For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైనాన్షియల్ ప్లానింగ్: నరేంద్రమోడీ X రాహుల్‌గాంధీ, వీరి ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులివే!

|

ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ, మిత్రపక్షాలతో అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ, రాహుల్‌లు తమ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన ఆస్తుల వివరాలు ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో వారి ఆస్తుల వివరాల ఆధారంగా, వారి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటూ ఓ ఆంగ్ల పత్రిక ఆసక్తికర కథనం ఇచ్చింది.

వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోడీ తన తన వద్ద నగదు రూ.38,750, సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్ రూ.4,143, ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ.1,27,81,574, ట్యాక్సి సేవింగ్ బాండ్ (ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రా ట్యాక్స్ సేవింగ్స్) రూ.20,000, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ రూ.7,61,466, బంగారం (గోల్డ్ రింగ్స్) రూ.1,13,800, రియల్ ఎస్టేట్ రూ.1,10,00,000, ఇన్సురెన్స్ రూ.1,90,347 ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్, పేటిఎం సాధించనిది రిలయన్స్ ద్వారా సుసాధ్యం!ఫ్లిప్‌కార్ట్, పేటిఎం సాధించనిది రిలయన్స్ ద్వారా సుసాధ్యం!

వాయనాడ్, అమేథి నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ తన చేతిలో నగదు రూ.11,33,693, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (హెచ్‌డీఎఫ్‌సీ) రూ.7,00,000, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూ.39,89,037, ఈక్వీటీస్ అండ్ ఈక్విటీ ఎంఎఫ్ఎస్ రూ.4,07,48,535, డెబ్డ్ మ్యుచువల్ ఫండ్స్ రూ.1,11,96,147, బంగారం రూ.2,91,367, రియల్ ఎస్టేట్ రూ.10,08,18,284 ఉన్నట్లు పేర్కొన్నారు.

మ్యుచువల్ ఫండ్స్

మ్యుచువల్ ఫండ్స్

ప్రధాని నరేంద్ర మోడీ మ్యుచువల్ ఫండ్స్‌లలో (MF) పెట్టుబడులు ఏమీ పెట్టలేదు. కానీ రాహుల్ గాంధీ దాదాపు 70 శాతం మ్యుచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టారు. మొత్తంగా 5.17 కోట్లు పెట్టారు. అతను విభిన్నమైన 10 MFలలో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో 8 ఈక్విటీ MFలు, 2 హైబ్రిడ్ స్కీంలు. దీర్ఘకాలంలో ఇవి లాభదాయకమని చెబుతారు. రాహుల్ గాంధీ 70 శాతం ఈక్విటీలలో, 27 శాతం డెబ్ట్‌గా, మిగతాది క్యాష్, గోల్డ్ రూపంలో కలిగి ఉన్నారు. మోడీ 99 శాతం డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లలోనే ఇన్వెస్ట్ చేశారు. మిగతా ది బంగారం, క్యాష్ రూపంలో ఉంది.

అఫిడవిట్ ప్రకారం నరేంద్ర మోడీ మొత్తం ఆస్తి రూ.1,37,19,733. ఇందులో డెబ్ట్‌లో 98.86 శాతం, బంగారం రూపంగా 0.83 శాతం, నగదు రూపంలో 0.31 శాతం ఉంది. అఫిడవిట్ ప్రకారం రాహుల్ గాంధీ 70.19 శాతం మ్యుచువల్ ఫండ్స్‌లలో ఇన్వెస్ట్ చేశారు. డెబ్ట్‌గా 27.36 శాతం, క్యాష్ రూపంలో 1.95 శాతం, బంగారం రూపంలో 0.50 శాతం ఉంది.

ట్యాక్స్ సేవింగ్స్ స్కీం

ట్యాక్స్ సేవింగ్స్ స్కీం

మోడీ, రాహుల్ గాంధీలు ఇద్దరు కూడా ట్యాక్స్ సేవింగ్స్ విషయంలో అలర్ట్‌గా ఉన్నారని అంటున్నారు. ప్రతి ఏడాది ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. ఇందుకు మోడీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎంచుకుంటే, రాహుల్ ఎన్ఎస్సీ, పీపీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రధాని మోడీ గత మూడేళ్లుగా ఎన్ఎస్సీలో రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆదాయపన్ను చట్టం 80సి సెక్షన్ ప్రకారం ఇది ట్యాక్స్ ఫ్రీ. రాహుల్ గాంధీ కూడా ట్యాక్స్ ఫ్రీ పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పీపీఎప్‌లో అతని టోటల్ వ్యాల్యూ దాదాపు రూ.39.89 లక్షలు ఉంది.

బంగారం, ఫైనాన్షియల్ సేవింగ్స్

బంగారం, ఫైనాన్షియల్ సేవింగ్స్

మోడీ, రాహుల్ గాంధీలు బంగారంపై తక్కువగా ఇన్వెస్ట్ చేశారు. వారి ఆస్తి మొత్తం ప్రకారం చూస్తే రాహుల్ కేవలం 0.50 శాతం, మోడీ 0.83 శాతం ఇన్వెస్ట్ చేశారు. ప్రధాని మోడీ ఎస్బీఐలో రూ.1.27 కోట్లు FD చేశారు. భారత ప్రధానిగా ఎస్బీఐలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మోడీ ప్రభుత్వ రంగ సంస్థపై విశ్వాసం కనబరిచారని చెబుతున్నారు. రాహుల్ గాంధీ హెచ్‌డీఎఫ్‌సీలో FDలో ఇన్వెస్ట్ చేశారు.

English summary

ఫైనాన్షియల్ ప్లానింగ్: నరేంద్రమోడీ X రాహుల్‌గాంధీ, వీరి ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులివే! | NarendraModi vs Rahul Gandhi: Who wins on financial planning?

prime minister Narendra Modi from the Bhartiya Janata Party and his chief challenger Rahul Gandhi from the Congress are busy in the race to form the next government of India, along with several other regional challengers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X