అప్పుల ఊబిలో కూరుకుపోయిన భూషణ్ ఎనర్జీ లిమిటెడ్‌ను కొనుగోలు చేసినట్లు టాటా స్టీల్ ప్రకటించింది. భూషణ్ ఎనర్జీని దాదాపు రూ.800 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా స్టీల్ చేసిన తీర్మానానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో టాటా స్టీల్ ఈ ప్రకటన చేసింది.
టాటా స్టీల్ బీఎస్ఎల్ విజయవంతంగా భూషణ్ ఎనర్జీ లిమిటెడ్‌ను కొనుగోలు పూర్తి చేసింది. ఈ కొనుగోలులో సెబీ నిబంధనలను పూర్తిగా పాటించామని టాటా స్టీల్ ఓ ప్రకటనలో తెలియజేసింది. గురువారం ఈ బిడ్‌కు సంబంధించి భూషణ్ ఎనర్జీ మాజీ ప్రమోటర్ నీరజ్ సింఘాల్ అభ్యంతరాలను ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ తిరస్కరించింది.

భూషణ స్టీల్‌కు భూషణ్ ఎనర్జీ అనుబంధ సంస్థ. ఇప్పటికే టాటా స్టీల్ భూషణ్ స్టీల్‌ను కొనుగోలు చేసింది. అప్పట్లో రూ.35,200 కోట్లను ఈ డీల్ కోసం వెచ్చించింది. భూషణ్ ఎనర్జీ ఒడిశాలోని డెంకనాల్ కేంద్రంగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భూషణ్ స్టీల్ గ్రాస్ డెబిట్ రూ.2,336 కోట్లుగా ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications