For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటును సవరించిన కేంద్రం

|

న్యూఢిల్లీ: ఉద్యోగు భవిష్యనిధి (ఈపీఎఫ్ఓ) వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ధారించింది. వడ్డీ రేటు మొత్తాన్ని 8.65 శాతం మేర నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ అధికారులు ఆమోదముద్ర వేశారు. ఇదివరకు ఈ సంఖ్య 8.55 శాతంగా ఉండేది. దీన్ని సవరించింది కేంద్రం.

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా సంఘటిత రంగంలో సుమారు ఆరు కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ తాజాగా సవరించిన వడ్డీ రేటు శాతం వర్తిస్తుందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.

Finance Ministry ratifies 8.65% interest on EPF for 2018-19

భవిష్యనిధిలో డబ్బులను జమ చేసుకున్న ఉద్యోగులందరికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం వడ్డీ రేటును ప్రకటించాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందజేసింది. తాజాగా ఈ ప్రతిపాదనలపై ఆమోదముద్ర పడింది.

నిజానికి- మూడేళ్లుగా భవిష్యనిధి ఖాతాలపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పూ రాలేదు. ఆర్థిక మంత్రిత్వశాఖ వాటిని సవరించలేదు. 8.55 శాతం వడ్డీ రేటును నాలుగేళ్ల పాటు కొనసాగించారు. వడ్డీ రేటు మొత్తాన్ని పెంచాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. దీనికి తాజాగా ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలియజేసింది.

English summary

ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటును సవరించిన కేంద్రం | Finance Ministry ratifies 8.65% interest on EPF for 2018-19

New Delhi: The Finance Ministry has approved 8.65 per cent rate of interest on Employees' Provident Fund (EPF) for 2018-19 as decided by retirement fund body EPFO, benefitting more than 6 crore formal sector workers. "The Department of Financial Services (DFS), a wing of Finance Ministry, has given its concurrence to Employees Provident Fund Organisation's (EPFO) decision to provide 8.65 per cent rate of interest for 2018-19 to its subscribers," a source privy to the development.
Story first published: Saturday, April 27, 2019, 18:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X