For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019 ఎన్నికలలో ట్విట్టర్ ను తెగ వాడేశారుగా .. ఎంతగా అంటే

|

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ట్విట్టర్ ని తెగ వాడేశారు రాజకీయ నాయకులు. ఎవరు ఏవిషయం చెప్పాలన్న సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా చెప్పారు. దీంతో ట్విట్టర్ వాడటం అనూహ్యంగా అభివృద్ధిని సాధించిందని ట్విట్టర్ ఇండియా వెల్లడించింది.

గత ఎన్నికల సమయంతో పోలిస్తే 2019 ఎన్నికల్లో ట్విట్టర్ వాడకం 600 శాతం మేర పెరిగిందని పేర్కొంది. జనవరి 1 నుంచి మే 23వరకు 396 మిలియన్ల ట్వీట్లు జరిగినట్లుగా ట్విట్టర్ తెలిపింది.

Twitter recorded 396 million tweets for Loksabha elections 2019

వీటిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న ట్వీట్ లే వీటిలో ఎక్కువ. ప్రధాని నరేంద్ర మోడీ గురించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కువగా చర్చలు విశ్లేషణలు జరిగాయి. బిజెపి ఎన్డీఏ పక్షాల ప్రస్తావనలు 53శాతం ఇందులో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ యూపీఏ భాగస్వామ్య పక్షాల ప్రస్తావనలు 37 శాతం మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా మోడీ పై చర్చ జరగగా, తర్వాతి స్థానంలో రాహుల్ గాంధీ, ఆ తర్వాత స్థానంలో అమిత్ షా లు నిలిచారు.

ఇక ఎన్నికల కోడ్ ప్రకారం కోడ్ ఆఫ్ కండక్ట్ కు కట్టుబడి వ్యవహరించామని అభ్యంతరకరమైన పోస్టులను కూడా తొలగించి శ్రద్ధ చూపించామని ట్విట్టర్ పేర్కొంది. మొత్తానికి 2019 ఎన్నికల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించి ట్విట్టర్ ఎన్నికలకూత గట్టిగా కూసింది.

English summary

2019 ఎన్నికలలో ట్విట్టర్ ను తెగ వాడేశారుగా .. ఎంతగా అంటే | Twitter recorded 396 million tweets for Loksabha elections 2019

Twitter said it recorded 396 million conversations for Lok sabha elections between January 1 to May 23 and that the volume of conversations grew 600% compared to the general elections of 2014. Prime minister Narendra Modi emerged as the most mentioned political personality throughout the course of elections, while @BJP4India was the most mentioned political party on Twitter, the company said in a statement.
Story first published: Saturday, May 25, 2019, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X