For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా ఎందుకు ఆఫర్స్ ఆపేశాయ్?

|

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ రంగంలోకి చిన్న కంపెనీలు కూడా అడుగుపెడ్తున్నాయి. అయితే ఈ సెగ్మెంట్లో పాతుకుపోయిన జొమాటో, స్విగీ మిగిలిన కంపెనీలను ఊపిరాడనీయడం లేదు. ఈ దెబ్బకు ఫుడ్ పాండా, ఉబర్ ఈట్స్ మెల్లిగా దుకాణం సర్దుకుంటున్నాయి. కింది చెప్పిన మరిన్ని డీటైల్స్ చూస్తే.. మీరు ఆశ్చర్యపోయే అంశాలు చాలానే ఉన్నాయి.

ఇక డబ్బులు పోగోట్టుకోలేం

ఇక డబ్బులు పోగోట్టుకోలేం

ఇప్పుడు దేశీయ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ ఒకటిన్నర బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.10500 కోట్ల వరకూ ఉంటుంది. ఇది రాబోయే రెండేళ్లలో 2.5 -3.5 బిలియన్ డాలర్లకు చేరే ఆస్కారం ఉంది అని రెడ్‌సీర్ అనే కన్సల్టింగ్ కంపెనీ అంచనా వేస్తోంది. ఈ లెక్కన ఇండియాలో ఈ ఆన్ లైన్ ఫుడ్ మార్కెట్ రూ.15 వేల నుంచి 25 వేల కోట్లకు విస్తరించేట్టు కనిపిస్తోంది.

ఇంత మార్కెట్ కంటిముందు కనిపిస్తున్నా ఓలా ప్రమోట్ చేస్తున్న ఫుడ్ పాండా, ఉబర్ ఆధ్వర్యంలో ఉన్న ఉబర్ ఈట్స్ మాత్రం వెనక్కి తగ్గాయి. ఇక ప్రమోషన్స్‌కు డబ్బులు వెచ్చించమోని, నష్టాలు భరించలేమని దాదాపుగా చేతులెత్తేశాయి. ఇకపై ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టబోమని దాదాపుగా తేల్చిచెప్పేశాయి.

ఉబర్‌కు చేతులు కాలాయి

ఉబర్‌కు చేతులు కాలాయి

ప్రముఖ ఆన్ లైన్ క్యా అగ్రిగేటర్ అయిన ఉబర్ ఈ మధ్యే ఐపీఓకు వచ్చింది. నిధుల సమీకరణ నేపధ్యంలో వార్తల్లో నిలిచిన సంస్థ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ నేపధ్యంలో భారీగా పతనమైంది. యూఎస్ ఐపీఓ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా మొదటి రోజే బోల్తా కొట్టింది. దీంతో ఖర్చులను తగ్గించుకుని ఎలా అయినా లాభాల్లోకి రావాలని, నష్టం వచ్చే వ్యాపారాలపై దృష్టిని మరల్చుకోవాలని ఉబర్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకే ఇండియాలో ఈట్స్‌పై దృష్టిని సడలించింది. గతంలో ఇండియన్ మార్కెట్‌పై విపరీతంగా నిధులు కుమ్మరించిన సంస్థ ఇప్పుడు వాటిల్లో భారీగా కోత పెట్టింది.

లాభాలూ అంతంతే..

లాభాలూ అంతంతే..

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా వచ్చే లాభాలూ పెద్దగా ఉండేట్టు లేవు. అందుకే ఫుడ్ పాండా, ఈట్స్ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కోర్ బిజినెస్‌పై దృష్టిని తగ్గించి వీటి వెంటపడి మరీ నష్టాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదనేది ఈ సంస్థల ఆలోచన. అందుకే ఎప్పుడైతే ఆఫర్లను(ఫిబ్రవరి నుంచి ఆఫర్లు బాగా తగ్గించేశారు) తగ్గించాశారో అప్పుడే వీళ్ల ఆర్డర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఈట్స్‌కు నెలకు వచ్చే ఆర్డర్ల సంఖ్య 1.3 కోట్లకు తగ్గిపోయింది. అంతకు ముందు వరకూ నెలకు 25 శాతం వృద్ధితో దూసుకుపోయిన సంస్థ ఇప్పుడు మాత్రం వెనుకబడిపోయింది. అయితే ఇదే సమయంలో జొమాటో - స్విగీ సంస్థలు నెలకు 3 నుంచి 3.5 కోట్ల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తున్నాయి. ఇక ఫుడ్ పాండా నెల వారరీ 30-40 లక్షల ఆర్డర్లను మాత్రమే సరఫరా చేస్తోంది.

క్లియర్ విన్నర్స్..

క్లియర్ విన్నర్స్..

ఈ లెక్కన జొమాటో, స్విగీ మార్కెట్లో లీడర్షిప్ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. లాభాలు రాకపోయినా, మార్జిన్లు తక్కువగా ఉన్నా, నష్టాలు భారీగా ఉన్నా వీళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రకరకాల ఆఫర్ల పేరుతో 20 నుంచి 40 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇస్తూనే ఉన్నాయి. అయితే ఇంకా ఎంత కాలం ఇలా బండినడిపిస్తాయి అనే దానిపైనే క్లారిటీ లేదు.

హైదరాబాద్‌పై ఉబర్‌ఈట్స్ పట్టు

హైదరాబాద్‌పై ఉబర్‌ఈట్స్ పట్టు

అయితే ఉబర్ ఈట్స్‌కు పూణె, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబైలో మంచి పట్టు ఉంది. దేశవ్యాప్తంగా 37 నగరాల్లో ఉబర్ సేవలు అందిస్తున్నప్పటికీ నాలుగు నగరాల్లోనే పట్టు నిలుపుకుంది. మరి వీటిపైనే దృష్టి పెంచుకుంటుందా.. లేక మిగిలిన మార్కెట్లను మెల్లిగా వదిలించుకుంటుందా చూడాలి.

English summary

ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా ఎందుకు ఆఫర్స్ ఆపేశాయ్? | Swiggy, Zomato in top gear as ride hailing companies slow down

The battle for dominance in India’s fast-growing online food delivery market is back to being a two-way affair between Swiggy and Zomato, as ride-hailing majors Ola and Uber have sharply reduced focus on the cashguzzling sector.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X