For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెన్నా సిమెంట్స్ ఐపీవోకు సెబీ ఓకే, రూ 1,550 కోట్ల సమీకరణ

By Jai
|

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ .... ఐపీవో( ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ )కు మార్గం సుగమం అయింది . ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియా ) పెన్నా సిమెంట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఐపీవో ద్వారా కంపెనీ రూ 1,550 కోట్లు సమీకరించనుంది.

మొత్తం నిధుల్లో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ 1,300 కోట్లు , ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ 250 కోట్లను పెన్నా సిమెంట్స్ ప్రమోటర్ అయిన పీఆర్ సిమెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ సమీకరించనుంది.

ఈ ఐపీవోజి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఏదైల్వాయ్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐఐఫెల్ హోల్డింగ్స్ లిమిటెడ్, జె ఎం ఫైనాన్సియల్ లిమిటెడ్, ఎస్ సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ వ్యవహరిస్తున్నాయి.

మీ చిన్నారి కోసం 'సుకన్య సమృద్ధి యోజనా'మీ చిన్నారి కోసం 'సుకన్య సమృద్ధి యోజనా'

Penna Cement Industries gets SEBI nod for Rs 1,550 crore IPO

ఐపీవో ద్వారా సమీకరించే నిధులను రుణాల తిరిగి చెల్లింపు కోసం (పూర్తిగా లేదా పాక్షికంగా ), అలాగే ఇతర కార్పొరేట్ అవసరాలకోసం వినియోగించనున్నట్లు పెన్నా సిమెంట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద సిమెంట్ కంపెనీల్లో ఒకటైన పెన్నా సెమెంట్స్కు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ , మహారాష్ట్రలో నాలుగు సమీకృత సిమెంట్ ఉత్పత్తి ప్లాంట్లు, రెండు గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయ్. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్ టన్నులు కావడం విశేషం.

1991 లో స్థాపించిన పెన్నా సిమెంట్స్ కు పెన్నా ప్రతాప్ రెడ్డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గ వ్యవహరిస్తున్నారు. పెన్నా గ్రూప్ కేవలం సిమెంట్ రంగంలోనే కాకుండా అనేక ఇతర రంగాల్లోకి విస్తరించింది.

English summary

పెన్నా సిమెంట్స్ ఐపీవోకు సెబీ ఓకే, రూ 1,550 కోట్ల సమీకరణ | Penna Cement Industries gets SEBI nod for Rs 1,550 crore IPO

Hyderabad based Penna Cement Industries Ltd has received SEBI approval for its Rs 1,550 crore Initial Public Offering (IPO).
Story first published: Wednesday, June 5, 2019, 7:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X