For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నాప్‌డీల్ చేతికి షాప్‌క్లూస్?

By Jai
|

దేశీయ ఈ-కామర్స్ రంగంలో విలీనాల పర్వం మొదలవుతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఫ్లిప్‌కార్ట్‌కు గట్టి పోటీ ఇచ్చిన స్నాప్ డీల్.. రెండు మూడేళ్లుగా రేసులో వెనుకబడింది. అమెజాన్ రంగ ప్రవేశంతో భారత్‌లో ఈ కామర్స్ కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది.

దాదాపు మూతపడే స్థాయి నుంచి మళ్లీ పుంజుకున్న స్నాప్‌డీల్.. ఇప్పుడు మరో ఈ కామర్స్ కంపెనీ షాప్‌క్లూస్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. షాప్ క్లూస్ కూడా ఏడాది కాలంగా పెద్దగా ఆర్డర్లు లేకపోవడంతో చతికిల పడింది. అయితే షాప్‌క్లూస్‌ను కొనుగోలు చేయడం ద్వారా చిన్న పట్టణాల్లో తన మార్కెట్‌ను విస్తరించుకోవచ్చునని స్నాప్ డీల్ భావిస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతోందని ఎకనామిక్ టైమ్స్ పేర్కోంది.

అయితే ఈ డీల్ కాస్త భిన్నంగా ఉండనుంది. షాప్ క్లూస్‌కు నగదుకు బదులు కేవలం 10 శాతం వాటాను ఇచ్చేందుకు స్నాప్‌డీల్ సమ్మతించిందట. తద్వారా షాప్‌క్లూస్‌ను కొనుగోలు చేయడం స్నాప్‌డీల్‌కు సులభమే.

మీ చిన్నారి కోసం 'సుకన్య సమృద్ధి యోజనా'మీ చిన్నారి కోసం 'సుకన్య సమృద్ధి యోజనా'

Snapdeal inches closer to acquiring ShopClues

కానీ షాప్‌క్లూస్ ప్రమోటర్లకు ఏకమొత్తపు నగదును ఇచ్చేందుకు స్నాప్ డీల్ అంగీకరించిదట. రాధిక అగర్వాల్, సంజయ్ సేధీలు షాప్ క్లూజ్‌ను ప్రారంభించారు. ఆ ప్లాట్ ఫాంలో చవక ధరల ఉత్పత్తులను విక్రయించేవారు. ఒక స్థాయిలో ఒక బిలియన్ విలువ పలికిన ఈ కంపెనీ కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ధాటికి డీలా పడిపోయింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలకు రోజుకు సగటున 6,00,000 ఆర్డర్లు వస్తుండగా స్నాప్‌డీల్ రోజుకు 2,50,000 వరకు ఆర్డర్లు ప్రాసెక్ చేస్తోంది. ఏడాది క్రితం స్నాప్ డీల్ ఆర్డర్లు 30,000 స్థాయిలో పడిపోయాయి. ఇప్పుడు షాప్ క్లూస్ పరిస్థితి కూడా ఇందుకు భఇన్నంగా లేదని మార్కెట్ వర్గాల సమాచారం.

స్నాప్ డీల్ వ్యవస్థాపక సీఈవో కునాల్ బాల్.. తన కంపెనీని 1.5 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు ప్రయత్నించినా వ్యాల్యుయేషన్ దగ్గర డీల్ కుదరలేదు. ఫ్లిప్‌కార్ట్ కేవలం 700-800 మిలియన్ డాలర్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది.

అయితే ఫ్రీచార్జ్ అనే వాలెట్‌ను యాక్సిస్ బ్యాంక్‌కు విక్రయించి రూ.350 కోట్లను సమీకరించింది. దీంతో మళ్లీ కార్యకలాపాలను గాడిలో పెట్టింది. ఇప్పుడు కేవలం షేర్ల పద్ధతిలో షాప్ క్లూజ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. నష్టాల్లోనే ఉన్న రెండు కంపెనీలకు ఈ విలీనం ప్రయోజనమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary

స్నాప్‌డీల్ చేతికి షాప్‌క్లూస్? | Snapdeal inches closer to acquiring ShopClues

Online marketplace Snapdeal is close to buying its nearest rival ShopClues in an all-stock deal, two people familiar with the matter said, after the on-again, off-again talks fell through earlier following disagreement on its financial terms.
Story first published: Friday, May 24, 2019, 10:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X