For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్చరిక!: మే 31వలోగా మీ అకౌంట్‌లో రూ.12 ఉండకుంటే రూ.2,00,000 లక్షల ఇన్సురెన్స్ కోల్పోతారు

|

చాలామంది వేతనజీవుల బ్యాంక్ అకౌంట్లలో నెలాఖరు నాటికి దాదాపు జీరో బ్యాలెన్స్ ఉంటుంది. అయితే ఈ నెలాఖరు (మే 31) తేదీ నాటికి మీ బ్యాంక్ అకౌంట్‌లో కొంత మొత్తం ఉండేలా చూసుకోండి. అప్పుడే రూ.2 లక్షల ఇన్సురెన్స్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాల కోసం మీ అకౌంట్ నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతుంది.

ఒకవేళ మే 31వ తేదీ నాటికి మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకుంటే మీరు ఈ (ఇన్సురెన్స్) ప్రయోజనాలు పొందలేకపోవచ్చు. PMSBY, PMJJBY పథకాల వల్ల ఎంతో ప్రయోజనం. ఈ రెండు స్కీంల ప్రయోజనాలు పొందాలంటే మీ అకౌంట్‌లో డబ్బులు ఉండేలా చూసుకోవడం మంచిది. PMSBY కింద పాలసీదారుకు రూ.2 లక్షల కవరేజ్ లభిస్తుంది. ఈ స్కీం ప్రీమియం సంవత్సరానికి రూ.12. పాలసీదారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యం అయితే రూ.1 లక్ష ఇన్సురెన్స్. ఇక, PMJJBY జీవిత బీమా పాలసీ. పాలసీదారు చనిపోతే రూ.2 లక్షలు వస్తాయి. 55 ఏళ్ల వరకు పాలసీ వర్తిస్తుంది. దీని వార్షిక ప్రీమియం రూ.330.

You may lose Rs.2,00,000 insurance cover: Do this in the next five days

వీటికి సంబంధించి బ్యాంకులు ఇప్పటికే అలర్ట్స్ పంపించాయి. అంటే డిడక్ట్ కావడానికి ముందు ఖాతాదారు అనుమతిని తీసుకుంటారు. PMSBY పథకం 18-70 ఏళ్ల వయస్సు వారికి వర్తిస్తుంది. మే 31వ తేదీన డిడక్ట్ అయ్యే అమౌంట్‌కు సంబంధించి కవరేజ్ జూన్ 1వ తేదీ నుంచి 31 మే వరకు ఉంటుంది. PMJJBY కింద 55 ఏళ్ల వరకు పాలసీ వర్తిస్తుంది. పాలసీదారు చనిపోతే రూ.2 లక్షల వరకు నామినీకి వస్తాయి. దీని ప్రీమియం ఏడాదికి రూ.330.

కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

English summary

హెచ్చరిక!: మే 31వలోగా మీ అకౌంట్‌లో రూ.12 ఉండకుంటే రూ.2,00,000 లక్షల ఇన్సురెన్స్ కోల్పోతారు | You may lose Rs.2,00,000 insurance cover: Do this in the next five days

Salaried workers often end up having zero balance in their bank account by the end of the month. If this is the case with you also, then ensure that there is some amount left in your bank account on May 31.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X