ఐసీఐసీఐ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందాకొచ్చర్ లోన్ అంశానికి సంబంధించి 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను తప్పుదారి పట్టించారా? ఆర్బీఐని తప్పుదారి పట్టించి ఎస్సార్ కంపెనీకి లోన్ ఇచ్చారా? అంటే విచారణలో అవుననే తేలిందట. విచారణ రికార్డ్స్ ఇదే చెబుతోందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చింది.
2014లో ఎస్సార్ స్టీల్ మిన్నెసోటా ప్రాజెక్టు కెపాసిటీని (మానుఫ్యాక్చరింగ్ స్టీల్ పెల్లెట్స్) 4.1 ఎంటీపీఏ (మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) నుంచి 7 ఎంటీపీఏకు పెంచడంపై ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందట. కానీ కొచ్చార్ మిస్‌లీడ్ చేసి ఎస్సార్ కంపెనీకి లోన్ ఇచ్చారట.

వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల కేసులో చందాకొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్ పైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రుణాలు ఇచ్చినందుకు గాను ప్రతిఫలంగా దీపక్ కొచ్చార్‌కు చెందిన నూపవర్ రెన్యూవబుల్ సంస్థలో వీడియోకాన్ చైర్మన్ పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ గుర్తించింది. నిశాంత్ కనోడియాకు చెందిన మారిషస్ సంస్థ ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ కూడా రూ.325 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఎస్సార్ గ్రూప్ చైర్మన్ రవీ రుయా అల్లుడు నిశాంత్ కనోడియా. చందాకొచ్చార్ నేతృత్వంలోనే ఎస్సార్ స్టీల్‌కు 530 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది.
రాజీవ్ కొచ్చార్ విచారణ
చందాకొచ్చర్ బావ రాజీవ్ కొచ్చర్‌ను ఈడీ బుధవారం కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయనను వరుసగా మూడు రోజుల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ నెల 11వ తేదీన అతని తమ్ముడు దీపక్ కొచ్చర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఈడీ సూచించింది. ఏప్రిల్ 30న దీపక్, చందా కొచ్చర్‌లకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ అధికారిగా చందా కొచ్చర్‌గా సింగపూర్‌కు చెందిన అవిస్తా అడ్వైజరీ పార్ట్‌నర్స్, అవిస్టా హోల్డింగ్స్ రుణాలు తీసుకున్న అంశంపై రాజీవ్ నుంచి మరింత సమాచారం సేకరించారు. దీనిపై స్పందించడానికి రాజీవ్ కొచ్చర్ నిరాకరించారు. ఈ రెండు గ్రూపులకు అక్రమంగా నిధులు పొందడంపై ఈడీ.. చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications