For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ క్యాపిటల్ ఔట్: మ్యుచువల్ ఫండ్స్ వ్యాపారానికి అనిల్ అంబానీ గుడ్‌బై

|

న్యూఢిల్లీ: మ్యుచువల్ ఫండ్స్ వ్యాపారం నుంచి వైదొలగుతున్నట్లు అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ క్యాపిటల్ ప్రకటించింది. రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మెనేజ్మెంట్ (RNAM)లోని వాటాను భాగస్వామి, జపాన్‌కు చెందిన నిపపోన్ లైఫ్ ఇన్సురెన్స్‌కు విక్రయిస్తున్నట్లు తెలిపింది.
ఈ సంస్థలో రెండు భాగస్వామ్య కంపెనీలకు 42.88 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. వాటా విక్రయంపై కుదిరిన ఒప్పందం మేరకు నిప్పోన్ లైఫ్‌ ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

SBI కస్టమర్ అలర్ట్: ఇవి తెలుసుకోండిSBI కస్టమర్ అలర్ట్: ఇవి తెలుసుకోండి

75 శాతం వాటాను పెంచుకోనుంది

75 శాతం వాటాను పెంచుకోనుంది

తమకు చాలాకాలంగా విలువైన భాగస్వామిగా ఉన్న నిప్పోన్ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆర్‌నామ్‌లో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుందని అనిల్ అంబానీ తెలిపారు. ఆర్‌నామ్‌లో వాటా విక్రయం సరైన విలువను సొంతం చేసుకునే విధానంలో భాగమే అన్నారు. ఈ లావాదేవీతోపాటు అమలులో ఉన్న ఇతర లావాదేవీలు కూడా కలిపితే రిలయన్స్‌ క్యాపిటల్ రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే యాభై శాతం తగ్గిపోతుందని తెలిపారు.

నిప్పోన్ చేతికి

నిప్పోన్ చేతికి

ఆర్‌నామ్‌లో పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి 14.25 శాతం వాటాకు సమానమైన 8.99 కోట్ల షేర్లకు రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఆర్‌నామ్ నియంత్రణకు నిప్పోన్ లైఫ్ చేతికి వెళ్తుంది. వాటా విక్రయం తర్వాత కూడా రిలయన్స్ క్యాపిటల్ మైనార్టీ వాటను కలిగి ఉండనుందని తెలుస్తోంది. అనిల్ అంబానీ తనయుడు జై అనుమోల్ అంబానీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ డీల్ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ గురువారం బీఎస్ఈలో 2.77 శాతం లాభపడి 131.90 వద్ద, ఆర్‌నామ్ షేర్ 7 శాతం పెరిగి రూ.233.75 వద్ద ముగిసింది.

రిలయన్స్ ఔట్ స్టాండింగ్ డెబిట్ 33 శాతం తగ్గనుంది

రిలయన్స్ ఔట్ స్టాండింగ్ డెబిట్ 33 శాతం తగ్గనుంది

ఇప్పటి వరకు 42.88 శాతంగా ఉన్న నిప్పోన్ వాటా కొనుగోలు తర్వాత 75 శాతం కానుంది. వాటా విక్రయంపై కుదిరిన ఒప్పందం మేరకు నిప్పోన్ లైఫ్‌ ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్‌నామ్‌ ఒక్కో షేర్‌ను రూ.230 చొప్పున కొనుగోలు చేస్తుంది. షేర్ 60 రోజుల సగటు ధరపై 15.5 శాతం అదనపు మొత్తాన్ని ఇందుకు నిర్ణయించారు. ఈ విక్రయం ద్వారా రూ.6,000 కోట్లు లభిస్తాయని రిలయన్స్‌ క్యాపిటల్ పేర్కొంది. దీంతో రిలయన్స్ ఔట్ ‌స్టాండింగ్ రుణం 33 శాతం తగ్గనుంది. నిప్పోన్ 2019లో 26 శాతం వాటా దక్కించుకుంది. ఆ తర్వాత 2014లో 9 శాతం, మరుసటి ఏడాది 14 శాతం వాటా దక్కించుకుంది. ఇప్పుడు మేజర్ వాటా దక్కించుకోనుంది.

English summary

రిలయన్స్ క్యాపిటల్ ఔట్: మ్యుచువల్ ఫండ్స్ వ్యాపారానికి అనిల్ అంబానీ గుడ్‌బై | Reliance Capital to exit mutual funds business, sell stake to Nippon Life

Reliance Capital Ltd, the financial services arm of Anil Ambani-led Reliance Group, is exiting the mutual fund business by selling its entire stake in Reliance Nippon Life Asset Management Ltd (RNAM) in order to pare debt.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X