For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్‌మనీపై చివరి చాన్స్: M.L.A. సహా 11మంది భారతీయులకు స్విట్జర్లాండ్ నోటీసులు!

|

తమ దేశంలోని బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న పలువురు భారతీయులకు స్విట్జర్లాండ్ షాకిచ్చింది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న భారతీయుల సమాచారాన్ని మన దేశంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం పంచుకుంటోంది. అయితే ఈ సమాచారం రహస్యంగానే ఉండాలంటే దానిని సమర్థించే వివరాలతో దరఖాస్తు పెట్టుకోవాలని ఖాతాదారులకు స్విస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా పలువురికి ఇచ్చింది.

ATM కార్డుతో ఎన్నో ఉపయోగాలుATM కార్డుతో ఎన్నో ఉపయోగాలు

11 మంది భారతీయులకు స్విస్ ప్రభుత్వం నోటీసులు

11 మంది భారతీయులకు స్విస్ ప్రభుత్వం నోటీసులు

మార్చి నెల నుంచి కనీసం 25 మందికి నోటీసులు ఇచ్చింది స్విస్ ప్రభుత్వం. మే 21వ తేదీన కనీసం 11 మందికి ఈ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో స్విస్ బ్యాంక్ ఖాతాదారుల పేర్లను సూక్ష్మరూపంలో పేర్కొంటూ వివరాలు కోరుతోంది. గెజిట్ నోటిఫికేషన్‌లో పూర్తి పేరుకు బదులు కేవలం ఇనిషియల్, జాతీయత, పుట్టిన తేదీలను మాత్రమే పేర్కొంది. వారిలో ఇద్దరు మినహా అందరి పేర్లను పూర్తిగా బహిరంగపరచలేదు. ఓ ఇద్దరికి మాత్రం పూర్తి పేర్లతో నోటిసులు జారీ చేసింది.

ఇద్దరికి పేర్లతో నోటీసులు

ఇద్దరికి పేర్లతో నోటీసులు

1949 మేలో జన్మించిన కృష్ణ భగవాన్ రాంచంద్, 1972 సెప్టెంబర్‌లో జన్మించిన కల్పేష్ హర్షద్ కినారివాలాకు పేర్లతో నోటీసులు వచ్చాయి. వారి గురించి అంకుమించి ఏ వివరాలు ఇవ్వలేదు. మిగిలిన వారి పేర్లను మాత్రం పొడి అక్షరాలతో పేర్కొంది. ఈ నోటీసులపై అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేదంటే ఖాతాల వివరాలు భారత ప్రభుత్వానికి ఇచ్చేస్తామని స్విస్ ప్రభుత్వం ఆ నోటీసుల్లో హెచ్చరించింది.

MLA సహా 11 మంది భారతీయులు వీరే..!

MLA సహా 11 మంది భారతీయులు వీరే..!

స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ నోటీసులు జారీ చేసింది. వారి ఖాతాల వివరాలు ప్రభుత్వానికి అందిస్తామని, దీనిపై అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లో స్పందించాలని పేర్కొంది. అప్పీల్ చేసుకునేందుకు ఇది ఆఖరి అవకాశమని చెప్పింది. కృష్ణ భగవాన్ రాంచంద్, కల్పేష్ హర్షద్‌లతో పాటు మరికొందరు భారతీయుల పేర్లు ఇలా పేర్కొంది.... Mrs A.S.B.K.(పుట్టిన తేదీ... నవంబర్ 24, 1944), Mr A.B.K.I.(పుట్టిన తేదీ... జూలై 9, 1944), Mrs P.A.S.(పుట్టిన తేదీ... నవంబర్ 2, 1983), Mrs R.A.S. (పుట్టిన తేదీ... నవంబర్ 22, 1973), Mr A.P.S.(పుట్టిన తేదీ... నవంబర్ 27, 1944), Mrs A.D.S. (పుట్టిన తేదీ... ఆగస్ట్ 14, 1949), Mr M.L.A.(పుట్టిన తేదీ... మే 20, 1935), Mr N.M.A.(పుట్టిన తేదీ... ఫిబ్రవరి 21, 1968) and Mr M.M.A. (జూన్ 27, 1973).

మోడీ సర్కార్ చర్యలు

మోడీ సర్కార్ చర్యలు

దశాబ్దాలుగా నల్లధన కుబేరులకు స్విస్ బ్యాంకులు ఊతమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నల్లధనంపై పోరులో భాగంగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో స్విట్జర్లాండ్ ఈ చర్యలు చేపట్టింది. మార్చి నుంచి స్విస్ బ్యాంకుల ఇండియన్ క్లయింట్స్‌కు 25 మందికి నోటీసులు ఇచ్చింది. నల్లధనం వెలికితీసేందుకు మోడీ సర్కార్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. నల్లధనం వెలికితీతలో భాగంగా పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలైన దేశాలతో మోడీ ప్రభుత్వం రు సమాచార మార్పిడి ఒప్పందాలను చేసుకుంది. ఈ క్రమంలోనే స్విస్ ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతోంది. అయితే తమ బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణార్థం ఖాతాదారుల సమ్మతితోనే ఈ సమాచార మార్పిడికి స్విస్ ప్రభుత్వం సిద్దపడుతోంది.

English summary

బ్లాక్‌మనీపై చివరి చాన్స్: M.L.A. సహా 11మంది భారతీయులకు స్విట్జర్లాండ్ నోటీసులు! | Switzerland notifies 11 Indians on sharing Bank accounts info

At least 11 such notices were issued to Indian nationals on May 21 itself, though the gazette notifications of the Swiss government has redacted full names for several of them while making public only their initials besides the nationality and the dates of birth.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X