వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రవాణా సంస్థ ఊబెర్ ఐపీఓల విలువను 80.5 బిలియన్ డాలర్ల నుంచి 91.5 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. భారత కరెన్సీలో దీని విలువ రూ. 5,60,300 కోట్లు నుంచి రూ. 6,30,337 కోట్లుగా ఉంది. ఇక ఒక్కో షేరును 44 డాలర్ల నుంచి 50 డాలర్లను ఊబెర్ విక్రయించనున్నట్లు సమాచారం. మొత్తంగా 180 మిలియన్ షేర్లు అమ్మకానికి పెట్టింది ఊబెర్ సంస్థ. దీని ద్వారా 9 బిలియన్ డాలర్లను రాబట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థలో ఉన్న పెట్టుబడిదారులు 27 మిలియన్ షేర్లను అమ్మకానికి పెట్టారు.అవి 1.35 బిలియన్ డాలర్లకు అమ్ముడుపోయాయి.
ఆ సంస్థలో ఉన్న పెట్టుబడిదారులు ఇప్పటికే తమ షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తం, తాజాగా 180 మిలియన్ షేర్లను అమ్మి వచ్చే డబ్బును కలిపితే 10 బిలియన్ డాలర్లు వస్తాయని కంపెనీ పేర్కొంది. అమెరికాలో చైనా సంస్థ ఆలీబాబా గ్రూప్ విక్రయించిన షేర్ల తర్వాత దానికంటె పెద్ద మొత్తంలో షేర్లు విక్రయించిన కంపెనీగా ఊబెర్ సంస్థ ఆవిర్భవించనుంది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ సంస్థ 2014లో పెద్ద మొత్తంలో తన కంపెనీ షేర్లను బహిరంగంగా విక్రయించింది.

ఇక తమ కంపెనీ షేర్లను విక్రయిస్తున్నట్లు తెలిపేందుకు న్యూయార్క్‌లో ఓ రోడ్ షో నిర్వహించింది ఊబెర్ సంస్థ. ఇక సోమవారం రోజున లండన్‌లో పెట్టుబడిదారుల సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత అమెరికాకు తిరిగొచ్చి షేర్ల విక్రయాల గురించి చెబుతారు. ఇక మే 9న తమ కంపెనీ షేర్లను విక్రయించాలని ఊబెర్ సంస్థ భావిస్తోంది. ఆ తర్వాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ట్రేడింగ్ నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఊబెర్ సంస్థలో పెట్టుబడులు పెట్టి తమ షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తంలో 6.86 మిలియన్ షేర్లు ఆ సంస్థ సహవ్యవస్థాపకులు ట్రావిస్ కాలానిక్, మరియు గారెట్ క్యాంప్‌లదే కావడం విశేషం.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications