For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ జియో ఎఫెక్ట్: ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ సరికొత్త ప్లాన్... 126GB డేటా బెనిఫిట్

|

రిలయన్స్ జియో వచ్చినప్పటి నుంచి టెలికం కంపెనీల మధ్య మరింత పోటా పోటీ నెలకొంది. జియోను తట్టుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సర్వీస్ ప్రొవైడర్లు వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇటీవల ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కొత్త ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాయి. అలాగే, రిలయన్స్ జియో పోర్టబుల్ హాట్‌స్పాట్‌కు ధీటుగా ఎయిర్‌టెల్ కూడా ప్లాన్ చేస్తోంది.

ఎయిర్‌టెల్ మల్టిపుల్ డివైజ్

ఎయిర్‌టెల్ మల్టిపుల్ డివైజ్

రోజు రోజుకు మొబైల్ డేటా వ్యయం తగ్గుతోంది. ఇందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్ల మధ్య పోటాపోటీయే కారణం. స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్ట్ కావడం సులభమే. కానీ ఎవరైనా తమ ల్యాప్‌టాప్‌లకు కనెక్ట్ కావాలంటే వారు స్మార్ట్ ఫోన్ ద్వారా హాట్‌స్పాట్ యూజ్ చేయాలి. లేదా పోర్టబుల్ హాట్‌స్పాట్ డివైస్ కొనుగోలు చేయాలి. రిలయన్స్ జియో హాట్‌స్పాట్ డివైస్‌ను ఎప్పుడో మార్కెట్లోకి తెచ్చింది. ఎయిర్‌టెల్ కూడా మల్టిపుల్ డివైజెస్‌కు ఒకేసారి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేలా 4G హాట్‌స్పాట్ డివైస్‌ను తీసుకు వచ్చింది. ఇలాంటి ఎయిర్‌టెల్ యూజర్లకు కొత్త డేటా బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది.

ప్రీపెయిడ్ ఆఫర్లు

ప్రీపెయిడ్ ఆఫర్లు

రూ.399 ప్లాన్‌తో 500GB డేటాను ఎయిర్‌టెల్ ఇస్తోంది. డేటా అయిపోయాక డేటా వేగం 80KBPSకు తగ్గుతుంది. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ డివైస్‌ను రూ.1500కు కొనుగోలు చేసి... ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పేయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ప్రీపేయిడ్ ఆఫర్లలో 1.5GB డెయిలీ డేటాతో 84 రోజుల వ్యాలిడిటీ ఉంది. అంటే ఈ కాలపరిమితిలో యూజర్లు 126GB డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డెయిలీ లిమిట్ (1.5GB) పూర్తయ్యాక మాత్రం 80KBPS స్పీడ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పోస్ట్ పెయిడ్ ఆఫర్లు

పోస్ట్ పెయిడ్ ఆఫర్లు

పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ.499. ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెల. 75GB డేటా వస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్‌లా ఇక్కడ డెయిలీ లిమిట్ లేదు. కావాలంటే మీరు ఒకేసారి 75GB డేటా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 75GB డేటా పూర్తయ్యాక మాత్రం 80KBPSతో మీరు అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు.

10 డివైస్‌లకు కనెక్ట్ చేయవచ్చు

10 డివైస్‌లకు కనెక్ట్ చేయవచ్చు

ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ డివైస్ 1,500mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ హాట్‌స్పాట్‌తో ఒకేసారి 10 డివైస్‌లు కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ స్పీకర్స్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. మరో ప్రయోజనం ఏమంటే మీరు మీ పాత 3G ఇన్‌స్ట్రుమెంట్‌కు కనెక్ట్ అయితే వైఫై ద్వారా 4G డౌన్‌లోడ్ స్పీడ్ ఆనందించవచ్చు.

English summary

రిలయన్స్ జియో ఎఫెక్ట్: ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ సరికొత్త ప్లాన్... 126GB డేటా బెనిఫిట్ | Jio Effect: Airtel 4G hotspot plan now comes with up to 126 GB data benefit

Bharati Airtel has revised the pricing of its 4G hotspot plans and now offering users with additional bundled free data. You can get as much as 126GB free data on a prepaid plan.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X