For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: బ్యాంక్-పోస్టాఫీస్ వడ్డీపై టీడీఎస్ మినహాయింపు, ఇలా చేయండి...

|

సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ మీద టీడీఎస్ మినహాయింపు విషయంలో సంతోషానన్ని ఇచ్చే ప్రకటన వెలువడింది. రూ.5 లక్షల వరకు వార్షిక పన్ను ఆదాయం కలిగిన సీనియర్ సిటిజన్స్ బ్యాంకు డిపాజిట్స్ వడ్డీ పైన టీడీఎస్ నుంచి మినహాయింపును పొందవచ్చు. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఈ అవకాశముంది. 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి పన్ను రాయితీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఇలా టీడీఎస్ మినహాయింపు పొందవచ్చు

ఇలా టీడీఎస్ మినహాయింపు పొందవచ్చు

CBDT (సెంటర్ బోర్డ్ ఆప్ డైరెక్ట్ ట్యాక్సెస్) నోటిఫికే,న్ ప్రకారం... సీనియర్ సిటిజన్స్ బ్యాంకులు మరియు పోస్టాఫీస్‌లలో 15H ఫామ్ సబ్‌మిట్ చేసి టీడీఎస్ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. 2019-20 కొత్త బడ్జెట్‌లో రూ.5 లక్షల వార్షిక వేతనం ఉన్న వారికి పూర్తి ట్యాక్స్ మినహాయింపు ప్రకటించారు. ఇది 3 కోట్ల మంది మధ్యతరగతి ట్యాక్స్ పేయర్స్‌కు ప్రయోజనం.

15H సవరిస్తూ సీబీడీటీ నోటిఫికేషన్

15H సవరిస్తూ సీబీడీటీ నోటిఫికేషన్

ఇందులో భాగంగా ఫాం 15Hను సవరిస్తూ సీబీడీటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద అన్ని రకాల రాయితీలని పరిగణనలోకి తీసుకున్న అనంతరం, నికర ఆదాయం పన్ను పరిధిలో లేని వారి నుంచి ఫామ్‌15Hను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్వీకరించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు తమ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ నుంచి టీడీఎస్‌ కోయకుండా, ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఫామ్‌15Hను ఇవ్వవలసి ఉంటుంది.

ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో ఇవ్వాలి

ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో ఇవ్వాలి

CBDT చేసిన సవరణల ప్రకారం బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఫామ్ 15Hను తీసుకోవాలి. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఫామ్ 15Hను సబ్‌మిట్ చేయాలి. వీరు బ్యాంకులకు ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో ఇవ్వాలి.

English summary

గుడ్‌న్యూస్: బ్యాంక్-పోస్టాఫీస్ వడ్డీపై టీడీఎస్ మినహాయింపు, ఇలా చేయండి... | Senior citizens with taxable income up to Rs 5 lakh can seek TDS exemption on bank interest

Senior citizens with a taxable income of up to Rs 5 lakh can now submit in banks and post offices Form 15H to claim exemption from TDS on interest income on deposits, according to a CBDT notification. Earlier, the limit for seeking Tax Deducted at Source (TDS) exemption was Rs 2.5 lakh.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X