టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో ఫ్రాడ్ చేసేవాళ్లు కూడా అలాగే పెరుగుతున్నారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఏటీఎం ప్రాడ్ కలకలం రేపుతోంది. ఏటీఎం మోసం ద్వారా పీఎన్‌బీలోని 61 ఖాతాల్లో నుంచి ఏకంగా రూ.15 లక్షలు గల్లంతయ్యాయి. ఇప్పటికే బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద స్కాంలో చిక్కుకున్న పీఎన్‌బీలో తాజాగా అక్రమ లావాదేవీల ఉదంతం వెలుగు చూడటం ప్రకంపనలు రేపుతోంది. ఇది ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈ విషయాన్ని పీఎన్‌బీ బ్యాంక్ అధికారులు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం 3 రోజుల వ్యవధిలో 61 మంది అకౌంట్స్ నుంచి దాదాపు రూ.15 లక్షల గల్లంతయ్యాయి. ఏటీఎం మోసాలపై బ్యాంకులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. బ్యాంకులు తగిన సూచనలు జారీ చేస్తున్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) లకు సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయి.

ఏప్రిల్ 8వ తేదీ నుంచి తన ఖాతానుంచి తన ప్రమేయం లేకుండానే గుర్తు తెలియని లావాదేవీ జరిగిందని ఒక అకౌంట్ హోల్డర్ పీఎన్‌బీ వసంత్ విహార్ బ్రాంచ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో బ్యాంక్ అధికారులు అప్రమత్తమై, ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఫిర్యాదుదారుల జాబితా పెరిగింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం మొత్తం రూ.14,97,769 సొమ్ము గల్లంతయింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు వసంత్ విహార్ డీసీపీ(సౌత్ వెస్ట్) దేవేందర్ ఆర్యా తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications