For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనిల్ అంబానీకి మరో షాక్, రిలయన్స్ పవర్ నష్టం రూ.2,951 కోట్లు

|

అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ పవర్ గత ఆర్థిక సంవత్సరం క్వార్టర్ 4లో త్రైమాసికంలో రూ.3,558.51 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో సంస్థ రూ.189.21 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా, ఈసారి నష్టపోయింది.

2018-19 పూర్తి ఆర్థిక సంతవ్సరానికి సంస్థ రూ.2,951.82 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.840.46 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. డిబెంచర్లను జారీ చేసి నిధులను సమీకరించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. అంతకుముందు ఏడాది రూ.9,871.01 కోట్ల మొత్తం ఆదాయం ఉండగా, ఈ ఏడాది అది రూ.8,534.26 కోట్లకు తగ్గింది. అయితే ఇతర ఆదాయాలు మాత్రం రూ.278.28 కోట్లు (2018) నుంచి రూ.332.95 కోట్లకు (2019)లో పెరిగింది.

రైతుబంధు: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు ఎలా పడుతుంది?రైతుబంధు: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు ఎలా పడుతుంది?

Anil Ambanis Reliance Power suffers Rs.2,951 crore loss in FY19

రిలయన్స్ బీపీకి కేజీ బేసిన్

తాజా వేలంలో ఓఎన్జీసీ, వేదాంతాలు తొమ్మిది చొప్పున చమురు, గ్యాస్ క్షేత్రాలు దక్కించుకోనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ భాగస్వామి బీపీ పీఎల్‌సీ సంస్థలు కేజీ బేసిన్ గ్యాస్ క్షేత్రాన్ని దక్కించుకుందని తెలుస్తోంది. 32 చమురు-గ్యాస్ అన్వేషణ క్షేత్రాల కోసం నిర్వహించిన వేలంలో వచ్చిన బిడ్స్ ప్రక్రియను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు.

ఈ బిడ్స్ ప్రకారం ఓఎన్జీసీ, వేదాంతాలు తొమ్మిది క్షేత్రాల్లో, ఆయిల్ ఇండియా పన్నెండు క్షేత్రాల్లో బిడ్స్ దాఖలు చేశాయి. రిలయన్స్-బీపీ సంయుక్తంగా ఒక కేజీ బేసిన్ బ్లాకును పొందనున్నాయి. మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తర్వాత వేలం విజేతల్ని ప్రకటిస్తారు.

English summary

అనిల్ అంబానీకి మరో షాక్, రిలయన్స్ పవర్ నష్టం రూ.2,951 కోట్లు | Anil Ambani's Reliance Power suffers Rs.2,951 crore loss in FY19

Anil Ambani led Reliance Power, the power generation and coal resources company, reported a net loss of Rs 2,951.82 crore for the financial year 2018-19 as against net profit of Rs 840.46 crore in FY18.
Story first published: Monday, June 10, 2019, 13:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X