For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమవారం లాభాల బోణీ, స్మాల్ క్యాప్స్‌దే ఈ రోజు హడావుడి

By Chanakya
|

స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభంలో లాభాలతో బోణీ కొట్టాయి. బ్యాంకింగ్, మెటల్, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ నుంచి వచ్చిన మద్దతుతో నిఫ్టీ 11700 పాయింట్లకు అతి సమీపంలో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రోత్సాహక సంకేతాలకు తోడు దేశీయంగా బయింగ్ సపోర్ట్ లభించడం కూడా ఈ రోజు లాభాలకు కారణంగా చెప్పుకోవచ్చు. చివరకు సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 38, 906 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 47 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 166 పాయింట్ల లాభంతో ముగిసింది.

సెక్టోరల్ గెయిన్స్

రియాల్టీ, మెటల్, ఐటీ, ఆటో రంగ కౌంటర్లు లాభాల్లో ముగిస్తే మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్ ఇండిసెస్ మాత్రమే నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు రెండు అర శాతానికి పైగా లాభపడ్డాయి.

టాటా మోటార్స్, టీసీఎస్, కోల్ ఇండియా, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఇన్ఫోసిస్, భారతి ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, యెస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

మిడ్ క్యాప్స్‌దే హవా

ఈ రోజు ఇండెక్సుల్లో పెద్దగా మొమెంటం లేకపోయినా మిడ్, స్మాల్, మైక్రో క్యాప్ స్టాక్స్‌లో మాత్రం మంచి కొనుగోళ్లు సాగాయి. 63 మూన్స్, గుఫిక్ బయో, క్వాలిటీ, సుబెక్స్, మీర్జా ఇంటర్నేషనల్, పటేల్ ఇంజనీరింగ్, ఇన్ఫీబీమ్, డీఎఫ్ఎం ఫుడ్స్, ప్రకాశ్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ 5 శాతానికిపైగా లాభపడ్డాయి.

Sensex ends 139 pts higher, Nifty near 11,700

టాటా మోటర్స్ స్పీడ్

టాటా మోటార్స్ స్టాక్ గత కొంత కాలం నుంచి జోరు పెంచింది. ఈ మధ్య రూ.160 వరకూ దిగొచ్చిన స్టాక్‌లో మెల్లిగా బయింగ్ సపోర్ట్ లభిస్తోంది. ఈ రోజు కూడా ఈ స్టాక్ 7 శాతానికిపైగా లాభపడి రూ.231 దగ్గర క్లోజైంది. ఈ స్టాక్ ఇప్పటికే వారంలో 15 శాతం, నెలలో సుమారు 29 శాతం వరకూ పెరిగింది.

గోద్రెజ్ ప్రాపర్టీస్‌ పరుగు

కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులు లాంఛ్ చేయడం, మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించవచ్చనే అంచనాలు, మంచి సేల్స్ నెంబర్స్ వంటివన్నీ గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్ పైపైకి దూకేందుకు కారణమవుతున్నాయి. ఈ స్టాక్ ఈ రోజు కూడా సుమారు 6 శాతం పెరిగి రూ.957 దగ్గర క్లోజైంది.

స్పైస్‌జెట్.. గాల్లో తేలుతోంది

ముంబై నుంచి నాలుగు విదేశీ రూట్లకు నేరుగా ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించడంతో పాటు మొత్తంగా ఏడు ఇంటర్నేషనల్ రూట్లకు సేవలను ప్రారంభించడంతో స్పైస్ జెట్ స్టాక్ గాల్లో తేలింది. మే ఆఖరు నాటికి మరో 8 విదేశీ రూట్లకు సేవలను ప్రారంభిస్తామని స్పైస్ జెట్ వెల్లడించింది. ఈ వార్తల నేపధ్యంలో స్టాక్ సుమారు 9 శాతం పెరిగి రూ.119.35 దగ్గర క్లోజైంది.

పీసీ జ్యువెలర్స్ షైనింగ్

గతవారం పిసి జ్యు్వెలర్స్ స్టాక్‌లో సుమారు 50 లక్షల షేర్లు బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారాయి. అప్పటి నుంచి ఈ స్టాక్‌లో మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి. గతవారంలో ఈ స్టాక్ సుమారు 39 శాతం, నెలలో 52 శాతం స్టాక్ పైకెగిసింది. ఈ రోజు కూడా పిసిజ్యువెలర్స్ స్టాక్ 13 శాతం లాభంతో 126.25 దగ్గర క్లోజైంది.

ఇన్ఫోసిస్ నష్టాలు

ఇన్ఫోసిస్ స్థిరమైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించినప్పటికీ గైడెన్స్ విషయంలో నిరుత్సాహ పరచడంతో స్టాక్ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో స్టాక్ రూ.714 కనిష్ట స్థాయి వరకూ పడిపోయింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకున్నప్పటికీ సుమారు 3 శాతం నష్టంతో రూ.726.65 దగ్గర ఇన్ఫోసిస్ స్టాక్ క్లోజైంది.

ఇదే రంగానికి చెందిన టీసీఎస్ మాత్రం మెరుగైన ఫలితాల నేపధ్యంలో సుమారు 5 శాతం పెరిగింది. చివరకు రూ.2113 దగ్గర క్లోజైంది. టాటా ఎలిక్సి, విప్రో కూడా మూడు శాతం వరకూ లాభపడ్డాయి.

ఈ వారం మూడు రోజులే

ఈ వారంలో మూడు ట్రేడింగ్ రోజులే ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ నెల 17వ తేదీన మహవీర్ జయంతి, 19ల గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు.

English summary

సోమవారం లాభాల బోణీ, స్మాల్ క్యాప్స్‌దే ఈ రోజు హడావుడి | Sensex ends 139 pts higher, Nifty near 11,700

Benchmark indices ended higher but off day's high on Monday with Nifty finished below 11,700 level.
Story first published: Monday, April 15, 2019, 16:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X