For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిటర్న్స్‌లో ఈసారి ఈ మార్పులను ఖచ్చితంగా తెలుసుకోండి

By Chanakya
|

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ తాజాగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్న్ పత్రాలను నోటిఫై చేసింది. ప్రతీ సారి యూనియన్ బడ్జెట్ తర్వాత సిబిడిటి ఇలా నోటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సారి చాలా మార్పులకు శ్రీకారం చుట్టారు. అందుకే రిటర్న్స్ ఫైల్ చేసే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్లను మీ కోసం ఇస్తున్నాం. తప్పక తెలుసుకోండి.

ఈ-ఫైలింగ్ కంపల్సరీ

ప్రతీ ఇండివిడ్యుయల్ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే ఫైల్ చేయాల్సి ఉంటుంది. 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఆంక్షలతో కూడిన సడలింపు ఉంటుంది. రూ.5 లక్షలకు లోపు ఆదాయం ఉండి,పన్ను రీఫండ్ పొందని వాళ్లు గతంలో పేపర్ ఫైలింగ్ చేసే వెసులుబాటు ఉండేది. ఈ ఏడాది నుంచి అది కూడా తీసేశారు.

కొత్త ఐటీ రిటర్న్స్ ఫాంలో ఈ వివరాలన్నీ ఇవ్వాల్సిందే: ఇవి తెలుసుకోండికొత్త ఐటీ రిటర్న్స్ ఫాంలో ఈ వివరాలన్నీ ఇవ్వాల్సిందే: ఇవి తెలుసుకోండి

సహజ్ - ఐటీఆర్ 1 ఎవరికి

2018-19లో రెసిడెంట్ హోదా ఉండి, ఇండియాలో ఉన్నవారు, జీతం ద్వారా
ఆదాయం పొందుతున్నవారు, ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్న వారు, వ్యవసాయం ద్వారా రూ.5 వేల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నవారు సహజ్ (ఐటీఆర్ -1) ద్వారా రిటర్న్స్ పైల్ చేయొచ్చు.

ఇండివిడ్యుయల్ అయినప్పటికీ ఏదైనా సంస్థలో డైరెక్టర్‌గా ఉన్నా, లేకపోతే ఏదైనా లిస్ట్ కాని కంపెనీలో షేర్లు కలిగి ఉన్నా వాళ్లు ఐటీఆర్ 1 ఫైల్ చేయడానికి లేదు. అలాంటి వాళ్లు ఐటీఆర్ -2 ఫార్మ్‌లో రిటర్న్స్ దాఖలు చేయాలి.

points to note about new tax filing return norms

ఐటీఆర్ 2 ఎవరెవరికి

లాభాల ద్వారా ఆదాయం పొందే వాళ్లు, వ్యాపారం లేదా ప్రొఫెషన్ ద్వారా ఆదాయం పొందేవాళ్లు వీటిని పరిధిలోకి రారు. కొత్త ఫార్మ్ ప్రకారం సదరు ఇండివిడ్యుయల్ ఎన్ని రోజులు ఇండియాలో ఉన్నారు అనే అంశాన్ని తప్పకుండా రాయాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక ఏడాదితో పాటు అంతకుముందు నాలుగేళ్లు ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పేయర్స్ అయితే వాళ్ల ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సహా వాళ్ల గృహం ఏ జురిస్‌డిక్షన్ పరిధిలోకి వస్తుందో కూడా చెప్పాలి.(విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు) వీటితో పాటు క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్‌లో కూడా మార్పులు చేశారు. ఐటీ యాక్ట్ 1961 పద్ధతిలో షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఎవరికైనా బదలాయించారా అనే అంశాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఏదైనా (ఇమ్మూవబుల్ ప్రాపర్టీ) ఆస్తిని ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేశారా అనే సమాచారం కూడా రాయాలి.

అన్‌లిస్టెడ్ షేర్లు కూడా...

ప్రైవేట్ కంపెనీలు ఏదైనా షేర్లు (అన్ లిస్టెడ్) షేర్లు మీకు ఇచ్చిందని అనుకుందాం. ఇకపై ఆ వివరాలను కూడా రాసేందుకు ప్రత్యేక టేబుల్ పెట్టారు. సదరు కంపెనీ ప్యాన్ నెంబర్ సహా ఏడాది ప్రారంభంలో ఓపెనింగ్ షేర్లు చివర్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా మెన్షన్ చేయాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఎవరికైనా ఆ షేర్లను ట్రాన్స్‌ఫర్ చేశారా లేదా అనే సమచారాన్ని కూడా ఐటీఆర్-2లో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంది.

వ్యవసాయ ఆదాయం కూడా..

వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం మినహాయింపు పరిధిలోకి వస్తుంది.
అయితే ఒక వేళ వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 లక్షలకు మించితే కొంత అదనపు సమాచారాన్ని ఇవ్వాలి. భూమి ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఉంది, పిన్ కోడ్ వివరాలు, ఎంత భూమి ఉంది, ఓనర్ ఎవరు.. వంటి వివరాలను రిటర్న్స్‌లో వివరించాలి.

ఎందుకీ వివరాలు

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మధ్య టెక్నాలజీని విపరీతంగా వినియోగిస్తోంది. బిగ్ డేటా ఎనలిటిక్స్ వంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. అందుకే ఇలాంటి డేటాను సేకరించి.. తమ దగ్గర అప్పటికే ఉన్న సమాచారంతో పోల్చి చూసుకుంటారు. ఏదైనా తేడా అప్పుడు మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ తప్పు చేయని వాళ్లు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. పన్నులు ఎగ్గొట్టేవారికి ఎప్పుడూ భయం వెంటాడుతూనే ఉంటుందనే
సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

English summary

ఐటీ రిటర్న్స్‌లో ఈసారి ఈ మార్పులను ఖచ్చితంగా తెలుసుకోండి | points to note about new tax filing return norms

points to note about new tax filing return norms.
Story first published: Wednesday, April 17, 2019, 17:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X