For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాన్ ఎఫెక్ట్: TikTokకు రోజుకు రూ.3.5 కోట్ల నష్టం, 250మంది ఉద్యోగులపై కత్తి

|

చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. దీంతో తమ సంస్థ ఆర్థికంగా ఎంతో నష్టపోతోందని టిక్‌టాక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రోజుకు 5,00,000 డాలర్లు (మూడున్నర కోట్లు) నష్టపోతున్నామని, అంతేకాకుండా 250 మంది ఉద్యోగాల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని పేర్కొంది. ఈ మేరకు టిక్‌టాక్ యాప్ డెవలప్ చేసిన బైట్‌డాన్స్ టెక్నాలజీస్ కంపెనీ కోర్టుకు తెలిపింది.

నీరవ్ పారిపోయాక 75 శాతం తగ్గిన సిల్వర్ ఎగుమతులునీరవ్ పారిపోయాక 75 శాతం తగ్గిన సిల్వర్ ఎగుమతులు

కోర్టుకెక్కిన టిక్‌టాక్

కోర్టుకెక్కిన టిక్‌టాక్

దీనిని నిషేధించడం వల్ల రాజ్యాంగబద్దమైన ఫండమెంటల్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్‌ను అడ్డుకుంటున్నారని కూడా కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొన్నదట. పెట్టుబడి, కమర్షియల్ రెవెన్యూ వంటి వాటితో కలిపి రోజుకు 5 లక్షల డాలర్ల నష్టం జరుగుతోందని, అంతేకాకుండా, టిక్‌టాక్ పైన బ్యాన్ తమ రిప్యూటేషన్‌ను, గుడ్‌విల్‌ను దెబ్బతీస్తోందని, ప్రకటనదారులు, పెట్టుబడిదారులపై ప్రభావం పడుతోందని పేర్కొంది.

1 మిలియన్ కొత్త యూజర్లను కోల్పోతున్నాం

1 మిలియన్ కొత్త యూజర్లను కోల్పోతున్నాం

టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడం ద్వారా రోజుకు 1 మిలియన్ కొత్త యూజర్లను కోల్పోతున్నామని తెలిపింది. బ్యాన్ చేసినప్పటి నుంచి దాదాపు 6 మిలియన్ డౌన్‌లోడ్ రిక్వెస్ట్‌లు వచ్చాయని, కానీ బ్యాన్ చేసిన నేపథ్యంలో వాటిని నష్టపోయామని తెలిపింది. ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని పేర్కొంది.

నిషేధం ఎత్తివేయాలని టిక్‌టాక్

నిషేధం ఎత్తివేయాలని టిక్‌టాక్

వీడియోలకు అదనపు హంగులు జోడించి స్నేహితులతో పంచుకునే టిక్‌టాక్‌ యాప్‌ ఎంతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను 1 బిలియన్‌కు పైగా వినియోగిస్తున్నారు. భారత్‌లో ఏకంగా 300 మిలియన్ల మంది దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే, ఈ యాప్‌ ద్వారా పోర్నోగ్రఫీ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భారత్‌లో టిక్‌టాక్‌ డౌన్‌లోడ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. యాపిల్‌, గూగుల్‌లు తమ యాప్ స్టోర్స్‌ నుంచి టిక్‌టాక్‌ను తొలగించాయి. దీంతో టిక్‌టాక్‌ కంపెనీ బైట్‌డ్యాన్స్‌ను నష్టాలు చుట్టుముట్టాయి. దీంతో బైట్‌‌డ్యాన్స్‌ కోర్టును ఆశ్రయించింది. టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని ఈ మేరకు యాపిల్‌, గూగుల్‌ సంస్థలను ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. దీనిపై సుప్రీం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కేసు విచారణ వచ్చే బుధవారం రానుంది.

English summary

బ్యాన్ ఎఫెక్ట్: TikTokకు రోజుకు రూ.3.5 కోట్ల నష్టం, 250మంది ఉద్యోగులపై కత్తి | TikTok ban in India causing $500,000 daily loss, job risks, says Bytedance

Indian government's ban on Chinese video app TikTok is causing "financial losses" of up to $500,000 a day for its developer, Beijing Bytedance Technology Co. The prohibition has also put more than 250 jobs at risk, the company said in a court filing.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X