For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరబ్ దేశాల్లో MEILకు ప్రశంసలు, 6నెలల్లో అరుదైన రికార్డ్: ఏపీ-తెలంగాణలలో గ్యాస్ సరఫరా

|

భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎంఈఐఎల్ రికార్డులు సృష్టిస్తోంది. మధ్య ప్రాచ్య దేశాల్లో ఒకటైన జోర్డాన్ లో విద్యుత్ ఉత్పత్తిలో గ్యాస్ టర్బైన్లు నిర్మాణం పనులు విజయవంతంగా పూర్తి చేసింది. జోర్డాన్ లోని అరబ్ పోటాష్ కంపెనీ నుంచి 54మెగావాట్ల గ్యాస్ టర్బైన్ నిర్మాణం కోసం 38.68 మిలియన్ అమెరికా డాలర్లకు పనులు సొంతం చేసుకుంది. హీట్ రికవరీ స్టీల్ జనరేటర్ విధానంలో 63 టీపీహెచ్‌, 63 బార్ ప్రెసర్ తో 80ఎంవీఏ ట్రాన్స్ ఫార్మన్లను ఏర్పాటు చేసింది. ఇంజినీరింగ్, సప్లయ్, నిర్మాణాన్ని 2018 అక్టోబర్ లోనే పూర్తి చేసింది. దీంతో పాటు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తోంది.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. భారత్‌కు లాభమా, నష్టమా?అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. భారత్‌కు లాభమా, నష్టమా?

అరబ్ దేశాల్లో ఎంఈఐఎల్ కు అభినందన

అరబ్ దేశాల్లో ఎంఈఐఎల్ కు అభినందన

ఎంఈఐఎల్ కువైట్ లో ఎస్సార్ సంస్థ నుంచి కేఐపీఐసీలో భాగంగా అల్ జౌర్ ప్రాజెక్టు నిల్వ ట్యాంకుల నిర్మాణం పనులను సొంతం చేసుకుంది. 60 మీటర్ల వ్యాసార్థం నుంచి 78మీటర్ల వ్యాసార్థం వరకు 66 నీటి నిల్వ ట్యాంకుల నిర్మాణం పనులు ఈ ఏడాది డిసెంబర్ లో పూర్తవనున్నాయి. ఎంఈఐఎల్ 3 వేల మంది సిబ్బందిని ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం వినియోగించింది. మే నెల నాటికి 90% పనులు పూర్తి చేసుకుని హైడ్రో పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఎంఈఐఎల్ కోటి గంటల పాటు ఏలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా సురక్షితంగా నిర్వహించడంతో కేఐపీఐసీ నుంచి అభినందన పత్రాన్ని కూడా సొంతం చేసుకుంది. ఇది లిమ్కా, ఆసియ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.

6 నెలల్లో అరుదైన రికార్డు ఎంఈఐఎల్ సొంతం

6 నెలల్లో అరుదైన రికార్డు ఎంఈఐఎల్ సొంతం

రాజస్థాన్టలోని రాగేశ్వరీ లో కెయిర్న్‌ ఇండియా నుంచి గ్యాస్ ప్రాసిసింగ్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. 2018 ఆగస్టులో 90 ఎంఎంఎస్‌సీఎఫ్‌డీ సామర్థ్యం కలిగి ఉన్న ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభించి ఆరు నెలల్లోనే పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు పనులు దక్కించుకున్న వెంటనే సివిల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ తో పాటు అవసరమైన పరికరాలను సమకూర్చుకుని యుద్ధ ప్రతిపాదికన 24 గంటలు పనులు చేయించి ప్రపంచంలోనే మౌలిక సదుపాయాలు కల్పనలో రికార్డ్‌ సమయంలో ప్రాజెక్టును పూర్తిచేసింది. మార్చి 2019నుంచి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ఈ గ్యాస్ ప్రాజెక్టు ప్రత్యేకతలు పరిశీలిస్తే ఆఫ్-గ్యాస్ కంప్రెసర్, గ్యాస్ కంపెసర్ ఎగుమతి, 3 మెగావాట్ల పవర్ హౌస్, ఘనీభవం నిల్వ సౌకర్యాలు, ఉత్పత్తి చేయబడిన నీటి వ్యవహార విధాన సౌకర్యాలు సొంతం చేసుకుంది.

ఈ అసమానమైన విజయంతో ఎంఈఐఎల్ తేజస్సును మరోసారి అంతర్జాతీయ హైడ్రోకార్బన్స్ పరిశ్రమలో ప్రత్యేకమైన ప్రాధాన్యత స్థానాన్ని ఎంఈఐఎల్ దక్కించుకుంది.

