For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్‌వేస్ సేవలు రద్దు ! గాలిలో దీపంలా రూ.8000 కోట్ల అప్పు

By Chanakya
|

జెట్ ఎయిర్ సేవలు ఈ రోజు అర్థరాత్రి నుంచి తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలతో పాటు డిజిసిఏ, సివిల్ ఏవియేషన్ సహా కేంద్ర ఆర్థిక శాఖలకు ఈ సమాచారాన్ని ఇచ్చింది జెట్ ఎయిర్ వేస్.

ఎమర్జెన్సీ ఫండింగ్ కోసం ఎదురుచూస్తున్న తమకు రుణదాతల నుంచి ఎలాంటి చేయూతా అందలేదని, అందుకే ఇక ఆప్షన్స్ ఏవీ లేకపోవడంతో సేవలను తాత్కాలికంగా ఈ రోజు అర్థరాత్రి నుంచి
నిలిపివేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. దీంతో తాత్కాలికంగా జెట్ ఎయిర్‌కు చెందిన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నిలిచిపోబోతున్నాయి.

25 ఏళ్లుగా మెరుగైన సేవలను అందిస్తూ వస్తున్న జెట్ ఎయిర్ గత కొద్ది కాలం నుంచి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఓ వెలుగు వెలిగిన సంస్థ ఈ తరహాలో అర్థాంతరంగా ముగించడం చాలా బాధగా ఉందని మేనేజ్‌మెంట్ తమ ఉద్యోగులకు తెలిపింది. అయితే రుణదాతలకు పూర్తిగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రధానంగా లీడ్ బ్యాంక్ అయిన ఎస్బీఐ చేపట్టే ప్రక్రియ కోసం వేచిచూస్తామని చెబ్తోంది.

Jet Suspends Ops, Last Flight From Amritsar To Mumbai Tonight

ఇప్పటికే రూ.8000 కోట్లకు పైగా బకాయి పడిన జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.400 కోట్ల ఎమర్జెన్సీ ఫండింగ్ ఇచ్చేందుకు కూడా రుణదాతలెవరూ ముందుకు రాలేదు. దీంతో కనీసం ఫ్యూయెల్ ఛార్జీలు కూడా చెల్లించే స్థితిలో లేని సంస్థ చేతులెత్తేసింది. అయితే ఇప్పటికే ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందో రాదో అనుకుంటున్న తరుణంలో మళ్లీ కొత్తగా అప్పు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధపడలేదు. అయితే ఈ పరిస్థితుల్లో సంస్థను అలా వదిలేస్తే మొత్తానికే మోసం వస్తుందని, అందుకే ఏదో విధంగా ఒడ్డున పడేసి కొద్దోగొప్పో రాబట్టుకోవాలని ఎస్బీఐ ఆలోచిస్తోంది. ఇందుకోసం ఆర్థిక శాఖతో కలిసి ఓ ప్రణాళిక రూపొందించుకున్నా అది వర్కవుట్ అయ్యేట్టు కనిపించడం లేదు.

జెట్ ఎయిర్ సేవలు నిలిచిపోవడంతో ఇప్పుడు సుమారు 20 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు రోడ్డున పడింది. ఇప్పుడు సంస్థను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు ఇచ్చిన రూ.8000 కోట్లను ఎలా రాబట్టుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాయని ఆర్థిక సంస్థలు.

అన్ని బ్యాంకులూ, ఆర్థిక సంస్థలూ కలిసి కూడా రూ.400 కోట్ల కోట్ల ఎమర్జెన్సీ ఫండింగ్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. మొత్తంగా జెట్ ఎయిర్ వివిధ సంస్థలకు సుమారు రూ.8000 కోట్లు బకాయిపడింది.

English summary

జెట్ ఎయిర్‌వేస్ సేవలు రద్దు ! గాలిలో దీపంలా రూ.8000 కోట్ల అప్పు | Jet Suspends Ops, Last Flight From Amritsar To Mumbai Tonight

Jet Suspends Ops, Last Flight From Amritsar To Mumbai Tonight
Story first published: Wednesday, April 17, 2019, 20:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X