For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్విస్ట్: జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం: డిసెంబర్‌లో నరేష్ గోయల్ కంపెనీలో రూ.260 కోట్లు

|

పాతిక సంవత్సరాలకు పైగా విమానయాన రంగంలో సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇటీవలే తాత్కాలికంగా పూర్తి సర్వీసులు నిలిపివేసింది. కొన్నేళ్లుగా అప్పులు కూరుకుపోతున్నాయి. డిసెంబర్ నెల నుంచి పైలట్లకు, ఇంజినీర్లకు, ఇతర ఉద్యోగులకు జెట్ వేతనాలు చెల్లించలేదు. వారికి నాలుగు నెలలుగా వేతనాలు రాలేదు. డిసెంబర్ నుంచి జెట్ ఎయిర్వేస్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

జెట్ ఎయిర్‌వేస్‌కు మరో షాక్, డైరెక్టర్ జైదీ రాజీనామా: ఇతర రంగాల్లోకీ జెట్ ఉద్యోగులుజెట్ ఎయిర్‌వేస్‌కు మరో షాక్, డైరెక్టర్ జైదీ రాజీనామా: ఇతర రంగాల్లోకీ జెట్ ఉద్యోగులు

ఇలాంటి సమయంలో జెట్ ఎయిర్వేస్ మాజీ అధినేత నరేష్ గోయల్‌కు చెందిన సొంత కంపెనీ జెట్ఎయిర్ ప్రయివేట్ లిమిటెడ్ (జేపీఎల్) సర్‌ప్లస్‌లో ఉంది. జెట్ ఎయిర్వేస్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ కంపెనీ ద్వారా వచ్చే క్రెడిట్ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోలేదని అంటున్నారు. దీంతో ఎంతోకొంత గట్టెక్కించే పరిస్థితి ఉన్నప్పటికీ అటువైపు చూడలేదని అంటున్నారు.

Naresh Goyals firm had Rs 260 crore cash when financial crunch hit Jet Airways

గోయల్‌కు చెందిన జేపీఎల్ గత ఏడాది (2018) డిసెంబర్ నెలలో రూ.260 కోట్లు మొత్తం కలిగి ఉందట. 2018 అక్టోబర్ నెలలో యూపీఎస్ జెటెయిర్ ఎక్స్‌ప్రెస్‌లో జేపీఎల్ వాటాగా రూ.232 కోట్లు తీసుకుంది. 28 కోట్ల క్రెడిట్ ఫెసిలిటీ కలిగి ఉంది. కానీ అవసరమైనప్పుడు దీనిని ఉపయోగించలేదని అంటున్నారు.

ఇటీవల జెట్ ఎయిర్వేస్ కోసం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం బిడ్లను ఆహ్వానించింది. ఆ సమయంలో ఏప్రిల్ 12న ఈ కంపెనీ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ)ను సమర్పించింది. అంటే గోయల్ కూడా బిడ్ సమర్పించారు. అయితే ఇతర బిడ్డర్లు, రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు నో చెప్పడంతో నరేష్ గోయల్ కంపెనీ బిడ్ తీసుకోలేదు.

English summary

ట్విస్ట్: జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం: డిసెంబర్‌లో నరేష్ గోయల్ కంపెనీలో రూ.260 కోట్లు | Naresh Goyal's firm had Rs 260 crore cash when financial crunch hit Jet Airways

JPL had a cash reserve of Rs 260 crore as on December 2018. Jetair's stake was divested in UPS Jetair Express in October 2018 and around Rs 232 crore in cash was raised.
Story first published: Monday, April 22, 2019, 16:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X