ఈశాన్య భారతంలో ఓఎన్‌జీసీతో కలిసి అడుగులు

ఈశాన్య భారతంలో ఓఎన్‌జీసీతో కలిసి అడుగులు

ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీతో అస్సాంలోని గెలేకి సమీపంలో పైప్ లైన్ ప్రత్యామ్నాయ ప్రాజెక్టు నిర్మాణం పనులు ఎంఈఐఎల్ చేప్పటింది. ఓఎన్‌జీసీ నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచేందుకు 6 లైన్ల విభాగంలో 5.5 చమురు విభాగాలు 128.3 కిలో మీటర్లు, గ్యాస్ పైప్ లైన్ 16.5 కిలో మీటర్ల మేర నిర్మాణం పనులు చేపట్టింది. 2017, 2018లో ఎంఈఐఎల్ మూడు విభాగాల్లో ఓఎన్‌జీసీ పనులుపూర్తి చేసింది. 2017లో 48.3 కి.మీ. పైప్ లైన్, 2018లో 91.62 కి.మీ బ్యాలెన్స్ పైప్ లైన్ నిర్మించింది. ఓఎన్‌జీసీ నుంచి ఎంఈఐఎల్ మరో ఐదు పైప్ లైన్ల ప్రత్యామ్నాయ ప్రాజెక్టును సౌత్ సంతాల్ జీజీఎస్‌ అలాగే సీటీఎఫ్‌ బెచరాజీ జీజీఎస్‌-1 ను 60కోట్ల వ్యయంతో నిర్మించింది.

ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్తే గ్యాస్ ను తరలించేందుకు ఐదు పైప్ లైన్ విభాగాల్లో 8 నుంచి 14 మధ్య పరిమాణంలో కార్యాచరణ సామర్ధ్యాన్ని పెంచుతుంది. MEIL 2018లోనే రెండు విభాగాల్లో 11.39 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు కూడా పూర్తి చేసింది. ఓన్‌ఎన్‌జీసీ గ్రూప్ ఏ బిభాగంలో అస్సాంలో నిర్మిస్తోన్న పునరుద్ధరణ ప్రాజెక్టు పనులను దిగ్విజయంగా ఎంఈఐఎల్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్న 21 పాతబడిన మౌలిక సదుపాయాలను 9 కొత్త సమీకృత సముదాయాలకు నిర్వహణ తగ్గించడానికి, ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం రాబోయే 25 సంవత్సరాలు చమురు, సహజవాయువు బ్యాలెన్స్ రికవరీ, రిజర్వ్ ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఉపయోగపడనుంది. ఎంఈఐఎల్ 2018లో అస్సాంలోని లఖ్మాని ఫీల్డ్ పునరుద్ధరణలో భాగంగా ఎఫ్ల్యూఎంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) రోజుకి సామర్ధ్యం 2000 క్యూబిక్ మీటర్లు, రోజుకి 3000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో వాటర్ ఇంజెక్షన్ ప్లాంట్, రోజుకు 2000 క్యూబిక్ మీటర్లు సామర్థ్యంతో గ్రూప్ గాథరింగ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసింది.

ఓఎన్‌జీసీ నుంచి మరో ప్రాజెక్టును దక్కించుకున్న ఎంఈఐఎల్‌

ఓఎన్‌జీసీ నుంచి మరో ప్రాజెక్టును దక్కించుకున్న ఎంఈఐఎల్‌

మెహసనా లోని నాలుగు సీటీఎఫ్‌లలో అగ్నిమాపక సౌకర్యాల అప్-గ్రేడింగ్ మిషన్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అగ్నిమాపక వ్యవస్థ అప్-గ్రేడింగ్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌లోని మెహసానాలోని 4 క్షేత్రాలలో ఎంబీ లాల్‌ కమిటీ సిఫారసుల మేరకు సమగ్ర అగ్నిమాపక రక్షణ వ్యవస్థ నిర్మాణం పూర్తయింది.

ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న అన్ని అగ్నిమాపక సదుపాయాల పునర్నిర్మాణం చేపట్టడంతో పాటు ఇందులో కొత్తగా అగ్నిమాపక నెట్ వర్కుల నిర్మాణం హైడ్రాన్ట్స్ & వాటర్ కమ్ ఫోమ్ మానిటర్లు, HVLR, నీటి స్ప్రింక్లర్ సిస్టమ్ తో సహా మెహసాన అసెట్ వద్ద స్ప్రింక్లర్ రింగులు నిర్మించడం జరిగింది. MEIL నాలుగులో ఇప్పటి వరకు రెండు పూర్తి చేయగా మరో రెండు జూలై 2019 నాటికి పూర్తి అవుతాయి

ఎంఈఐఎల్‌ సిటీ గ్యాస్ పంపిణీ

ఎంఈఐఎల్‌ సిటీ గ్యాస్ పంపిణీ

దక్షిణాదిలో వాణిజ్య, పారిశ్రామిక, రవాణా రంగాలకు తోడు గృహ అవసరాలకు సహజ వాయువు సరఫరా చేసేందుకు ఎంఈఐఎల్‌ శ్రీకారం చుట్టింది. 16 జిల్లాల్లో సహజ వాయువును పంపిణీ చేయడానికి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పీఎన్‌జీఆర్‌బీ) నుంచి ఎంఈఐఎల్‌ అనుమతులు పొందింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 14జిల్లాలతో పాటు కర్ణాటకలో రెండు జిల్లాల్లో గ్యాస్‌ను సరఫరా చేయనుంది.

మెగా గ్యాస్ బ్రాండ్ పేరుతో ప్రస్తుతం ఏపీలోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తుంకూర్, బెల్గాం జిల్లాల్లో గృహ అవసరాల కోసం సహజవాయువును వినియోగదారులకు పంపిణీ చేస్తున్నది. వాణిజ్య, పారిశ్రామిక, ఆటోమొబైల్ రంగాల్లో మెగా గ్యాస్ పంపిణీ అవుతోంది. త్వరలోనే తెలంగాణలోని 13 జిల్లాలలో మెగా గ్యాస్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇప్పటి వరకు 360 కిలో మీటర్ల పొడవు పైపు లైన్ నిర్మించింది. భవిష్యత్తులో ఏపి, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 900 కిలో మీటర్ల పైప్ లైన్లను ఏర్పాటు చేయనున్నది. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా పైప్డ్ నేచురల్‌ గ్యాస్‌(పీఎన్‌జీ) అలాగే సహజ వాయువు (సీఎన్‌జీ)గా విభజించి వినియోగదారులకు మార్కెటులో అందుబాటులోంది. పైపు లైన్ ద్వారా గృహావసరాలు వాణిజ్య మరియు పారిశ్రామిక వినియోగదారులకు నేరుగా సరఫరా చేయబడుతోంది.

నాగాయలంక, పెనుగొండ గ్యాస్ క్షేత్రాలు

నాగాయలంక, పెనుగొండ గ్యాస్ క్షేత్రాలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో గ్యాస్ గ్రిడ్ నెట్ వర్క్ అభివృద్ధి చేసేందుకు వ్యూహాత్మకంగా నాగాయలంక మరియు పశ్చిమ పెనుగొండ ప్రాంతాల్లో ఓఎన్జీసి నుంచి సాగరతీర గ్యాస్ క్షేత్రాలను ఎంఈఐఎల్‌ సొంతం చేసుకుంది. ఈ క్షేత్రాల నుంచి గ్యాస్ రోజుకు దాదాపు 130000 ఎస్‌సీఎంలు తరలించే అవకాశాలున్నాయి.

ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం అమెరికా నుంచి ఆత్యాధునిక యాంత్రిక శీతలీకరణ విభాగాలను సిద్ధం చేసింది.

ఎంఈఐఎల్‌ ఇప్పటికే నాగాయలంకలో ప్లాంట్‌ని ప్రారంభించి కృష్ణా జిల్లా పరిసరాల్లో వినియోగదారులకు సహజ వాయువును సరఫరా చేస్తున్నది. అంతే కాకుండా తెలంగాణాలో పరిశ్రమలకు సహజ వాయువును సరఫరా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ పెనుగొండ అనుమతులు రాగానే ఇతర ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తృత పరిచేందుకు ఎంఈఐఎల్‌ సిద్ధంగా ఉంది.

గృహ అవసరాల కోసం సరఫరా గణాంకాలు పరిశీలిస్తే ఇప్పటి వరకు పది వేల ఇళ్లకు గ్యాస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో పది లక్షల ఇళ్లకు సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది.

English summary

అరబ్ దేశాల్లో MEILకు ప్రశంసలు, 6నెలల్లో అరుదైన రికార్డ్: ఏపీ-తెలంగాణలలో గ్యాస్ సరఫరా | Engineering and Infrastructure giant MEIL has completed many projects in India and Worldwide

Engineering and Infrastructure giant MEIL has completed many projects in India and Worldwide.
Story first published: Monday, May 20, 2019, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X