For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లైట్ క్యాన్సిలేషన్: ట్రావెల్ ఇన్స్‌రెన్స్ తీసుకోవడం మరిచిపోవద్దు

|

జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ఆ ఫ్లైట్‌లో బుక్ చేసుకున్న వారి టిక్కెట్లు క్యాన్సిల్ అయ్యాయి. టిక్కెట్ బుక్ చేసుకున్న వారు తమ డబ్బులు రీఫండ్ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఎయిర్ లైన్స్ ఎలాంటి సందర్భంలో రీఫండ్ చేస్తుందో తెలుసుకుందాం. విమానం రద్దైతే ఎయిర్‌లైన్స్ మనీని రీఫండ్ చేస్తాయి లేదా ప్రత్యామ్నాయం చూపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మాత్రం రీఫండ్ ఉండదు. ఎయిర్ లైన్స్ ప్రత్యామ్నాయం చూపించినప్పటికీ ప్రయాణీకుడు యాక్సెప్ట్ చేయకుంటే దానికి కంపెన్షేషన్ చెల్లించరు. అంతేకాకుండా అసాధారణ పరిస్థితుల్లోను కంపెన్షేషన్ ఉండదు.

<strong>విప్రో బంపర్ బొనాంజా: రూ.10,500 కోట్లతో రూ.281షేర్‌కు రూ.325</strong>విప్రో బంపర్ బొనాంజా: రూ.10,500 కోట్లతో రూ.281షేర్‌కు రూ.325

ఇన్సురెన్స్ కంపెన్షేషన్

ఇన్సురెన్స్ కంపెన్షేషన్

విమానం రద్దయిన లేదా డిలే అయిన పరిస్థితుల్లో ట్రావెల్ ఇన్సురెన్స్ ప్రయాణీకులకు ఉపయోగపడుతుంది. పై సందర్భాల్లో కంపెన్షేషన్ వస్తుంది. పాలసీ నియమ నిబంధనల మేరకు వీటిని చెల్లిస్తారు. అయితే ప్రయాణీకుడే స్వయంగా ఆలస్యమైతే మాత్రం చెల్లించరు. విమానాలు రద్దయిన సమయంలో ఉపయోగపడే ఈ ట్రావెల్ ఇన్సురెన్స్ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే సమయంలో తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. అమెరికా, యూరోపిన్ కంట్రీస్‌కు ట్రావెల్ ఇన్సురెన్స్ మాండేటరీ. ఎవరైనా ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ఫారెన్ ట్రిప్స్ వేయాలనుకుంటే యాన్యువల్ ట్రావెల్ ఇన్సురెన్స్ కవర్ తీసుకోవడం మంచిది.

 ఇలాంటి సందర్భాల్లో రీఫండ్

ఇలాంటి సందర్భాల్లో రీఫండ్

ప్రయాణీకులు ట్రిప్ క్యాన్సిలేషన్ ఇన్సురెన్స్ తీసుకోని సందర్భంలో, ఇంటర్నేషనల్ ఫ్లైట్ రద్దయిన సమయంలో కంపెన్షేషన్ చెల్లించరు. ట్రిప్ క్యాన్సిలేషన్ ఇన్సురెన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఫ్లైట్ టిక్కెట్స్, అకామిడేషన్‌కు రీఫండ్ అవుతుంది. తీవ్రవాద దాడులు, రాజకీయ డిస్టర్బెన్సెస్ కారణంగా విమానాలు రద్దయిన పరిస్థితుల్లో... సంబంధింత బీమా ఉంటే కంపెన్షేషన్ చెల్లిస్తారు. ఏ ఇన్సురెన్స్ అయినా క్లెయిమ్ చేసుకునేందుకు అన్ని రకాల బిల్స్, డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుకోవాలి.

 కంపన్షేషన్ కవర్

కంపన్షేషన్ కవర్

అన్ని జనరల్ ఇన్సురెన్స్ కంపెనీలు బీమాను ఆఫర్ చేస్తాయి. ఇందులో మెడికల్, నాన్ మెడికల్ ఎమర్జెన్సీలు ఉంటాయి. పాస్‌పోర్ట్ పోయినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ట్రిప్ క్యాన్సిల్ లేదా డిలే అయితే కంపెన్షేషన్ ఉంటుంది. అబ్రాడ్‌లో మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ. మీ ఎక్స్‌పెండిచర్ ఖర్చుకు తగిన హెల్త్ ఇన్సురెన్స్ కవర్ చూసుకోండి. మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అంశాన్ని పక్కన పెడితే చాలా పాలసీలు నాన్ మెడికల్‌కు సంబంధించినవే. ట్రావెల్ ఇన్సురెన్స్ తీసుకుంటే చివరి నిమిషంలో ట్రావెల్ ప్లాన్ మార్చుకున్నా, బ్యాకేజీ లాస్ వంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది.

English summary

ఫ్లైట్ క్యాన్సిలేషన్: ట్రావెల్ ఇన్స్‌రెన్స్ తీసుకోవడం మరిచిపోవద్దు | Flight cancellations: Remember to buy travel insurance

As cash strapped Jet Airways has cancelled most of its flights and is staring at a closure after it failed to find financial support, passengers who have booked their tickets in advance are seeking refund from the airline.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X