For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేయబోతున్న మారుతి

By Chanakya
|

ప్రముఖ ఫోర్ వీలర్ తయారీ సంస్థ మారుతి సుజుకి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో డీజిల్ కార్ల ఉత్పత్తిని మొత్తం నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అవును మీరు చదివింది నిజమే.
మీరు మారుతి సుజుకి చెందిన స్విఫ్ట్, డిజైర్, సియాజ్, ఎస్ క్రాస్, ఇగ్నిస్ డీజిల్ కార్లను కొనాలని అనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే ఏప్రిల్ 1, 2020 నుంచి మారుతి సంస్థ ఈ కార్లకు చెందిన డీజిల్ మోడల్స్ అన్నింటినీ పూర్తిగా నిలిపేయబోతోంది. 1.5 లీటర్ల కంటే తక్కువ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన డీజిల్ ఇంజన్‌లన్నింటినీ దశలవారీగా ప్రొడక్షన్ అపేయబోతున్నట్టు మారుతి సుజుకి అధికారికంగా ప్రకటించింది.

ఎందుకంటే..

ఏప్రిల్ 1 2020 నుంచి భారత్ ఎమిషన్ స్టేజ్ 6 నిబంధనలను ఆటోమొబైల్ కంపెనీలన్నీ పాటించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా కార్లను తయారు చేయాలంటే తడిసి మోపెడవుతుందని, ఇవి ఏ మాత్రం కాస్ట్ వర్కవుట్ కాదని మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్. సి. భార్గవ వెల్లడించారు. ఇప్పుడు పెట్రోల్ - డీజిల్ కార్ల మధ్య వ్యత్యాసం రూ.1 లక్ష వరకూ ఉంది. కానీ ఈ నిబంధనల అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేయాలంటే కనీసం రూ.2.5 లక్షల వరకు పెట్రోల్- డీజిల్ మధ్య తేడా పెరుగుతుంది.

Maruti to phase out all diesel cars from April next year

'' చిన్న డీజిల్ ఇంజన్లను బీఎస్-6కి అనుగుణంగా మార్చడం చాలా కఠినమైన వ్యవహారం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పనికూడా. అంత ధర పెట్టి డీజిల్ కార్లను కొనుగోలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అందుకే దశల వారీగా డీజిల్ కార్లను తగ్గించేస్తాం'' - మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్. సి. భార్గవ.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మారుతి మొత్తం వాహన అమ్మకాల్లో డీజిల్ కార్ల వాటా 25 శాతం ఉంది. దీంతో ఈ అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి స్టాక్ కూడా గత నాలుగైదు రోజులుగా భారీగా పతనమవుతూ వస్తోంది.

మరి డీజిల్ ఉండవా

మెల్లిగా వివిధ కంపెనీలు కూడా ఇదే బాట పట్టక తప్పని స్థితి. పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లుతుందని గతంలో సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ప్రపంచ వ్యాప్తంగా డీజిల్ కార్ల ఉత్పత్తి, వాడకం అంతంతే. అందుకే మెల్లిగా సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వైపు కంపెనీలు మళ్లుతున్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్ కంటే ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలే రోడ్లపై అధికంగా కనపడవచ్చు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, చమురుపై ఆధారపడడం తగ్గించుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ ఈ బాట పడ్తున్నాయి.

English summary

డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేయబోతున్న మారుతి | Maruti to phase out all diesel cars from April next year

Maruti Suzuki to stop mass production of diesel cars from April 2020. Maruti is the first company in India to declare a ‘no-diesel’ plan
Story first published: Thursday, April 25, 2019, 22:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X