For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రూప్ ఇన్సూరెన్స్‌లో పాజిటివ్.. నెగిటివ్ పాయింట్స్

By Chanakya
|

గ్రూప్ ఇన్సూరెన్స్... పేరుకు తగ్గట్టే కొంత మంది గ్రూప్‌కు లేదా ఒక బృందానికి కల్పించే బీమా సౌకర్యం. ఒక సింగిల్ ఇన్సూరెన్స్ పాలసీతో మొత్తం గ్రూపును కవర్ చేయడం దీని ఉద్దేశం. ఇందులోనూ రెండు రకాలుంటాయి. మొదటిది ఓ ఇన్సూరర్.. ఓ కంపెనీ ద్వారా ఉద్యోగికి కల్పించే బీమా సౌకర్యం. రెండోది ఏంటంటే.. నేరుగా ఇన్సూరర్ కొంత మంది కస్టమర్లకు అమ్మే ఇన్సూరెన్స్ పాలసీ. వీళ్లు బ్యాంక్ ఉద్యోగులు, స్టూడెంట్స్, టీచర్స్.. ఇలా ఎవరైనా ఒక బృందానికి చెందినవారు అయిండొచ్చు.

ఇక్కడ ఉదాహరణ చూద్దాం. మీ కంపెనీ మీకు హెల్త్ కేర్ కవర్ కల్పిస్తోందనుకుందాం. ఇందుకు నెలనెలా లేదా మూడు నెలలకు ఓ సారి మీ జీతంలో కొంత మొత్తాన్ని కట్ చేసి ప్రీమియం కట్టొచ్చు. లేకపోతే ఉచితంగా కూడా మీకు ఈ సౌలభ్యాన్ని కల్పించవచ్చు. అప్పుడు మీకు ఏదైనా అవసరమొస్తే.. క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ సౌకర్యం లేకపోతే రీఇంబర్స్‌మెంట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ గ్రూప్ ఇన్సూరెన్సుల్లో లైఫ్, హెల్త్ రెండూ ఉంటాయి.

మీ పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త పాలసీ, రూ.206తో రూ.27 లక్షలుమీ పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త పాలసీ, రూ.206తో రూ.27 లక్షలు

ఇవి కాస్త రేటు తక్కువ

ఇవి కాస్త రేటు తక్కువ

రెగ్యులర్ ఇన్సూరెన్స్‌లతో పోలిస్తే గ్రూపు ఇన్సూరెన్స్‌ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రూప్ మొత్తానికి సర్వ్ చేస్తారు కాబట్టి వాల్యూమ్ గేమ్‌లో భాగంగా మీకు తక్కువకు వస్తుంది. ఒకే సారి ఎక్కువ మందికి తీసుకుంటారు, ప్రీమియం మొత్తం ఒకే సారి చేతికి అందుతుంది కాబట్టి సంస్థలు తక్కువకే బీమా సౌకర్యాన్ని కల్పిస్తాయి. అవసరాన్ని, అవగాహనను బట్టి ఈ ప్రీమియం మొత్తాన్ని కంపెనీ నేరుగా చెల్లించవచ్చు.. లేకపోతే ఉద్యోగుల నుంచి సేకరించి కంపెనీకి కట్టొచ్చు. ఇందులో ఏది పద్ధతి చూసినా డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు అసలు ఉండవు కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం తక్కువే ఉంటుంది.

తీసుకోవడం ఎంత వరకూ లాభం

తీసుకోవడం ఎంత వరకూ లాభం

గ్రూప్ ఇన్సూరెన్స్‌లనే పూర్తిగా గుడ్డిగా నమ్మి వాటినే ఎంచుకోవడం సరైంది కాదు. ముఖ్యంగా ఆరోగ్య బీమా విషయంలో మాత్రం వీటిని ప్రధాన ప్లాన్‌గా పెట్టుకోవద్దు. మీకు ఉన్న ఫ్యామిలీ ఫ్లోటర్‌కు దీన్ని ఓ అదనపు ప్లాన్‌గా మాత్రమే చూడాలి. మన కుటుంబ అవసరాలు, వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన ఆప్షన్స్‌ను గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోవచ్చు. వీటిని మన సౌలభ్యానికి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోలేం. ఇవి పరిమిత కవరేజ్‌ ఉన్న ప్లాన్స్ మాత్రమే. పూర్తిగా మనం వీటిపైనే ఆధారపడ్డామని అనుకుందాం. ఒక వేళ ఉద్యోగం మానేసినా, వాళ్లు తీసేసినా మనకు హెల్త్, లైఫ్ కవర్ పూర్తిగా పోతుంది. ఒక ఏజ్ తర్వాత మనం కొత్తగా బీమా తీసుకోవాలంటే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి రావొచ్చు. వీటికి తోడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోమని సదరు బీమా కంపెనీలు ఆదేశించవచ్చు కూడా.

చివరగా..

చివరగా..

బృంద బీమా అనేది కేవలం ఓ సెకెండరీ ఆప్షన్ మాత్రమే. దీన్నే ప్రైమరీగా పెట్టుకోవద్దు. లైఫ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వంటి వాటికి పనికి వస్తుందేమో కానీ హెల్త్ కవర్ విషయంలో మాత్రం మనకు సూట్ అయ్యే ప్రత్యేక ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ వయసు పైబడిన పేరెంట్స్ ఉంటే.. వాళ్లకు చవకగా గ్రూప్ ఇన్సూరెన్స్‌లో మీతోపాటు అడిషనల్‌గా బీమా లభిస్తే.. తీసుకోండి. దీన్ని మీ తల్లిదండ్రుల అవసరాలకు వరకూ మాత్రమే వాడుకోండి. మీకు ప్రత్యేకించి ఓ సెపరేట్ హెల్త్ కవర్ తీసుకోండి.

Read more about: points insurance
English summary

గ్రూప్ ఇన్సూరెన్స్‌లో పాజిటివ్.. నెగిటివ్ పాయింట్స్ | Check here the positive and negative points of taking a group insurance.

Check here the positive and negative points of taking a group insurance.
Story first published: Sunday, April 21, 2019, 9:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X