For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ జైల్లో ఉన్నా 100 శాతం చెల్లిస్తా, నా పోటీదారు ఐనా: జెట్ ఎయిర్వేస్‌పై మాల్యా సానుభూతి

|

లండన్: జెట్ ఎయిర్వేస్ తాజా పరిస్థితిపై విజయ్ మాల్యా విచారం వ్యక్తం చేశాడు. నరేష్ గోయల్, నీతా గోయల్‌లకు సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. అలాగే, బ్యాంకులకు తాను చెల్లించాల్సిన సొమ్ముపై కూడా స్పందించాడు. తాను భారతీయ జైలుకు వెళ్లినా తీసుకున్న వేల కోట్ల అప్పులు తెరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇది అంతర్జాతీయ సర్వీసులను నిలిపేసిన ఈ సంస్థ తాత్కాలిక మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మాల్యా స్పందించాడు. జెట్ ఎయిర్వేస్ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం కారణమని తప్పుబట్టాడు. ప్రైవేటు సంస్థలపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నాడు. భారత ప్రభుత్వం చొరవ చూపిస్తే జెట్ ప్రస్తుత సమస్యనుండి గట్టెక్కడం పెద్ద ఇబ్బంది కాదని పేర్కొన్నాడు.

గతంలో కింగ్ ఫిషర్‌కు జెట్ ఎయిర్వేస్ గట్టి పోటీని ఇచ్చిందని, అలాంటి ప్రైవేటు ఎయిర్ లైన్స్‌ను ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి రావడం బాధాకరమని, ప్రైవేటు రంగ విమానాయ సంస్థ అనే కారణంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మాల్యా ఆరోపించాడు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఎయిరిండియాను బయటపడేసేందుకు రూ.35వేల కోట్లు ఉపయోగించారని, జెట్ ఎయిర్వేస్ తమకు పోటీదారు అయినప్పటికీ ఆ సంస్థ ప్రస్తుత పరిస్థితిపై తాను నరేష్ గోయల్‌కు, నీతా గోయల్‌కు సంతాపం తెలుపుతున్నానని పేర్కొన్నాడు. జెట్ ఎయిర్వేస్ కోసం వారు ఎంతో కష్టపడ్డారని చెప్పాడు.

ఆయుష్మాన్ భారత్: మీరు అర్హులా కాదా ఇలా తెలుసుకోండిఆయుష్మాన్ భారత్: మీరు అర్హులా కాదా ఇలా తెలుసుకోండి

Vijay Mallya says he feels sorry for Jet Airways, ready to pay even from Indian jail

తాను కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టానని, ఇది వేగంగా ముందుకు వెళ్లిందని, భారతదేశంలో లార్జెస్ట్ అండ్ మోస్ట్ అవార్డెడ్ ఎయిర్ లైన్స్‌గా నిలిచిందని మాల్యా పేర్కొన్నాడు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి కింగ్ ఫిషర్ పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నది వాస్తవమేనని చెప్పాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను 100 సాతం చెల్లిస్తానని చెబుతున్నానని, కానీ బ్యాంకులే తీసుకోవడం లేదని, పైగా తనపై నేర అభియోగాలు వేస్తున్నారని చెప్పాడు. ఇది ఎయిర్ లైన్స్ ఖర్మ అన్నాడు.

నేను వంద శాతం బ్యాంకు రుణాలు చెల్లిస్తానని చెప్పినప్పుడల్లా మీడియా తనను భారత్‌కు అప్పగించే విషయమై మాట్లాడుతోందని మాల్యా అన్నాడు. తాను ఎక్కడున్నా లోన్లు చెల్లిస్తానని చెప్పాడు. లండన్‌లో ఉన్నా, భారత జైల్లో ఉన్నా రుణాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయినా బ్యాంకులు ఎందుకు తీసుకోవడం లేదన్నాడు. నేను తిరిగి చెల్లిస్తానని చెబితే బ్యాంకులు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు.

English summary

ఏ జైల్లో ఉన్నా 100 శాతం చెల్లిస్తా, నా పోటీదారు ఐనా: జెట్ ఎయిర్వేస్‌పై మాల్యా సానుభూతి | Vijay Mallya says he feels sorry for Jet Airways, ready to pay even from Indian jail

Vijay Mallya has once again questioned Indian banks on why they are refusing to accept the money he is ready to repay them. In a series of tweets on Wednesday, Vijaya Mallya said he feels sorry for Naresh Goyal who recently had to step down as chairperson of Jet Airways, an airline he founded.
Story first published: Wednesday, April 17, 2019, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X