For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 రోజుల్లో సీఈవో, డీప్యూటీ రాజీనామా: కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ షేర్లు

|

ఆర్థిక సంక్షోభంతో తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపేసిన జెట్‌ ఎయిర్వేస్‌ను షాక్ మీద షాక్ తగులుతోంది. రెండు రోజుల్లో ఇద్దరు టాప్ అధికారులు రాజీనామా చేశారు. ఈ ప్రభావం షేర్లపై భారీగా చూపింది. కంపెనీ సీఈఓ వినయ్ దూబే (సోమవారం), డిప్యూటీ సీఈఓ అమిత్ అగర్వాల్ (మంగళవారం) ఒక్కరోజు వ్యవధిలోనే తమ పదవులకు రాజీనామా చేశారు. ఇది కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు రోజులుగా భారీగా నష్టపోతున్న జెట్ షేర్లు బుధవారం కూడా కుప్పకూలాయి.

నేటి ట్రేడింగ్‌లో జెట్ ఎయిర్వేస్ షేర్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఒకానొక దశలో షేరు ధర ఏడు శాతానికి పైగా నష్టంతో ట్రేడ్ అయింది. బీఎస్‌ఈలో జెట్‌ షేరు విలువ 5 శాతానికి పైగా నష్టపోయాయి. గడిచిన మూడు సెషన్లలో కంపెనీ షేరు ధర 20శాతానికి పైగా పడిపోయింది.

Jet Airways shares plunge after top executives quit

జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ఇద్దరు కీలక వ్యక్తులు రాజీనామా చేయడం జెట్ ఎయిర్వేస్‌కు పెద్ద కుదుపు. డిప్యూటీ సీఈవోగా ఉన్న అమిత్ అగర్వాల్ సోమవారం రిజైన్ చేయగా, వినయ్ దుబే వ్యక్తిగత కారణాలతో మంగళవారం నాడు రాజీనామా చేశారు. రెండు రోజుల్లోనే ఇద్దరు అధికారులు రిజైన్ చేశారు. అమిత్ అగర్వాల్ 2015లో జెట్ ఎయిర్వేస్ సీఎఫ్ఓగా కంపెనీలో చేరాడు.

జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం రుణదాతల చేతిలో ఉంది. ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం జెట్ కోసం బిడ్స్ కూడా ఆహ్వానించింది. ఇటీవలే ఇది ముగిసింది. ప్రస్తుతం ఎక్కువ స్టేక్స్ ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లో ఉంది. ఎతిహాద్‌తో పాటు మరికొన్ని సంస్థల నుంచి బిడ్స్ వచ్చాయి. బిడ్స్ సమర్పణకు చివరి తేది గత శుక్రవారం రోజు ముగిసింది.

English summary

2 రోజుల్లో సీఈవో, డీప్యూటీ రాజీనామా: కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ షేర్లు | Jet Airways shares plunge after top executives quit

Jet Airways shares fell nearly 7 per cent on Wednesday, a day after its chief executive officer Vinay Dube resigned. Jet Airways share price opened lower at Rs. 121.10 apiece on the NSE, and declined to Rs.120.00 apiece at the day's weakest point, compared to the previous close of Rs.128.90.
Story first published: Wednesday, May 15, 2019, 18:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X