For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విప్రో బంపర్ బొనాంజా: రూ.10,500 కోట్లతో రూ.281 షేర్‌కు రూ.325 భారీ ఆఫర్

|

ఇన్వెస్టర్లకు విప్రో తీపి కబురు చెప్పింది. భారీస్థాయిలో రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. కంపెనీ మంగళవారం క్యూ4 ఫలితాల సందర్భంగా ఈ అంశాన్ని వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా షేరుకు రూ.325 ధర చొప్పున 32.3 కోట్ల షేర్లను తమ వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించిది. కంపెనీ మొత్తం పెయిడ్ అప్ ఈక్విటీలో ఇది 5.35 శాతానికి సమానం.

విప్రో విప్రో మంగళవారం ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసానికి గాను రూ.2,494 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.1,800.80 కోట్ల లాభం ఆర్జించింది. దాంతో పోలిస్తే 38 శాతం వృద్ధి నమోదయిందని విప్రో సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలి జెడ్ నీముచ్‌వాలా వెల్లడించారు. అలాగే సంస్థ రూ.10,500 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయనున్నట్లు స్పష్టం చేశారు.

<strong>రిలయన్స్ జియో మరో ముందడుగు: ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీకి</strong>రిలయన్స్ జియో మరో ముందడుగు: ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీకి

 సెబి నిబంధనల ప్రకారం టెండర్ ఆఫర్ రూపంలో

సెబి నిబంధనల ప్రకారం టెండర్ ఆఫర్ రూపంలో

సెబి నిబంధనల ప్రకారం టెండర్ ఆఫర్ రూపంలో ప్రస్తుత వాటాదారుల నుంచి ఈ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు విప్రో వెల్లడించింది. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ కంపెనీ కూడా బైబ్యాక్‌లో పాలుపంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. విప్రో ఇస్తానని చెబుతున్న బైబ్యాక్ ధర మంగళవారం నాటి విప్రో షేరుతో పోలిస్తే 16 శాతం ఎక్కువ. మంగళవారం నాటి విప్రో ముగింపు ధర రూ.281గా ఉంది. విప్రో బైబ్యాక్‌లో రూ.325కు కొనుగోలు చేస్తామని తెలిపింది. 32.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి అవసరమయ్యే రూ.10,500 కోట్ల నిధులను వెచ్చించడానికి బోర్డు అంగీకారం తెలిపిందని ఈ సందర్భంగా తెలిపారు.

 వరుసగా విప్రో బైబ్యాక్ ఆఫర్

వరుసగా విప్రో బైబ్యాక్ ఆఫర్

గడిచిన పదిహేను నెలలో విప్రో బైబ్యాక్ ఆఫర్ ప్రకటించడం ఇది రెండోసారి. గత మూడేళ్లలో ఇది మూడోసారి. 2016లో రూ.2,500 విలువైన షేర్లను కొనుగోలు చేసింది. నవంబర్-డిసెంబర్ 2017లో రూ.11 వేలకోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి విప్రోలో ప్రమోటర్లకు 73.85 శాతం వాటా ఉంది. 6.49 శాతం వాటా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్స్ చేతిలో ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వద్ద 11.74 శాతం ఉంది. కార్పోరేట్లు, ఇతరుల వద్ద 7.92 శాతం ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి రూ.58,584.5 కోట్ల ఆదాయంపై రూ.9, 017.90 కోట్ల నికర లాభాన్ని విప్రో ఆర్జించింది. తాజా బైబ్యాక్ ఆఫర్ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి చేపడతామని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ఆమోదం తీసుకోనున్నట్లు పేర్కొంది. బైబ్యాక్ ప్రక్రియ, కాల వ్యవధి, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

 భారీ మొత్తంలో బైబ్యాక్‌లు

భారీ మొత్తంలో బైబ్యాక్‌లు

భారీ మొత్తంలో ఉన్న నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంచేందుకు ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీలు వరుసగా బైబ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గత రెండేళ్లలో టీసీఎస్ ఏకంగా రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేసింది. ఇన్ఫోసిస్ కూడా 2017 డిసెంబర్‌లో రూ.13,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించింది. మరుసటి జనవరిలో రూ.8,260 కోట్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా బైబ్యాక్ ఆఫర్లు ప్రకటించాయి. ఇదిలా ఉండగా, విప్రో ప్రకటించిన దాని ప్రకారం... ఈ ఆర్థిక ఫలితాల్లో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8.9 శాతం పెరిగి రూ.15,006.30 కోట్లకు చేరుకుంది. 2017 -18 ఇదే కాలంలో సంస్థ రూ.13,768.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

English summary

విప్రో బంపర్ బొనాంజా: రూ.10,500 కోట్లతో రూ.281 షేర్‌కు రూ.325 భారీ ఆఫర్ | Wipro Q4 net rises to ₹2,484 crore, announces ₹10,500 crore share buyback

Wipro announced ₹10,500 crore share buyback at a price of ₹325, joining the growing ranks of IT firms returning surplus cash to their shareholders. Wipro's shares today closed 2.5% lower at ₹281, ahead of the earnings announcement.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X