For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐఓసీఎల్‌కు ఎసరు: దేశీయ చమురు సంస్థల్లో ఆ ప్రముఖ కంపెనీదే తొలిస్థానం

|

భారతదేశం అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చమురు రంగంలో మరో మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాభాలను రిలయన్స్ దాటినట్లు ఆ సంస్థ మార్కెట్ రెగ్యులేటర్‌లో దాఖలు చేసిన ఫైలింగ్స్‌ ద్వారా తెలుస్తోంది. దీంతో చమురు సంస్థల్లో దేశంలోనే అతిపెద్ద లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలచింది.

మార్చి 31తో ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రిలయన్స్ సంస్థ రూ.6.23 ట్రిలియన్‌ టర్నోవర్ కలిగినట్లు పేర్కొంది. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.6.17 ట్రిలియన్ టర్నోవర్ పోస్ట్ చేసింది. అంతేకాదు 2019 ఆర్థిక సంవత్సరానికి గాను రిలయన్స్ తన నికర లాభంను దాదాపు రెట్టింపుగా చూపింది. పదేళ్ల క్రితంతో పోలిస్తే రిలయన్స్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో సగం కూడా లేదు. ఆ తర్వాత టెలికాం, రీటెయిల్, డిజిటల్ సర్వీసుల్లోకి ప్రవేశించాక చమురు సంస్థ రూపు రేఖలే మారిపోయాయి. దీంతో 2019 ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.39,588 కోట్లుగా చూపించింది. ఐఓసీ తన నికర లాభం రూ. 17.274 కోట్లుగా పేర్కొంది.

Reliance industries crosses IOCL in terms of revenues,stands in the top postion


ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే గతేడాది వరకు లాభాల బాటలో పయనించింది.2018-19 ఆర్థిక సంవత్సరంలో మరో ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీ దీన్ని అధిగమించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓఎన్జీసీ ఇంకా తన నికర లాభంను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలలకు గాను ఓఎన్జీసీ నికర లాభం రూ.22,671 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 23.6శాతం నష్టం చవిచూసినట్లు తెలిపింది. ఇక రిలయన్స్ సంస్థ లాభాల్లో 13శాతం పెరుగుదల కనిపించిందని పేర్కొంది. దీంతో రిలయన్స్ మూడు పారామీటర్లలో అంటే రెవిన్యూ, లాభం, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లలో తొలి స్థానంలో నిలిచింది.

English summary

ఐఓసీఎల్‌కు ఎసరు: దేశీయ చమురు సంస్థల్లో ఆ ప్రముఖ కంపెనీదే తొలిస్థానం | Reliance industries crosses IOCL in terms of revenues,stands in the top postion

Richest Indian Mukesh Ambani's oil-to-telecom conglomerate Reliance Industries has toppled state-owned Indian Oil Corp (IOC) to become the country's biggest company by revenue.Reliance in the 2018-19 fiscal year that ended March 31, reported a turnover of Rs 6.23 trillion. In comparison, IOC posted a turnover of Rs 6.17 trillion for the fiscal, according to regulatory filings by the two companies.
Story first published: Tuesday, May 21, 2019, 16:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X