For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీకి జీడీపీ షాక్: యూపీఏ కంటే బెస్ట్ గ్రోత్ లెక్కల్లో లూప్‌హోల్స్

|

మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అపైర్స్ డాటాబేస్‌లో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) లూప్‌హోల్స్‌ను గుర్తించిందట. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో జీడీపీ లెక్కల్లో లూప్‌హోల్స్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. తాజా పరిశీలనలో కాంట్రోవర్షియల్ ఫిగర్స్ బయటకు వచ్చాయి.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015లో జీడీపీ బేస్ ఇయర్‌ను సవరించింది. గతంలో 2004-2005 ఆధారంగా జీడీపీ కాలిక్యులేషన్స్ ఉండేవి. మోడీ ప్రభుత్వం దానిని 2011-2012కు మార్చింది. ఎన్డీయే ప్రభుత్వం మార్చిన బేస్ ప్రకారం యూపీఏ కాలంలో వృద్ధి రేటు తక్కువగా ఉంది. పాత జీడీపీ సిరీస్ ప్రకారం 2010-11లో 10.26గా ఉంటే, సవరించిన జీడీపీ సిరీస్ ప్రకారం 8.5 శాతంగా ఉంది. అంటే సవరించిన జీడీపీ బేస్ ఆధారంగా చూస్తే యూపీఏ హయంలో వృద్ధి అంచనా గణనీయంగా తగ్గినట్లుగా ఉంది.

New GDP series, which showed Narendra Modi government growth higher than UPA, based on flawed data: NSSO

జీడీపీ సీరిస్‌ను సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (CSO) ప్రిపేర్ చేసింది. ఇది అన్ని స్టాటిస్టికల్ యాక్టివిటీస్‌ను సమన్వయపరుస్తుంది.

పాత జీడీపీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయివేటు కార్పోరేట్ సెక్టార్ కంపెనీలపై చేసిన సర్వే ఆధారంగా ఉండేది. కొత్త జీడీపీ సిరీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆధ్వర్యంలోని ఎంసీఏ 21 డేటాబేస్ ద్వారా ఉంటోంది. ఇందులో రిజిస్టర్డ్ కంపెనీలు ఉంటాయి.

ఎలాంటి ధ్రవీకరణ లేకుండానే, పరీక్షించని డేటాబేస్ ఉపయోగించడంపై మొదటి నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ డేటా యొక్క విశ్వసనీయతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజాగా, ఓ ఇంగ్లీష్ బిజినెస్ పత్రికలో మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ డాటాబేస్‌లో ఎన్ఎస్ఎస్ఓ లూప్‌హోల్స్ గుర్తించినట్లుగా వార్తలు వచ్చాయి. ఎంసీఏ21 శాంపిల్ కింద సెలక్ట్ చేయబడిన కంపెనీలలో మూడొంతులకు పైగా గుర్తించలేని లేదా రాంగ్ కేటగిరీ సంస్థలు ఉన్నాయట. దీనిపై ప్రభుత్వ అధికారప్రతినిధి ప్రశ్నించగా.. సాధ్యమైనంత త్వరలో వివరణ ఇస్తామని చెప్పారట.

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిమాంశు ఈ కాంట్రోవర్సీపై స్పందిస్తూ... డేటాబేస్‌లోని లూప్‌హోల్స్ ఎంతో ఆందోళనకరమైన అంశాలు అని అభిప్రాయపడ్డారు. మొత్తం జీడీపీ వృద్ధి దీనిపై (ఎంసీఏ21) ఆధారపడితే అది పెద్ద సమస్య అన్నారు. ఇది ఆర్గనైజ్డ్ సెక్టార్‌కే కాకుండా అసంఘటిత రంగ అంచనాకు కూడా ఉపయోగిస్తారన్నారు. నూతన జీడీపీ సిరీస్ కింద రూపొందించబడిన ఈ అసహజ జీడీపీ నెంబర్స్‌ను వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదాహరణకు నోట్ల రద్దు తర్వాత జీడీపీ పెరిగిందన్నారు.

ఎన్డీయే ప్రభుత్వం సవరించిన కొత్త బేస్‌తో మన్మోహన్ సింగ్ పాలించిన 9 ఏళ్లలో (31 మార్చి 2014కు ముందు) వృద్ధి రేటు సరాసరిగా 6.67గా ఉంది.

ఇండియా గణాంకాలపై రాజకీయ జోక్యం బాగా పెరిగిందనే వాదనలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా భారత గణాంకాల వ్యవస్థకు ఉన్న పేరు ప్రతిష్టలు మసకబారే ప్రమాదముందని ప్రపంచవ్యాప్తంగా పేరుకలిగిన 108 మంది ఆర్థిక నిపుణులు, సాంఘిక శాస్త్రవేత్తలు ఈ ఏడాది మార్చిలో అభిప్రాయం వెలిబుచ్చారు. జీడీపీ వృద్ధి అంచనాల సవరణలు, ఉద్యోగ గణాంకాల విడుదల జాప్యంపై గతంలో వీళ్లు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. గణాంకాల మదింపులో చోటు చేసుకునే చిన్న చిన్న లోపాలపై గతంలో విమర్శలు వచ్చేవని, ఇప్పుడు రాజకీయ జోక్యం ప్రభావం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary

మోడీకి జీడీపీ షాక్: యూపీఏ కంటే బెస్ట్ గ్రోత్ లెక్కల్లో లూప్‌హోల్స్ | New GDP series, which showed Narendra Modi government growth higher than UPA, based on flawed data: NSSO

The NSSO has found loopholes in the Ministry of Corporate Affairs database used to calculate India’s GDP series under the Narendra Modi government, bringing the controversial figures under fresh scrutiny.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X