For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ 'స్కోర్'తోనే ... మీకు ఆర్థిక రక్ష

By Jai
|

స్కోర్ అనగానే అందరికి క్రికెట్ స్కోర్ గుర్తుకు వస్తుంది. ఈ స్కోర్ ఒక క్రికెటర్ లైఫ్కు ఎంత ముఖ్యమో మీకు సంబంధించి ఉండే స్కోర్ కూడా మీకు అంతే ముఖ్యం. ఒక క్రికెటర్ చేసిన స్కోర్ ఆధారంగానే అతనికి పేరు ప్రతిష్టలు వస్తాయి. అభిమానులు పెరుగుతారు. స్కోర్ చేయకుంటే పట్టించుకునే వారుండరు. అతను జట్టులో పేరుకు మాత్రమే ఉన్నట్టు. మంచి స్కోర్ చేస్తూ ఉండేవారికి ఉన్న ఫాలోయింగ్ వేరు. దీన్ని బట్టి కార్పొరేట్ కంపెనీలు వెతుక్కుంటూ వచ్చి తమ బ్రాండ్ కు ప్రచారం చేయాలని పాపులర్ ఆటగాళ్లను వేడుకుంటాయి. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి అతను ఎంత డిమాండ్ చేసిన ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అది అతని స్కోరుకు ఉన్న దమ్ము, విలువ. మరీ మీ స్కోర్ ఏంటో తెలుసా... మీ స్కోర్ 'క్రెడిట్' స్కోర్. ఊరిలో మంచి పేరు లేకుంటే ఉప్పు రాళ్ళూ కూడా పుట్టవు అనేది సామెత. మీ క్రెడిట్ స్కోర్ బాగా లేకుంటే మీ పరిస్థితి కూడా అంతే మరి. మీ స్కోర్ బాగుంటే మీకు అప్పు ఇస్తామంటూ ఆర్థిక సంస్థలు వెంట పడతాయి. స్కోర్ బాగా లేకుంటే మీరు బ్యాంకు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకునే వారు ఉండరు. ఇప్పుడు నవతరం ఫిన్ టెక్ ఫైనాన్స్ startups కూడా క్రెడిట్ స్కోర్ ను బట్టే లోన్స్ ఇస్తున్నాయి.

ఏమిటీ ఈ క్రెడిట్ స్కోర్ ?

ఏమిటీ ఈ క్రెడిట్ స్కోర్ ?

మన దేశంలో వ్యక్తులకు క్రెడిట్ స్కోరును ఇవ్వడానికి ఆర్బీఐ నుంచి లైసెన్సు పొందిన వాటిలో నాలుగు ప్రధాన సంస్థలు : సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్సపీరియన్, సి ఆర్ఐఎఫ్ హైమార్క్ ఉన్నాయి. వ్యక్తులకు రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వివరాలు ఎప్పడికప్పుడు ఈ క్రెడిట్ బ్యూరోలకు తెలియ జేస్తాయి. దీన్ని బట్టి అంతర్గత గ్రేడింగ్ యంత్రాంగం ద్వారా 300 నుంచి 900వరకు స్కోర్ ఇస్తారు.

ఎంత స్కోర్ ఉండాలి?

ఎంత స్కోర్ ఉండాలి?

మరి ఎంత స్కోర్ ఉంటే సులభంగా రుణం పొందవచ్చు అన్నది ముఖ్యమైన అంశం. కనీసం 750 క్రెడిట్ స్కోర్ ఉంటే మీ క్రెడిట్ చరిత్ర బాగుందని భావించి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీకు రుణం ఇచ్చేనందుకు ముందుకు వస్తాయి. ఎక్కువ స్కోర్ ఉంటె తక్కువ వడ్డీ రేటు కోసం మీరు బ్యాంకుతో చర్చించ వచ్చు. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు మిమ్మల్ని రిస్కీ కస్టమర్ గా పరిగణిస్తాయి. మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా దాన్ని తిరస్కరిస్తాయి. ఒకవేళ దరఖాస్తును అంగీకరించి రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చినా వడ్డీరేటు ఎక్కువ వసూలు చేస్తాయి.

స్కోర్ పెంచుకోవడం ఎలా?

స్కోర్ పెంచుకోవడం ఎలా?

ఉద్యోగులు లేదే సాధారణ వ్యక్తులు ముందుగా క్రెడిట్ కార్డును తీసుకోవడం ద్వారా తమ క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. బ్యాంకులు తమ కస్టమర్ల ఆర్థిక స్థాయిని బట్టి క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తుంటాయి. ఈ క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులను నిర్ణీత కాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా ఇష్టం వచ్చినట్టు కొనుగోళ్లు చేయకుండా పద్ధతి ప్రకారం వినియోగించాలి. క్రెడిట్ పరిమితి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఉదాహరణకు మీకు రూ. లక్ష క్రెడిట్ పరిమితి ఉంటే అందులో రూ.30,000 వరకు వినియోగించుకుంటే మంచిది. నిర్ణిత కాలంలో బిల్లు మొత్తం చెల్లించాలి. కొంతమంది కనీస మొత్తమే చెల్లిస్తుంటారు. దీనివల్ల క్రెడిట్ చరిత్ర పై ప్రభావం ఉంటుంది. కస్టమర్ చెల్లింపు విధానాన్ని బట్టి ఆయా బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డు కంపెనీలు క్రెడిట్ లిమిట్ ను పెంచు తాయి. బిల్లుల చెల్లింపులు సక్రమంగా కార్డు ఇచ్చిన ఆర్ధిక సంస్థలే మీ క్రెడిట్ పరిమితిని పెంచుకునే అవకాశం కలిపిస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే మీరు గృహ, ఆటో, వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదం లభిస్తుంది. అందుకే క్రెడిట్ స్కోర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి.....

English summary

మీ 'స్కోర్'తోనే ... మీకు ఆర్థిక రక్ష | How do you keep your credit score high?

Keep balances low on credit cards and other revolving credit. high outstanding debt can affect a credit score.
Story first published: Wednesday, May 15, 2019, 18:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X