For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, SBIలో 8,900 ఉద్యోగాలు: ఇలా దరఖాస్తు చేసుకోండి, మరిన్ని వివరాలు...

|

ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఈ నెల 12వ తేదీ నుంచి క్లర్క్ రిక్రూట్మెంట్స్ ప్రారంభమయ్యాయి. మే 3వ తేదీ వరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ మొత్తం 8,653 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)/క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్బీఐ ఇటీవలే రెండువేల పీవో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. రాత పరీక్ష ఉంటుంది. అన్ని వివరాలు ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ 2019లో ఉన్నాయి.

<strong>SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్</strong>SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్

 ఇలా దరఖాస్తు చేసుకోవాలి

ఇలా దరఖాస్తు చేసుకోవాలి

అర్హత కలిగిన భారతీయుడి నుంచి ఎస్బీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు ఇలా పూర్తి చేయాలి.

- తొలుత sbi.co.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

- Career పేజీ పైన క్లిక్ చేయండి. (కుడివైపున careers click here అని ఉంటుంది.)

- JOIN SBI పైన మౌస్ పెడితే... current openings అని కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయాలి.

- పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో recruitment for junior associates ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

- Download Advertisement ను సెలక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు ఇందులో ఉంటాయి.

- Apply Online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

- ఆ తర్వాత రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

క్లర్క్ ఉద్యోగానికి అర్హతలు

క్లర్క్ ఉద్యోగానికి అర్హతలు

మొత్తం 8,653 ఖాళీలు ఉన్నాయి. మరో 251 బ్యాక్ లాగ్‌లతో కలిపి 8,904 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 425, ఏపీలో 253 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ పేరు.. జూనియర్ అసోసియేట్స్. దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఏ రాష్ట్రానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్ష ఆ రాష్ట్రంలోనే రాయాల్సి ఉంటుంది. అలాగే లోకల్ లాంగ్వేజీ పరీక్షలో అర్హత సాధించాలి.

ఎలా ఎంపిక చేస్తారు, పరీక్షలు ఎప్పుడు?

ఎలా ఎంపిక చేస్తారు, పరీక్షలు ఎప్పుడు?

ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు, అభ్యర్థులు ఎంపిక చేసుకునే లోకల్‌ లాంగ్వేజీ పైన నిర్వహించే టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో ప్రతిభ చూపే అభ్యర్థులలో పోస్టుల సంఖ్యకు పదిరెట్ల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో సాధించిన మార్కులతో మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఎస్బీఐ ప్రిలిమినరీ పరీక్షలు జూన్ నెలలో ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్స్ ఆగస్ట్ 10వ తేదీన ఉంటాయి.

English summary

గుడ్‌న్యూస్, SBIలో 8,900 ఉద్యోగాలు: ఇలా దరఖాస్తు చేసుకోండి, మరిన్ని వివరాలు... | SBI Clerk Recruitment 2019: Application Open for 8,653 Vacancies, Check Dates, Details Here

The State Bank of India has released job notifications on April 12 (today) for 8,653 vacancies. The SBI has invited application for the post of Junior Associates (Customer Support and Sales) or SBI Clerk. Candidates willing to register for the SBI Clerk post can apply on its official website sbi.co.in
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X