For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీటీహెచ్, కేబుల్ టీవీ ఛానల్స్ సెలక్షన్ ప్రాసెస్: 100 ఛానల్స్ ఎలా.. తెలుసుకోండి

|

కొత్త టారిఫ్ ఆర్డర్లు వయోలేట్ చేసే కేబుల్ టీవీ, డీటీహెచ్ ప్లేయర్స్ పైన కఠిన చర్యలు ఉంటాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆర్ఎస్ శర్మ ఇటీవల వెల్లడించారు. ఛానల్స్ ఛాయిస్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లుగా ట్రాయ్‌కు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అదే సమయంలో ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకారం ఛానల్స్ ఎంపిక కన్ఫ్యూజన్‌గా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ కారణంగా ట్రాయ్ బెస్ట్ ఫిట్ ప్లాన్ ఇంట్రొడ్యూస్ చేసింది. మార్చి 31వ తేదీలోగా తమ ఛానల్స్‌ను కన్‌ఫర్మ్ చేయని యూజర్లకు టెలికం ప్రొవైడర్ ద్వారా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. అయితే, ఛానల్స్ విషయంలో కన్ఫ్యూజ్‌గా ఉన్నవారు ఇది చెక్ చేసుకొని ముందుకు వెళ్లవచ్చు.

డీటీహెచ్, కేబుల్ టీవీ ఛానల్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రాసెస్

డీటీహెచ్, కేబుల్ టీవీ ఛానల్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రాసెస్

- నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు (NFC) - రూ.130+18% జీఎస్టీ - 100 ఛానల్స్‌. దాదాపు మొత్తం రూ.153 అవుతుంది.

- 100 ఛానల్స్ తర్వాత ప్రతి 25 ఛానల్స్‌కు రూ.20 అదనపు ఛార్జీ ఉంటుంది.

- 100 ఛానల్స్ జాబితాలో కొన్ని పెయిడ్ ఛానల్స్ కూడా ఉంటాయి. వాటికి అదనపు ఛార్జీ ఉంటుంది.

- ఈ ప్యాక్‌లో 25 డీడీ ఛానల్స్ ఉన్నాయి. వాటిని రిమూవ్ చేసే అవకాశం లేదు.

- ఉదాహరణకు మీరు 150 ఛానల్స్ కావాలనుకుంటే NFC రూ.130 (18 శాతం జీఎస్టీ అదనం). 150లో 100 చానల్స్ కాకుండా మిగతా యాభై ఛానల్స్‌కు ఒక్కో 25 ఛానల్స్‌కు రూ.20 చెల్లించాలి. అంటే రూ.20 ప్లస్ రూ.20.

-పెయిడ్ ఛానల్స్ లో కాస్ట్ 0.50 పైసల నుంచి (నెలకు) ప్రారంభమవుతుంది. గరిష్టం రూ.19.

- మరో విషయం గుర్తుకు పెట్టుకోవాలి. ఒక HD ఛానల్ ఈజ్ ఈక్వల్ టు 2 SD ఛానల్స్.

- ఆపరేటర్లు ఇచ్చే రీజినల్ ప్యాక్స్, మంత్లీ ప్యాక్స్‌లను కూడా యూజర్లు ఎంచుకోవచ్చు.

ట్రాయ్ నోటీసులు

ట్రాయ్ నోటీసులు

ఇదిలా ఉండగా, కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనలు పాటించనందుకు కేబుల్ టీవీ, డీటీహెచ్ ఆపరేటర్లపై ట్రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు బేఖాతరు చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రాయ్ చైర్మన్ ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. అయిదు రోజుల్లో సమాధానం చెప్పాలని లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మూడింటికి నోటీసులు

మూడింటికి నోటీసులు

నోటీసులు అందుకున్న వారిలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ, డీ2హెచ్ ఉన్నాయి. వినియోగదారుల ఇష్టాన్ని కాదని, ఆపరేటర్లు తమకు నచ్చిన ఛానళ్లను ప్రసారం చేస్తున్నాయని పైగా వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. చందాదారులు, కేబుల్ నిర్వాహకుల వ్యవస్థలను త్వరలో ఆడిట్ చేస్తామని శర్మ చెప్పారు. కస్టమర్ తనకు ఇష్టమైన ఛానల్స్ ఎంపిక చేసుకోవచ్చునని చెప్పారు.

Read more about: business tv
English summary

డీటీహెచ్, కేబుల్ టీవీ ఛానల్స్ సెలక్షన్ ప్రాసెస్: 100 ఛానల్స్ ఎలా.. తెలుసుకోండి | DTH, Cable TV channels selection process: Here is how to select your 100 channels, all you need to know

Telecom Regulatory Authority of India (TRAI) Chairman R S Sharma has said that strict action will be taken against cable TV and DTH players who are found violating its new tariff order for cable and DTH companies, which came into effect on February 1, 2019.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X