For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటాలను తలదన్నిన హెచ్‌డీఎఫ్‌సీ!

By Jai
|

హైదరాబాద్: గుండు సూది నుంచి విమానాల వరకు ఉప్పు నుంచి సాఫ్టువేర్ వరకు అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసిన టాటా గ్రూప్‌ను మరో దేశీయ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ వెనక్కు నెడుతోంది. అయితే ఈ పోటీ రెండు గ్రూప్‌ల మధ్య ప్రత్యక్షంగా కాదు. కేవలం ఆయా గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారమే.

టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా టాటా గ్రూప్ లిస్టెండ్ కంపెనీల మార్కెట్ క్యాప్.. రూ.11.64 లక్షల కోట్లు కాగా, ఐదు సంస్థల హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్మెంట్, గృహ్ ఫైనాన్స్ ఏకంగా రూ.11.60 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను సాధించి ఔరా అనిపించాయని ది ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

టాటా గ్రూప్ సంస్థల్లో టీసీఎస్ అతి విలువైన కంపెనీకు నిలిచింది. ఈ సంస్థ విలువ ఏకంగా రూ.8 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ సంస్థల్లో అగ్రస్థానం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుదే. ఈ బ్యాంకు విలువ రూ.6.6 లక్షల కోట్లు కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో టాటా మోటార్స్, టాటా స్టీల్స్ కంపెనీల విలువ భారీగా పతనం కావడంతొ మొత్తంగా గ్రూప్ మార్కెట్ క్యాప్ తక్కువగా నమోదైంది.

HDFC Group overtakes Tata Group as Indias largest

అదే సమయంలో భారత్‌లో సమర్థవంతమైన కార్యకలాపాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అలాగే, ఈ గ్రూప్ సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దాని ఫలితమే శతాబ్ద చరిత్ర కలిగిన అతి భారీ పారిశ్రామిక గ్రూప్ టాటాను హెచ్‌డీఎఫ్‌సీ అందుకోగలిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రయివేటు రంగలోని బ్యాంకులు ఐసీఐసీఐ, యస్ బ్యాంక్‌లు అనేక వివాదాలతో సతమతమవుతున్నాయి. కేవలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రం క్రమం తప్పకుండా పని తీరును మెరుగుపరుచుకుంటూ లాభాలబాటలో పయనిస్తోంది. తద్వారా ఇన్వెస్టర్లకు లబ్ధి చేకూరుస్తోంది.

English summary

టాటాలను తలదన్నిన హెచ్‌డీఎఫ్‌సీ! | HDFC Group overtakes Tata Group as India's largest

The HDFC Group has emerged as the country’s most valuable by way of market capitalization (m-cap), displacing the Tata Group that has interest in businesses as diverse as software, table salt, steelmaking and automobiles.
Story first published: Friday, May 24, 2019, 9:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X