For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే రోజున మీ అమ్మకు ఈ గిఫ్ట్ ఇవ్వండి చాలు

By Chanakya
|

రెస్టారెంట్‌లో లంచ్, ఓ సినిమా, చిన్న గిఫ్ట్.. ఇవి కాదు మన అమ్మకు ఇవ్వాల్సిన బహుమానాలు. సరే.. ఈ స్పెషల్ రోజును మరింత స్పెషల్‌గా మార్చేందుకు ఆ స్థాయి ఏర్పాట్లు ఓకె కానీ మీరు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సో ఈ మదర్స్ డే (మే 12న మదర్స్ డే సందర్భంగా) రోజున మీరు మీ అమ్మను మరింత హ్యాపీగా చేయడానికి కంటితుడుపు గిఫ్టులకు బదులు సాలిడ్‌గా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవే.

మహర్షి రికార్డ్స్‌కు అవేంజర్స్ అడ్డుమహర్షి రికార్డ్స్‌కు అవేంజర్స్ అడ్డు

హెల్త్ ఇన్సూరెన్స్

హెల్త్ ఇన్సూరెన్స్

మనలో చాలా మంది పెద్ద వాళ్లకు ఆరోగ్య బీమా తీసుకోరు. ఐటి కంపెనీలు లేదా కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రులను కూడా కొంత వరకూ కవర్ చేస్తున్నాయి. అయితే అధిక శాతం మందికి ఆ అదృష్టం లేదు. వయస్సు పెరిగే కొద్దీ రిస్క్ ఎక్కువవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఓ మంచి హెల్త్ ఇన్సూరెన్స్‌ను మీ పేరెంట్స్‌కు గిఫ్ట్‌గా ఇవ్వండి. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినప్పటికీ ఇది మన బాధ్యత అనే సంగతిని మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఓ 65-70 ఏళ్ల మనిషికి పెద్దగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే హెల్త్ కవర్‌కు సుమారు రూ.35 నుంచి 48 వేల వరకూ ఖర్చవుతుంది. ఇది కాస్త ఔటాఫ్ బడ్జెట్ అనిపించినా పెరుగుతున్న ఆమె ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఇది అన్నింటికంటే ముఖ్యమైన గిఫ్ట్.

ఫైనాన్షియల్ చెకప్

ఫైనాన్షియల్ చెకప్

ఒక వేళ మీ అమ్మానాన్నలు మీతో కాకుండా మీ సొంతూళ్లో ఉన్నారని అనుకుందాం. లేకపోతే మీ తల్లి ఒక్కరే విడిగా ఉన్నారనుకుందాం. అప్పుడు ఆమె ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోండి. నెలనెలా ఎంత ఖర్చవుతోంది, ఎంత డబ్బు అవసరముంది, ఆదాయ మార్గాలు ఏమున్నాయి, తనకి ఇంకా కోరికలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలను మీరే తెలుసుకోండి. లేకపోతే మీకు అంత నాలెడ్జ్ లేదనుకుంటే ఓ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సాయం తీసుకోండి. వాళ్లే సరైన మార్గదర్శకాన్ని ఆమెకు ఇవ్వగలరు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మీరు ఇంకా ఎంత, ఎలాంటి సాయం చేయాలో కూడా క్లారిటీ వస్తుంది. కొంత మంది పైనాన్షియల్ ప్లానర్లు.. రూ.5 నుంచి 25 వేల వరకూ ఛార్జ్ చేస్తారు మీ నెట్వర్త్‌ను బట్టి.

హెల్త్ చెకప్

హెల్త్ చెకప్

ఇది కూడా మరో ముఖ్యమైన అంశం. బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, జనరల్ హెల్త్ చెకప్ వంటివి ఈ వయస్సులో వాళ్లకు చాలా ముఖ్యం. అందుకే ఒకసారి మీ అమ్మకు (నాన్న ఏం తక్కువ కాదు.. ఆయనకు కూడా) ఆరోగ్య పరీక్షలు చేయించండి. ఇప్పుడు థైరోకేర్, మెట్రోపొలిస్, విజయా డయాగ్నస్టిక్స్, డాక్టర్ సి వంటి ఎన్నో సంస్థలు ఇంటికే వచ్చి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని చౌక ధరల్లో ల్యాబ్ టెస్ట్స్ అందిస్తున్నాయి. వాటిని ఓ సారి ట్రై చేయండి. రిపోర్ట్స్‌తో డాక్టర్లను కన్‌సల్ట్ చేసి మీ వాళ్లకు భరోసా ఇవ్వండి.

చివరగా చెప్పేది ఏంటంటే.. మీ అమ్మ అయినా.. మా అమ్మయినా.. ఆమె విలువేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి స్పెషల్ రోజుల్లో కేవలం పైపై మెరుగుల గిఫ్టులు కాకుండా ఆమెకు పనికొచ్చేది (ఆమెకు ఆసక్తి ఉన్నా లేకపోయినా, ఆమెకు తెలిసినా తెలియకపోయినా) ఇస్తే.. ఎంతో ఉపయోగం. మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యం ఆమెతో రోజూ నాలుగు ముక్కలు ప్రేమగా మాట్లాడండి. సో మంచి పనులకు ఆలస్యం చేయడం సరికాదు. ప్రొసీడ్ ఫాస్ట్. హ్యాపీ మదర్స్ డే.

English summary

మదర్స్ డే రోజున మీ అమ్మకు ఈ గిఫ్ట్ ఇవ్వండి చాలు | The best gifts for your mom on Mother's day

On this special eve of mothers day, give your mother a special and caring gift. Rather that mere gifts, plan health insurance, health checkups, etc., to keep her fit.
Story first published: Sunday, May 12, 2019, 7:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X