For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI రెపో రేటు తగ్గిస్తే సరిపోతుందా.. బ్యాంకుల కస్టమర్ల పరిస్థితేమిటి?

|

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో వడ్డీ రేటును రెండుసార్లు తగ్గించారు. ఇప్పుడు తగ్గిస్తే ఇది మూడోసారి అవుతుంది. పావు శాతం చొప్పున గతంలో రెండుసార్లి తగ్గించారు. దీంతో రెపో రేటు 6 శాతానికి తగ్గింది. ఈసారి ఆర్బీఐ వడ్డీ రేటును గతంలో వలె పావు శాతం తగ్గిస్తుందా లేక అర శాతం తగ్గిస్తుందా అనే దానిపై సస్పెన్స్ నెలకొని ఉంది. లేదంటే 25 - 50 బేసిక్ పాయింట్ల మధ్య కోత వేస్తారా చూడాలి.

PM కిసాన్ నిధి: ప్రతి రైతుకు లబ్ధితో పాటు వీరికి ప్రయోజనాలు.PM కిసాన్ నిధి: ప్రతి రైతుకు లబ్ధితో పాటు వీరికి ప్రయోజనాలు.

రెపో రేటు తగ్గింపుకు కారణాలు

రెపో రేటు తగ్గింపుకు కారణాలు

రెపో రేటును 6 శాతం వద్దే ఉంచాలనుకున్నా, అలాగే తగ్గించాలన్నా పలు కారణాలు చూపించవచ్చు. వడ్డీ రేటు యథాతథంగా ఉంచితే ముందు ముందు ద్రవ్యోల్భణం పెరుగుతుందన్న అంచనాల వల్ల అలా చేసే అవకాశముంది. రేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్భణం దిగువకు వచ్చినందున తగ్గించారని భావించవచ్చు. ద్రవ్యోల్భణం పెరిగే అవకాశమున్నందున రెపో రేటును యథాతథంగా ఉంచే పరిస్థితిని కొట్టి పారేయలేమని అంటున్నారు. రెపో రేటు పావు శాతం తగ్గే అవకాశముందని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చునని కొంతమంది, అలాగే ఉండవచ్చునని మరికొంతమంది చెబుతున్నారు.

డిపాజిట్ రేట్లు తగ్గిస్తేనే..

డిపాజిట్ రేట్లు తగ్గిస్తేనే..

ఆర్బీఐ ఈ ఏడాదిలో రెండుసార్లు రెపో రేటును తగ్గించడం ద్వారా 6.5 శాతంగా ఉన్న రేటు ఇప్పుడు 6 శాతంగా ఉంది. అదే సమయంలో పలు బ్యాంకుల యావరేజ్ మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు జనవరిలోని 10.38 శాతం నుంచి ఏప్రిల్ నాటికి 10.42 శాతానికి పెరిగింది. డిపాజిట్ రేట్లు తగ్గించకుండా తాము తగ్గించడం ఇబ్బందికరమని బ్యాంకులు చెబుతున్నాయి. ఆర్బీఐ రేటు తగ్గించినా బ్యాంకులు డిపాజిట్ రేట్లు తగ్గించలేకపోయాయి. ఎందుకంటే ఇవి రుణాల కంటే పెరుగుదల నెమ్మదిగా ఉంది.

సులభతరం దిశగా ఆర్బీఐ అడుగులు

సులభతరం దిశగా ఆర్బీఐ అడుగులు

2019 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్ వృద్ధి 10 శాతం పెరిగింది. అదే విధంగా క్రెడిట్ వృద్ధి 13 శాతం పెరిగింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి మాత్రం ఆర్బీఐ రెపో రేటును తగ్గించాక అందుకు అనుగుణంగా నడుచుకున్నాయి. డాలర్లతో లిక్విడిటీ మార్చడిని సులభతరం చేసేదిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది. అలాగే ప్రభుత్వ బాండ్లను తిరిగి కొనుగోలు చేయడంపై దృష్టి సారించాయి.

ఆర్బీఐ తగ్గిస్తే లాభం లేదు

ఆర్బీఐ తగ్గిస్తే లాభం లేదు

ఆర్బీఏ రేట్ల కోత విధించినా అవి వాస్తవ ఆర్థిక వ్యవస్థలోకి బదలీ అవుతాయా అన్న దానిపై హామీ లేదని భావిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ పావు శాతం చొప్పున రెండుసార్లు రెపో రేటు తగ్గించినా అన్ని బ్యాంకుల సగటు చూసుకుంటే కేవలం 6 బేసిక్ పాయింట్ల మేరే ఆ రేట్లను వినియోగదారులకు బదలీ చేశాయని అంటున్నారు. రెపో రేటు కోతలను రుణ రేట్ల తగ్గింపు దిశగా మరింత మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

English summary

RBI రెపో రేటు తగ్గిస్తే సరిపోతుందా.. బ్యాంకుల కస్టమర్ల పరిస్థితేమిటి? | RBI set to cut repo rate, Will banks pall it to customers?

RBI Monetary Policy Committee (MPC) will announce its second bi monthly monetary policy statement for 2019-20 today in which the central bank is widely expected to opt for a 25 basis point rate cut.
Story first published: Thursday, June 6, 2019, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X