For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్: ఆడి, మెర్సిడెజ్ కార్ల కంపెనీలతో ఓలా చర్చలు

|

త్వరలో మీరు లగ్జరీ కార్లు ఆడి, మెర్సిడెజ్, బీఎండబ్ల్యు వంటి లగ్జరీ కార్లు డ్రైవ్ చేయవచ్చు! సెల్ఫ్ డ్రైవింగ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు లగ్జరీ కార్ల కంపెనీలు ఆడి, మెర్సిడెజ్, బీఎండబ్ల్యు సంస్థలతో ఓలా చర్చలు జరుపుతోంది.

ఓలా కార్లు, ఓలా బైక్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల కోసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు కూడా సిద్ధమైంది. ఈ మొత్తం రానున్న రెండేళ్లలో వివిధ మార్గాల్లో సేకరించనుంది. ఇందులో భాగంగా రానున్న కొద్ది రోజుల్లో లగ్జరీ సెడాన్స్, ఎస్‌యూవీలను ప్రముఖ నగరాల్లో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుందని ఇదివరకే విన్నాం.

ఇక నుంచి ఆ బ్యాంకులకు 5 రోజులు సెలవు అంటూ ప్రచారం: ఆర్బీఐ వివరణఇక నుంచి ఆ బ్యాంకులకు 5 రోజులు సెలవు అంటూ ప్రచారం: ఆర్బీఐ వివరణ

Drive your dream Audi, Mercedes, BMW, other luxury cars, pay to Ola

సెల్ఫ్ డ్రైవింగ్ లేదా లగ్జరీ కారు సర్వీస్ ఓలాకు కొత్త కాదు. ఇప్పటికే ఇది బెంగళూరులో స్మాల్ స్కేల్ పైలట్ సెల్ఫ్ డ్రైవింగ్ సర్వీస్ ప్రారంభించింది. లక్స్ సర్వీసెస్ ద్వారా లగ్జరీ కార్లు బుక్ చేసుకునే వెసులుబాటును బెంగళూరులో కల్పించింది. ఇందుకు బీఎండబ్ల్యూతో టైఅప్ అయింది. ఓలా సెల్ఫ్ డ్రైవ్ కార్లను కూడా త్వరలో ఓలా ఫ్లీట్ టెక్నాలజీస్ పేరుతో ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇందులో లగ్జరీ కార్లను బుక్ చేసుకోవచ్చు.

విదేశాలలో సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ సెల్ఫ్ డ్రైవింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భారత్‌లోకి కూడా తెచ్చేందుకు ఓలా సిద్ధమవుతోంది. అయితే ఆ లగ్జరీ కార్ల కంపెనీల నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. ఓలాలో సాఫ్ట్‌బ్యాంక్, టెన్సెంట్ హోల్డింగ్స్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇటీవల ప్లిప్‌కార్ట్ కో-ఫౌండర్ సచిన్ బన్సల్ రూ.650 కోట్ల ఫండింగ్ చేశారు. కియా, హ్యుండాయ్‌లు తమ సంస్థలో 300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

English summary

సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్: ఆడి, మెర్సిడెజ్ కార్ల కంపెనీలతో ఓలా చర్చలు | Drive your dream Audi, Mercedes, BMW, other luxury cars, pay to Ola

Ride hailing platform Ola is in discussions with luxury carmakers, including Audi, Mercedes and BMW, to launch a subscription based service under its self-drive offering, according to sources.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X