For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PNB క్యూ4 నష్టం రూ.4,750 కోట్లు, నష్టాల్లో షేర్ మార్కెట్లు

|

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) క్వార్టర్ 4లో భారీ నష్టాలను నమోదు చేసింది. మంగళవారం నాడు జనవరి - మార్చి మధ్య ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇందులో రూ.4,750 కోట్ల నికర నష్టాలను చవి చూసింది. అయితే స్థూల నిరర్థక ఆస్తులు గత త్రైమాసికంలో 16.33 శాతం ఉండగా, ఇప్పుడు 15.5 జశాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు కూడా 12,970 కోట్ల నుంచి రూ.7,611 స్థాయికి దిగి వచ్చాయి. ఏకంగా రూ.7000 కోట్ల మేర మొండి బకాయిలకు ప్రొవిజన్స్ చేయడంతో నష్టం మరింతగా పెరిగింది.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.13,417 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అప్పటితో పోలిస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోలుకుంది. నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ కుంభకోణం కారణంగా బ్యాంకు భారీగా నష్టపోయింది.

Punjab National Bank Q4 net loss narrows to Rs.4,750 crore

మూడో క్వార్టర్‌లో (డిసెంబర్ ముగిసేనాటికి) PNB రూ.247 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. 2018-19 ఏడాదిలో PNB నెట్ లాస్ రూ.9,975 కోట్లు. అంతకుముందు ఏడాది ఇది రూ.12,283 కోట్లు. నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ 1.90 (2018) నుంచి 2.45 శాతానికి పెరిగింది. PNB క్వార్టర్ 4లో నష్టాలు నమోదు చేసిన నేపథ్యంలో షేర్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. స్టాక్స్ 4 శాతం వరకు కోల్పోయాయి. చివరకు. 86.20 దగ్గర క్లోజైంది.

English summary

PNB క్యూ4 నష్టం రూ.4,750 కోట్లు, నష్టాల్లో షేర్ మార్కెట్లు | Punjab National Bank Q4 net loss narrows to Rs.4,750 crore

Punjab National Bank (PNB) today reported a loss of Rs.4,750 crore for the March quarter, bettering its performance from a year ago when it reported a loss of 13,417 crore. Fall in provisions, indicating better recovery, ample provisions and improving assets helped narrow the loss.
Story first published: Tuesday, May 28, 2019, 17:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X