For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ ఎఫెక్ట్: ఉద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ రూ.700 కోట్ల బంపర్ బొనాంజా

|

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులకు ఎంప్లాయీస్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ESOP) కల్పించింది. ఈఎస్ఓపీ అంటే షేర్ల రూపంలో ఇచ్చే బోనస్. సీనియర్ నుంచి మిడ్ లెవల్ స్టాఫ్ వరకు 100 మిలియన్ డాలర్ల (రూ.700 కోట్లు) విలువైన బొనాంజా ప్రకటించింది. మింత్ర, జబాంగ్‌లోని (అనుబంధ సంస్థలు) ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. కంపెనీలోని నిపుణులను నిలబెట్టుకునేందుకు వీటిని కేటాయించారు. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఒక్కో షేర్‌కు 125 నుంచి 130 డాలర్లు

ఒక్కో షేర్‌కు 125 నుంచి 130 డాలర్లు

సమాచారం మేరకు, ఉద్యోగులకు ESOPలను ఒక్కో షేర్‌కు 125 డాలర్ల నుంచి 130 డాలర్లు కేటాయించారు. కంపెనీ యాన్యువల్ పర్ఫార్మెన్స్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు స్టాక్స్ ఇవ్వడంపై ఓ ఫ్లిప్‌కార్డ్ ఎంప్లాయి కూడా స్పందించారట. స్టాక్స్ ఆప్షన్ తమ సంస్కృతిలో ఓ భాగమని, ఇది ప్రత్యేకమైనదని, ఇంతకుముంచి ఈ షేర్ల గురించిన వివరాలు, ప్రత్యేకతల గురించి తాము ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రమోటెడ్ లేదా హైపర్ఫార్మెన్స్ కేటగిరీ ఉద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ ESOPలను కేటాయించింది.

ఉద్యోగులకు ఎలా ఇచ్చారంటే

ఉద్యోగులకు ఎలా ఇచ్చారంటే

కేటాయించిన ESOPలు ఒక్కో ఉద్యోగికి ఒక్కో విధంగా ఉన్నాయని తెలుస్తోంది. కంపెనీని ప్రమోట్ చేసిన లేదా మంచి ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఇచ్చారని చెబుతున్నారు. కొంతమందికి తమ పూర్తి ఏడాది వేతనానికి సమానమైన షేర్లు ఇవ్వగా, కొంతమందికి సింక్స్‌ మంత్ రెమ్యునరేషన్‌కు సమానంగా ఇచ్చారు. ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగులకు ESOPలు ఇవ్వడం రెండోసారి. అంతకుముందు, 2018 నవంబర్‌లో ఇచ్చింది. 2018 మేలో ఫ్లిప్‌కార్ట్.. వాల్‌మార్ట్ చేతికి వెళ్లింది. గత ఏడాది మేలో వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్‌కార్టును కొనుగోలు చేసింది. ఇది 800 మిలియన్ డాలర్ల ESOPలను పర్చేస్ చేసింది.

 అమెజాన్, రిలయన్స్ దెబ్బ

అమెజాన్, రిలయన్స్ దెబ్బ

ESOPలను ప్రధానంగా స్టార్టప్ కంపెనీలు కేటాయిస్తాయి. ప్రతిభ కలిగిన వారిని నిలుపుకునేందుకు, ప్రోత్సహించేందుకు ఇస్తాయి. ఫ్లిప్‌కార్ట్ విషయానికి వస్తే భారతీయ ఈ-కామర్స్ రంగంలో గట్టి పోటీ నెలకొని ఉంది. అమెజాన్ వంటి వాటితో పోటీ ఉంది. ముఖ్యంగా రిలయన్స్ వంటి అతిపెద్ద కంపెనీలు రానుండటంతో ఫ్లిప్‌కార్ట్ ESOPలను కేటాయించింది.

English summary

రిలయన్స్ ఎఫెక్ట్: ఉద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ రూ.700 కోట్ల బంపర్ బొనాంజా | Flipkart provides ESOPs worth $100 million to retain talent, says report

Flipkart has disbursed a fresh set of employee stock ownership plan (Esops) to its senior and middle-level staff, multiple people privy to the development said, as part of the ecommerce major’s efforts to retain key talent a year into Walmart buying a majority stake in the Bengaluru-based company.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X