For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలలో సైకిళ్ల పై 15లక్షల డెలివరీలు చేసిన స్విగ్గీ, ప్రయోజనాలెన్నో.. అందుకే

|

సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్ బైక్‌ల ద్వారా సరఫరా చేస్తుంటారు. ఆయా ఫుడ్ యాప్స్ ఉద్యోగులు ఎక్కువగా బైక్‌ల పైన రావడమే చూస్తుంటాం. అయితే స్విగ్గీ తమ ఆర్డర్లను సైకిల్, ఎలక్ట్రిక్ బైక్‌లపై ఎక్కువగా డెలివరీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే భారత ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ సిటీ బెంగళూరులో ఇలాంటి డెలివరీలు ప్రారంభించినట్లు తెలిపింది. ప్రస్తుతం తాము నెలకు 15 లక్షల డెలివరీలను సైకిల్ ద్వారా చేస్తున్నట్లు తెలిపింది.

భారత్‌కు చమురు ధరల పెరుగుదల ఆందోళనకరమేభారత్‌కు చమురు ధరల పెరుగుదల ఆందోళనకరమే

సైకిల్స్ ద్వారా డెలివరీ

సైకిల్స్ ద్వారా డెలివరీ

తమకు 120 నగరాల్లో 1,70,000 మంది డెలివరీ పార్ట్‌నర్స్ ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. గత మార్చి నెలలో తాము మొత్తం 1.5 మిలియన్ (15 లక్షలు) ఆర్డర్లను సైకిళ్ల పైన సరఫరా చేశామని పేర్కొంది. టూ టైర్‌, త్రీ టైర్‌ నగరాలైన సూరత్‌, బెల్గామ్‌, గౌహతి, లక్నో నగరాల్లో దాదాపు ఇరవై శాతం ఫుడ్‌ ఆర్డర్లను సైకిళ్ల ద్వారానే డెలివరీ చేశామని తెలిపింది. దేశవ్యాప్తంగా 10వేలమంది సైకిల్‌ యజమానులు భాగస్వాములుగా ఉన్నారని, అత్యధికమంది బెంగళూరు, ముంబైలలో ఉన్నారని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపింది.

బైక్‌ల కంటే సైకిల్ డెలివరీ ఎంతో లాభం

బైక్‌ల కంటే సైకిల్ డెలివరీ ఎంతో లాభం

ప్రస్తుతం పదివేల మంది సైకిల్ యజమానులు భాగస్వాములుగా ఉన్నారని, త్వరలో పర్యావరణసహిత డెలివరీని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని స్విగ్గీ తెలిపింది. ఆయన మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించారు. కొన్ని నగరాల్లో బైక్‌లపై డెలివరీ చేసేవారికంటే సైకిల్ పైన డెలివరీయే త్వరగా అవుతుందని, బైక్‌ల కంటే వారే త్వరగా డెలివరీ చేస్తున్నారని తెలిపారు. చాలా నగరాల్లో యావరేజ్ టైమ్ తీసుకున్నా బైక్‌ల కంటే సైకిల్ పైన డెలివరీ చేసే సమయమే తక్కువగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడంలో స్విగ్గీ ముందుంటుందని తెలిపారు. 2019 చివరి నాటికి 10 ప్రముఖ నగరాల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌లపై ఫుడ్‌ డెలివరీ చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ, లక్నోలలో ఇ-రిక్షాల ద్వారా ఫుడ్‌ను వినియోగదారులకు అందిస్తున్నారు. దీని వల్ల వ్యయ నియంత్రణతో పాటు, పర్యావరణానికి మేలు జరుగుతోందని చెబుతోంది.

జొమాటోది అదే దారి

జొమాటోది అదే దారి

కాగా, మరో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా ఫిబ్రవరి నుంచి సైకిళ్ల పైన సరఫరా చేస్తోంది. తమకు 5వేల మంది డెలివరీ పార్ట్‌నర్స్ ఉన్నట్లు పేర్కొంది. మొబిసై, యులు, జూమ్‌కార్‌కు చెందిన పెడల్‌లతో ఒప్పందం చేసుకుంది. బైక్స్ కంటే సైకిల్ పైన డెలివరీయే ఖర్చు తక్కువ అని, పైగా లైసెన్స్ అవసరం లేదని జొమాటో అప్పుడు పేర్కొంది. అంతేకాదు, జొమాటో సైకిల్ డెలివరీ బాయ్స్‌కు ప్రత్యేక డెలివరీ బ్యాగ్స్‌ను కూడా తయారు చేసింది. ఆలస్యం లేకుండా 2.5 కిలోమీటర్ల వరకు సరైన సమయంలో డెలివరీ చేసినట్లు పేర్కొంది.

English summary

నెలలో సైకిళ్ల పై 15లక్షల డెలివరీలు చేసిన స్విగ్గీ, ప్రయోజనాలెన్నో.. అందుకే | Swiggy delivers over 15 lakh orders a month on cycles

Swiggy, domestic online food ordering and delivery platform, it delivers over 15 lakh orders every month on mechanical cycles. It has a fleet of over 1,70,000 delivery partners in more than 120 cities.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X