క్వార్టర్ 4 ఎఫెక్ట్: దూసుకెళ్లిన టీసీఎస్, డీలాపడిన ఇన్ఫోసిస్

టీసీఎస్, ఇన్ఫోసిస్ గతవారం ఒకేరోజు క్వార్టర్ 4 ఫలితాలను ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు అంచనాలను మించి రాణించాయి. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ ఇన్ఫోసిస్ అంచనా కంటే తక్కువగా ఆదాయ అంచనాలను ప్రకటించింది. దీంతో ఈ ప్రభావం కంపెనీ కంపెనీ షేర్లపై పడింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో సాగాయి. టీసీఎస్‌ షేర్లు మాత్రం లాభాల్లో కనిపించాయి.

క్వార్టర్ 4లో మంచి లాభాలు వచ్చినందున సోమవారం నాడు టీసీఎస్ షేర్లు 3 శాతం పెరిగాయి. ట్రేడింగ్ ఆరంభంలో బీఎస్‌ఈలో షేరు ధర దాదాపు 3 శాతం లాభపడి రూ.2,085 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం మూడు గంటలకు 2076 వద్ద కొనసాగింది. సాయంత్రం గం.3.50 నిమిషాలకు 2,113 వద్ద ట్రేడ్ అయింది. గత వారం కంటే 4.89 శాతం లాభపడింది.

TCS rises over 3% on strong Q4 earnings

మరోవైపు, ఇన్ఫోసిస్ షేర్లు భారీగా నష్టపోయాయి. 4.56 శాతం నష్టంతో రూ.713.70 వద్ద ప్రారంభమైన షేర్ ఆ తర్వాత మరింత దిగజారింది. ఓ సమయంలో ఐదు శాతం నష్టంతో ట్రేడ్‌ అయింది. ఆ తర్వాత కోలుకున్నా నష్టాల్లో కొనసాగింది. సాయంత్రం గం.3.45 నిమిషాలకు కాస్త కోలుకొని 728.20 వద్ద ట్రేడ్ అయింది. అయినా 2.61 శాతం నష్టంతో ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+