For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కో షేర్‌ను రూ.325కి కొంటాం - విప్రో బంపర్ ఆఫర్

By Chanakya
|

విప్రో రెండేళ్లలో వరుసగా మూడోసారి కూడా షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ఈ సారి భారీ ఎత్తున సుమారు రూ.10500 కోట్లను ఇందుకోసం కేటాయించింది. ఈ ప్రతిపాదనకు విప్రో బోర్డ్ ఆమోదం తెలిపింది. సుమారు 32.31 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.325 చొప్పున తిరిగి కొనేందుకు విప్రో సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో విప్రో షేర్ ధర రూ.281 మాత్రమే ఉంది. రికార్డ్ తేదీని సంస్థ ఇంకా ప్రకటించలేదు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Wipro approves Rs 10,500 crore buyback at Rs 325/share

ఎందుకీ బైబ్యాక్

విప్రో సంస్థ దగ్గర పటిష్టమైన క్యాష్ ఫ్లోస్ ఉన్నాయని, స్థిరమైన ఆదాయానికి తోడు మార్జిన్లు కూడా పెరుగుతున్నాయని యాజమాన్యం ప్రకటించింది. షేర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చడం తమ సంస్థ లక్ష్యమని, అందుకే బైబ్యాక్ ప్రతిపాదన చేసినట్టు సంస్థ సీఎఫ్ఓ జతిన్ దలాల్ వెల్లడించారు.

<strong>SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్</strong>SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్

ఏంటి ప్రయోజనం

ప్రస్తుతం మార్కెట్ ధర కంటే సుమారు 15 శాతం ధర ఎక్కువ పెట్టి మరీ షేర్లు కొనేందుకు సిద్ధమైంది అంటే దాని అర్థం కంపెనీపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికే అని అర్థం చేసుకోవాలి. వరుసగా రెండేళ్లలో మూడోసారి విప్రో ఇలాంటి బైబ్యాక్ నిర్ణయాన్ని తీసుకుంది. సంస్థ దగ్గర మూలుగుతున్న నగదు నిల్వలను తగ్గించుకునేందుకు, షేర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు సంస్థలు ఇలాంటి బైబ్యాక్ ప్రకటనలు చేస్తాయి. అయితే మార్కెట్లో సుమారు 227 కోట్ల షేర్ల వరకూ
ఉన్నాయి. మొత్తం షేర్ క్యాపిటల్ 905 కోట్ల షేర్లు అయితే అందులో ప్రమోటర్ల వాటా సుమారు 75 శాతం దాకా ఉంది. మిగిలిన రిటైల్ పోర్షన్ చూస్తేనే 227 కోట్ల షేర్లు వస్తాయి. ఇందులో 32 కోట్ల షేర్లను సంస్థ తిరిగి కొనాలని చూస్తోంది. అంటే మన దగ్గర పది షేర్లు ఉండి మనం కూడా ఈ బైబ్యాక్‌లో పాల్గొంటే ఒక్క షేర్ మాత్రమే రూ.325కు అమ్ముడయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

English summary

ఒక్కో షేర్‌ను రూ.325కి కొంటాం - విప్రో బంపర్ ఆఫర్ | Wipro approves Rs 10,500 crore buyback at Rs 325/share

With an objective to return surplus cash to shareholders, Wipro board on Tuesday approved buyback of up to 32.31 crore equity shares for consideration of up to Rs 10,500 crore at Rs 325 apiece
Story first published: Wednesday, April 17, 2019, 11:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X