స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొన్ని రూల్స్ మార్చింది. అవి మే 1వ తేదీ నుంచి అంటే, మరో అయిదు రోజుల తర్వాత నుంచి అమలులోకి రానున్నాయి. మీకు ఎస్బీఐ అకౌంట్ ఉంటే ఈ రూల్స్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రూల్స్ మీకూ వర్తించే అవకాశాలు ఉండవచ్చు. మే 1వ తేదీ నుంచి ఎస్బీఐ తన లోన్, డిపాజిట్ రేట్లను రెపో రేటుకు అనుగుణంగా మార్పులు చేస్తుంది. రెపో రేటు ప్రకారం లోన్లు మరింత చౌక కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటును అమలుపరుస్తున్న తొలి బ్యాంక్ ఎస్బీఐ.

రూ.1 లక్ష డిపాజిట్లపై తక్కువ ఇంటరెస్ట్ రేట్
ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు వారి డిపాజిట్స్ పైన తక్కువ వడ్డీ పొందుతారు. ఇది మే 1వ తేదీ నుంచి వర్తిస్తుంది. రూ.1 లక్షకు పైన ఉన్న డిపాజిట్ల పైన 0.25 నుంచి 0.75 వడ్డీ తగ్గనున్నట్లు ఎస్బీఐ ఇదివరకే ప్రకటన చేసింది. అలాగే, రూ.1 లక్ష కంటే తక్కువ డిపాజిట్ ఉంటే దానిపై 3.50 శాతం ఇంటరెస్ట్ ఉంటుంది. రూ.1 లక్షకు పైన ఉంటే ఇంటరెస్ట్ రేటు 3.25 శాతంగా ఉండనుంది.

రెపో రేటు లింక్ చేయడం వల్ల ప్రయోజనాలు
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ కొద్ది రోజుల వ్యవధిలో రెపో రోటును 0.5 శాతం తగ్గించింది. ఫిబ్రవరిలో 0.25, ఏప్రిల్‌లో 0.25 శాతం తగ్గించింది. బ్యాంకులు రుణ రేట్లను ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన నిర్ణయిస్తాయి. అయితే బ్యాంకులు చాలా సందర్భాల్లో రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయడం లేదు. బ్యాంకులు రుణ రేట్లను రెపో రేటుతో అనుసంధానం చేస్తే రెపో రేటు తగ్గినప్పుడల్లా ఈఎంఐ భారం తగ్గనుంది. రూ.లక్షకు పైన ఉన్నా రుణాలకే రేట్లను రెపోరేటుతో అనుసంధానం చేస్తారు. ఇతర బ్యాంకులు రెపో రేటు తగ్గించినా ఎస్బీఐలా అక్కడ కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయి. అప్పుడు ఈఎంఐలు తగ్గుతాయి.

ఎస్బీఐ వడ్డీ రేటు కట్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐతో పాటు ఇతర కొన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేటును తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. ఎస్బీఐ రూ.30 లక్షల వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటును 0.10 శాతం తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటు ఇప్పుడు 8.60 శాతం నుంచి 8.90 శాతం శ్రేణిలో ఉంది. మే 1వ తేదీ నుంచి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం 8.70 నుంచి 8.90గా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications