For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేస్ అప్పడాలు వచ్చేస్తున్నాయోచ్ ! నిజమేరా బాబూ

By Chanakya
|

పెప్సీ కంపెనీ పాపడ్స్ తయారు చేయబోతోంది. అవును ఇది నిజం. ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. లేస్ బ్రాండ్ కింద ఈ పాపడ్స్‌ను రూపొందించబోతున్నట్టు పెప్సీ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో మొదటగా వీటిని లాంచ్ చేయబోతున్నారు. ఈ రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ఉన్న నేపధ్యంలో ఈ ప్రాధాన్యమివ్వబోతున్నట్టు పెప్సికో ఇండియా సీనియర్ డైరెక్టర్ దిలేన్ గాంధీ వివరించారు.

పాపడ్ అంటే ప్రాణం

ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో పప్పు, సాంబార్‌లతోపాటు పాపడ్‌ను తినడానికి అధికంగా ఇష్టపడ్తారని, అందుకే లేస్ బ్రాండ్ నేమ్‌తో హ్యాండ్ మేడ్ క్రంచీ పాపడ్‌ను తీసుకువస్తున్నట్టు పెప్సీకో ఇండియా ప్రకటించింది. ప్రాంతాలు, రుచులను పరిగణలోకి తీసుకుని కొత్త ప్రోడక్టులను రూపొందిస్తున్నామని అందులో భాగంగానే పాపడ్ ఐడియా వచ్చిందని పెప్సీకో చెబ్తోంది. ఇప్పటివరకూ పాపడ్స్‌లో పాపులర్ బ్రాండ్ ఏదీ జనాల్లో లేదు. అందుకే ఈ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు లేస్ యత్నిస్తోంది.

Pepsi to spice up regional focus with papadam

ప్రధానంగా దక్షిణాది మార్కెట్లలో పెప్సీకో ప్రోడక్టులకు మంచి ఆదరణ ఉందని, దీన్ని మరింత పెంచుకోవడానికే తన పోర్ట్‌ఫోలియోలో పాపడ్‌ను చేర్చినట్టు పెప్సీకో చెబ్తోంది. ఇంతవరకూ చిప్స్, కుర్‌కురే వంటికే పెద్ద మార్కెట్ ఉందని, దాన్ని మెల్లిగా మార్చి స్థానిక రుచులను కూడా చేర్చడమే తమ ఉద్దేశమంటోంది కంపెనీ. అయితే నమ్‌కీన్ మార్కెట్‌పై ఇప్పటికీ హల్దీరామ్స్‌దే పట్టు. దాన్ని ఎలా అయినా కొద్దోగొప్పో చేజిక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పెప్సీ ఈ తరహా ప్రాంతీయ రుచులకు అధిక ప్రాధాన్యమిస్తోంది.

Read more about: pepsi పెప్సీ
English summary

లేస్ అప్పడాలు వచ్చేస్తున్నాయోచ్ ! నిజమేరా బాబూ | Pepsi to spice up regional focus with papadam

The US food and beverages giant said it has taken inspiration from hand-made and home-dried crunchy ‘papad’ that is widely consumed with rice and rasam, dal or sambhar. The new product under its Lay's brand has been launched in Tamil Nadu, Karnataka, Andhra Pradesh and Kerala.
Story first published: Thursday, May 30, 2019, 14:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X