For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్డ్ డిపాజిట్తో క్రెడిట్ కార్డు పొందవచ్చు

By Jai
|

ఏదైనా బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు కంపెనీ నుంచి మీరు క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటే ముందు ఆ ఆర్థిక సంస్థలు చూసేది మీ క్రెడిట్ స్కోరు. మీ క్రెడిట్ స్కోర్ సరిగా లేకపోతే మీకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి ఆ కంపెనీలు ముందుకు రావు. అలాంటప్పుడు మీరు స్కోర్ పెచుకోవడం ఒక్కటే మార్గం. దీనికి ఉపయోగపడేందుకు ఒక క్రెడిట్ కార్డు ఉంది. అదే సెక్యూరిటీ క్రెడిట్ కార్డు. దీన్ని వినియోగిస్తూ సరిగ్గా బిల్లులు చెల్లించుకుంటూ వెళితే క్రమంగా మీ క్రెడిట్ స్కోర్ ప్రేరుగుతుంది. అప్పుడు మీకు మరో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ క్రెడిట్-డెబిట్ కార్డ్స్ ఉపయోగిస్తున్నారా, తెలుసుకోండి...ఈ క్రెడిట్-డెబిట్ కార్డ్స్ ఉపయోగిస్తున్నారా, తెలుసుకోండి...

ఈ కార్డు పొందడమెలా?

ఈ కార్డు పొందడమెలా?

ఈ సెక్యూర్డు క్రెడిట్ కార్డులను బ్యాంకులు అందిస్తుంటాయి.

అయితే ఈ కార్డు పొందాలంటే మీరు హామీగా కొంత సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ మీ క్రెడిట్ కార్డుపై బిల్లు చెల్లించనట్టయితే మీ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఆ సొమ్మును బ్యాంకు తీసుకుంటుందన్నమాట.

మీకు క్రెడిట్ స్కోర్ లేనప్పుడు క్రెడిట్ కార్డు ఇచ్చే సాహసం చేయవు. అందుకే మీరు చేసే డిపాజిట్ ను బట్టి మీకు క్రెడిట్ పరిమితి ఇచ్చి కార్డును జారీ చేస్తారు. ఈ కార్డును సక్రమంగా వినియోగిస్తూ నిర్దేశిత కాలంలో బిల్లులు చెల్లించడం మర్చిపోవద్దు.

రకాలు

రకాలు

- క్రెడిట్ కార్డుల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఈ కార్డులు ఇచ్చే ప్రయోజనాన్ని బట్టి వాటిని ఎంచుకోవాలి.

- ఎలాగూ క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ఖర్చులు చేయకుండా కాస్త క్రమశిక్షణ అలవరచుకోవాలి.

- సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు ఇచ్చే ముందు మీ క్రెడిట్ హిస్టరి గురించి అంతగా ఎం క్వైరీ ఏమీ ఉండదు.

- ఈ కార్డు అప్రూవల్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.

- బ్యాంకులు తమ సెక్యూర్డు కార్డుల వివరాలను క్రెడిట్ బ్యూరోలకు తెలియ జేస్తుంటాయి. దీని వాళ్ళ మీ క్రెడిట్ లిమిట్, రీ పేమెంట్ విధానం తెలిసిపోతుంది.

- కాబట్టి ఎవరైతే తమ సెక్యూర్డ్ కార్డును మెరుగ్గా వినియోగించుకుంటారో వారు మంచి క్రెడిట్ స్కోరును పొందడానికి అవకాశం ఉంటుంది.

- ఇక మీరు క్రెడిట్ కార్డు పొందడానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్ పై కొన్ని బ్యాంకులు వడ్డీ రేటును కూడా అందిస్తుంటాయి. మీ డిపాజిట్ పై నిర్దేశిత నిభందనల ప్రకారం క్రెడిట్ లిమిట్ ఉంటుంది.

ఫిక్స్డ్ డిపాజిట్ పై క్రెడిట్ కార్డు లిస్తున్న బ్యాంకులు

ఫిక్స్డ్ డిపాజిట్ పై క్రెడిట్ కార్డు లిస్తున్న బ్యాంకులు

- ఐసిఐసిఐ బ్యాంక్ కొరల్ క్రెడిట్ కార్డు : అవసరమైన ఫిక్స్డ్ డిపాజిట్ రూ. 20,000

- యాక్సిస్ బ్యాంకు ఇన్ స్టా ఈసీ క్రెడిట్ కార్డు : అవసరమైన ఫిక్స్డ్ డిపాజిట్ రూ. 20,000

- ఎస్ బీ ఐ ఉన్నతి : అవసరమైన ఫిక్స్డ్ డిపాజిట్ రూ. 25,000

- కోటక్ మహీంద్రా ఆక్వా గోల్డ్ క్రెడిట్ కార్డు : అవసరమైన ఫిక్స్డ్ డిపాజిట్ రూ. 25,000

- యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా అన్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు రూ . 25,000

- ఆంధ్రాబ్యాంక్ వీసా క్లాసిక్ : 10,000

ఈ బ్యాంకులు ఇచ్చే కార్డులపై జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు ఉంటాయి. అయితే ఒక్కో బ్యాంకు చార్జీలు ఒక్కోవిధంగా ఉంటాయి కాబట్టి మీరు బ్యాంకు శాఖను సంప్రదించడం మంచిది.

English summary

ఫిక్స్డ్ డిపాజిట్తో క్రెడిట్ కార్డు పొందవచ్చు | Credit Card Against Fixed Deposit

Secured credit cards are issued by banks against fixed deposits (FD). The FD, thus, acts as collateral, unlike other unsecured credit cards where the bank decides one’s credit limit on the basis of their salary, credit history and so on.
Story first published: Friday, June 7, 2019, 14:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X