For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.123కు పెరిగిన ఎయిర్‌టెల్ ARPU, కానీ ఇది సరిపోదు...

|

జనవరి - మార్చి క్వార్టర్‌లో సంస్థ ఆర్పు (ARPU-యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) 6.5 శాతం పెరిగి రూ.123కు పెరిగిందని భారతీ ఎయిర్‌టెల్ గురువారం ప్రకటించింది. అయినప్పటికీ ఇది సరిపోదని పేర్కొంది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ ఆర్పు 116గా ఉంది. ఏడాది చివరలో ఆర్పు పెరగడం సంతోషకరమని, అయితే రూ.123తో స్థిరంగా ఉన్నట్లు కాదని భారతీ ఎయిర్‌టెల్ ఇండియా-సౌత్ ఏసియా ఎండీ అండ్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు.

రూ.500 లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో ప్రయోజనాలివి.. రూ.500 లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో ప్రయోజనాలివి..

అంతకుముందు వచ్చిన ఏడాది కంటే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ బిజినెస్ రెండింతల కంటే ఎక్కువగా ఉంది. 2019 జనవరి-మార్చి పీరియడ్‌లో రూ.1,377.8 కోట్లుగా కాగా, అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇది రూ.482.2 కోట్లుగా ఉంది.

Airtel Q4 result: ARPU grows 6.5% to Rs 123 in Jan-Mar 2019

కాగా, ఎయిర్‌టెల్‌ నికర లాభం గత ఆర్థిక ఏడాది (2018-19) జనవరి-మార్చి క్వార్టర్‌లో 29 శాతం ఎగిసి రూ.107.2 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే క్వార్టర్‌లో ఈ కంపెనీకి రూ.82.9 కోట్ల నికర లాభం వచ్చింది. భారత మొబైల్‌ వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఆఫ్రికా వ్యాపారం పుంజుకోవడం, అసాధారణ ఆదాయ లాభాల కారణంగా ఈ స్థాయి నికర లాభాన్ని ఈ కంపెనీ ప్రకటించింది.

గత ఆర్థిక సంవత్సరం ఆదాయం 6.2 శాతం ఎగిసి, రూ.20,602.2 కోట్లకు పెరిగింది. గత క్యూ4లో రూ.2,022.1 కోట్ల మేర అసాధారణ ఆదాయ లాభాలువచ్చాయి.

English summary

రూ.123కు పెరిగిన ఎయిర్‌టెల్ ARPU, కానీ ఇది సరిపోదు... | Airtel Q4 result: ARPU grows 6.5% to Rs 123 in Jan-Mar 2019

Telecom operator Bharti Airtel Thursday said its average revenue per user rose by 6.5 per cent to Rs 123 in the January-March quarter which is still not at "sustainable" level for the sector. The company had ARPU of Rs 116 in the same period a year ago.
Story first published: Friday, May 31, 2019, 11:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X