్ 285 బేసిక్ పాయింట్లు తగ్గి 27.3 శాతంగా (RMS) ఉంది. వొడాఫోన్ - ఐడియా 57 బేసిక్ పాయింట్స్ పెరిగి 32.2 శాతం RMSతో ఉంది. ఈ మేరకు బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఈ నివేదికను వెల్లడించింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దీనిని తయారు చేశారు.

దూసుకెళ్తున్న జియో

దూసుకెళ్తున్న జియో

గత ఏడాది ఆగస్ట్ నెలలో వొడాఫోన్-ఐడియా విలీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఇవి విలీనం ఆధారంగానే RMS డేటాను ఇస్తున్నాయి. రిలయన్స్ జియో 21 సర్కిల్స్‌లలో భారీగా రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. 15 మార్కెట్లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. A, B, C సర్కిల్స్‌లలో జియో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. మెట్రో మార్కెట్‌లో వొడాఫోన్- ఐడియా అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్ కీలకమైన కర్ణాటక (15 శాతం తగ్గుదల), తమిళనాడు (16 శాతం తగ్గుదల), ఢిల్లీ (33 శాతం తగ్గుదల), ఆంధ్రప్రదేశ్ (8 శాతం తగ్గుదల) భారీగా క్షీణించింది. RMSలో ఎయిర్‌టెల్ మూడో స్థానానికి పడిపోయింది.

ఐడీయా నెంబర్ వన్.. దరిదాపుల్లోనే జియో

ఐడీయా నెంబర్ వన్.. దరిదాపుల్లోనే జియో

క్వార్టర్ 3లో వొడాఫోన్ ఐడియా RMS 31.6 శాతం, రిలయన్స్ జియో 29.9 శాతం, ఎయిర్‌టెల్ 30.2 శాతంగా ఉంది. క్వార్టర్ 4లో ఎయిర్‌టెల్ భారీగా నష్టపోయింది. నాలుగో క్వార్టర్‌లో వొడాఫోన్ ఐడియా 32.2 శాతం, రిలయన్స్ జియో 31.7 శాతం, ఎయిర్‌టెల్ 27.3 శాతానికి పడిపోయింది. భారతీ ఎయిర్‌టెల్ వరుస క్షీణతలతో 11.4 శాతం మేర తగ్గింది.

1 శాతం తగ్గిన టెలికం సెక్టార్ ఏజీఆర్

1 శాతం తగ్గిన టెలికం సెక్టార్ ఏజీఆర్

రిలయన్స్ జియో అడ్జస్టెజ్ గ్రాస్ రెవెన్యూ (AGR) 4 శాతం పెరిగి రూ.9,986 కోట్ల (NLD-నేషనల్ లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ రెవెన్యూ) వద్ద ఉండగా, వొడాఫోన్ ఐడియా AGR 0.3 శాతం పెరిగి 10,149 కోట్లుగా ఉంది. ఎయిర్‌టెల్ AGR రూ.8,608.2 కోట్లుగా ఉంది. మొత్తంగా టెలికం సెక్టార్ AGR(NLD రెవెన్యూ కలుపుకొని) నాలుగో క్వార్టర్‌లో 1 శాతం తగ్గి, రూ.31,518.2 కోట్లుగా ఉంది.

ఈ సర్కిల్స్‌లో ఐడియా ఏజీఆర్‌ను దాటేసిన జియో

ఈ సర్కిల్స్‌లో ఐడియా ఏజీఆర్‌ను దాటేసిన జియో

ముంబై, తమిళనాడు, యూపీ-ఈస్ట్, ఆంధ్రప్రదేశ్ తదితర సర్కిల్స్‌లలో వొడాఫోన్ ఐడియా AGR తగ్గింది. రిలయన్స్ జియో కారణంగా ఈ నష్టం జరిగింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలు క్రమంగా తమ మార్కెట్‌ను కోల్పోతుండగా జియో మార్కెట్ పెరుగుతోంది. ఓ వైపు రిలయన్స్ జియో ఫోర్త్ క్వార్టర్ నాటికి 27 మిలియన్ యూజర్లు పెరిగి 65 శాతానికి పెరిగింది. రూ.840 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు ఎయిర్‌టెల్ రూ.89.8 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.101 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. వొడాఫోన్ - ఐడియా పరిస్థితి కూడా అలాగే ఉంది.

English summary

ఐడియా-ఎయిర్‌టెల్‌కు జియో భారీ 'రెవెన్యూ' దెబ్బ: ఆంధ్రప్రదేశ్ సహా ఇక్కడ షాక్ | Reliance Jio pips Airtel to claim number 2 spot in revenue market share

Reliance Jio Infocomm has become a strong No. 2 in India by revenue market share (RMS) in the January-March quarter, racing ahead of Bharti Airtel, while Vodafone Idea managed to keep its No. 1 spot with its RMS rising for the first time after 10 quarters of decline, analysts said.
Story first published: Wednesday, June 12, 2019, 13:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X