For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్‌లో రూ.499 కంటే తక్కువ స్కీం ఉండవు! కారణమిదే: ఏపీ-తెలంగాణల్లోనూ..

|

భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ప్రీపేయిడ్ ప్లాన్‌ను తీసుకురానుంది. రూ.499 కంటే తక్కువ ఉండే పథకాలకు ఎయిర్‌టెల్ స్వస్తి చెప్పనున్నదని తెలుస్తోంది. ఒక్కో ఎయిర్‌టెల్ వినియోగదారుడి నుంచి లభించే సగటు ఆదాయం (ARPU) పెంచుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రూ.499 తక్కువ ఉండే స్కీంలకు స్వస్తి పలకుందని తెలుస్తోంది.

రూ.299కి గుడ్‌బై, మరిన్ని స్కీంల తొలగింపు

రూ.299కి గుడ్‌బై, మరిన్ని స్కీంల తొలగింపు

ఇప్పటికే రూ.299 పోస్ట్ పెయిడ్‌ స్కీంకు ఎయిర్‌టెల్ గుడ్‌బై చెప్పింది. త్వరలో రూ.349, రూ.399 పోస్ట్ పెయిడ్‌ స్కీంలను కూడా తొలగించనుంది. రూ.499 కంటే ఎక్కువ ఉండే పోస్ట్ పెయిడ్‌ స్కీంలు రూ.749, రూ.999, రూ.1,599లను మాత్రమే కొనసాగించనుందని భావిస్తున్నారు. రూ.499 కంటే తక్కువ కలిగిన పోస్ట్ పెయిడ్ పథకాలను దశలవారీగా తొలగిస్తామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఇలాంటి వాటిని తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంచాలని చూస్తున్నట్లుగా తెలిపింది. వీటిని దశలవారీగా తొలగించనుంది.

ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా

ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా

ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సుముఖత చూపే యూజర్లకు డిజిటల్ కంటెంట్‌తో పాటు మరింత విలువ జతచేసే సేవలు అందిస్తామని ఎయిర్‌టెల్ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. యాక్టివ్‌గా ఉండే చందాదార్లను అట్టిపెట్టుకోవడం, వారి నుంచి సగటు ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలిపింది.

ఈ స్కీంలు రద్దు

ఈ స్కీంలు రద్దు

రూ.299 పథకాన్ని ఇప్పటికే రద్దు చేసింది. రూ.349, రూ.399 స్కీంలను కూడా త్వరలో రద్దు చేయనుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రద్దు చేసారు. కొన్ని సర్కిల్స్‌లలో రూ.399 స్కీం అందుబాటులో ఉంది. ఎగ్జిస్టింగ్ కస్టమర్లు కోరుకుంటే పాతరేట్లు కొనసాగుతాయని, కొత్తగా కనెక్షన్ తీసుకునేవారికి మాత్రం ఇవ్వవద్దని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రూ.399 స్కీంకు ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం లభించే వీలు ఉంది. దీనిని రద్దు చేసింది. అదే సమయంలో రూ.499 స్కీంకు మూడు నెలల పాటు నెట్ ఫ్లిక్స్ మెంబర్‌షిప్ ఆఫర్ చేస్తోంది.

రూ.499 కంటే పెద్ద స్కీంలలోనూ..

రూ.499 కంటే పెద్ద స్కీంలలోనూ..

రూ.499 కంటే ఎక్కువ మొత్తం ఉన్న స్కీంలను కూడా పరిమితం చేయనుందని తెలుస్తోంది. రూ.649, రూ.1199 స్కీంలు రద్దు చేసి రూ.749, రూ.999, రూ.1599 స్కీంలను మాత్రమే కొనసాగించనుందని తెలుస్తోంది. ఈ స్కీంలకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. గత ఏడాది డిసెంబర్ నాటికి భారతీ ఎయిర్‌టెల్ చందాదారులు 28.4 కోట్లుగా ఉన్నారు. జియో ఆరంగేట్రం నేపథ్యంలో గత కొద్ది నెలలుగా వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం ఎయిర్‌టెల్‌కు తగ్గింది. ఎయిర్‌టెల్ ARPU 20 శాతం తగ్గగా, జియో ARPU 3 శాతం తగ్గింది.

English summary

ఎయిర్‌టెల్‌లో రూ.499 కంటే తక్కువ స్కీం ఉండవు! కారణమిదే: ఏపీ-తెలంగాణల్లోనూ.. | Airtel tweaks postpaid plans, To phase out those below Rs. 499 per month

Telecom operator Bharti Airtel has tweaked its post-paid plans, a move that involves gradual phasing out of offerings that are less than Rs 499 and retaining limited number of plans above it.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X