For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓలా-ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్: బ్యాంకుల సహకారంతో త్వరలో క్రెడిట్ కార్డ్స్

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, రైడ్-హెయిలింగ్ యాప్ ఓలాలు త్వరలో క్రెడిట్ కార్డును లాంచ్ చేయనున్నాయి. ఇందుకు ప్రముఖ బ్యాంకుల సహకారం తీసుకోనున్నాయి. ఈ నిర్ణయం క్రెడిట్ మార్కెట్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ఉపయోగపడనుందని అంటున్నారు. తమ కార్డు వినియోగదారుల ఖర్చులపై ఒక అంచనాకు రావడంతో పాటు క్రెడిట్ కార్డు మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఉపయోగపడనుందని వారు చెబుతున్నారు.

ఎస్బీఐ సహకారంతో ఓలా క్రెడిట్ కార్డు

ఎస్బీఐ సహకారంతో ఓలా క్రెడిట్ కార్డు

ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భాగస్వామ్యంతో ఓలా క్రెడిట్ కార్డు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మొదటి సంవత్సరం 1 మిలియన్ కార్డులు ఇవ్వాలని ఓలా భావిస్తోంది. ఈ సంస్థకు 150 మిలియన్ కస్టమర్ల బేస్ ఉంది. క్రెడిట్ కార్డులను ప్రారంభించే ఆలోచన నేపథ్యంలో ఈ అంశంపై ఓలా అంతర్గతంగా ఓ టీంను నియమించిందట. తమ వినియోగదారులు క్రెడిట్ కార్డులు కలిగి ఉండాలని ఓలా కోరుకుంటోందట.

హెచ్‌డీఎఫ్‌సీ లేదా యాక్సిస్ సహకారంతో ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు

హెచ్‌డీఎఫ్‌సీ లేదా యాక్సిస్ సహకారంతో ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు

మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ కూడా యాక్సిస్ బ్యాంక్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహకారంతో క్రెడిట్ కార్డులు తమ కస్టమర్లకు ఈ క్వార్టర్ ముగిసే సమయానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (buy now pay later) సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

అమెజాన్ కార్డు

అమెజాన్ కార్డు

ఓలా లేదా ఫ్లిప్‌కార్ట్ సంస్థలు అధికారికంగా క్రెడిట్ కార్డ్ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్... ఐసీఐసీఐ బ్యాంకుతో జత కలిసి అమెజాన్ పే క్రెడిట్ కార్డునుతీసుకు వచ్చింది. ఈ క్రిడెట్ కార్డుతో అమెజాన్ ఇండియాలో కస్టమర్లకు రివార్డులు, బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, ఓలా కూడా అదే యోచనలో ఉన్నాయట.

English summary

ఓలా-ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్: బ్యాంకుల సహకారంతో త్వరలో క్రెడిట్ కార్డ్స్ | Ola and Flipkart gear up to launch credit cards soon

Betting big on the next frontier of digital payment, ride-hailing app Ola and e-commerce marketplace Flipkart are set to launch credit cards in association with large banks.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X